ఈయన జగన్ వల్ల గెలవలేదట.. అంతా తనవల్లనేనట

ముఖ్యమంత్రి జ‌గ‌న్‌కు సొంత జిల్లా క‌డ‌ప‌లో రాజకీయ కుంప‌ట్లు ముసురుకుంటున్నాయి. నానాటికీ ఇవి పెద్దవ‌వుతూ.. పార్టీని ఇర‌కాటంలోకి నెడుతున్నాయి. ప్రతిప‌క్షం బ‌లోపేతం అయినా అవ‌క‌పోయినా.. వైసీపీ మాత్రం [more]

Update: 2021-01-22 02:00 GMT

ముఖ్యమంత్రి జ‌గ‌న్‌కు సొంత జిల్లా క‌డ‌ప‌లో రాజకీయ కుంప‌ట్లు ముసురుకుంటున్నాయి. నానాటికీ ఇవి పెద్దవ‌వుతూ.. పార్టీని ఇర‌కాటంలోకి నెడుతున్నాయి. ప్రతిప‌క్షం బ‌లోపేతం అయినా అవ‌క‌పోయినా.. వైసీపీ మాత్రం బ‌ల‌హీన ప‌డే ప‌రిస్థితి వ‌స్తోంద‌ని అంటున్నారు. ఆ మాట‌కు వ‌స్తే గ‌త రెండు ద‌శాబ్దాల్లో అస‌లు ఇక్కడ టీడీపీకి సీనే లేదు. నాడు వైఎస్‌.. నేడు జ‌గ‌న్ వ్యక్తిగ‌త ఇమేజ్‌తో కాంగ్రెస్‌, ఇప్పుడు వైసీపీకి తిరుగులేకుండా పోతోంది. అలాంటి చోట వైసీపీకి వ‌చ్చిన స‌మ‌స్య ఏంటి ? ఇంత‌కీ ఏం జ‌రుగుతోంది ? అనేది చూద్దాం. జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం జ‌మ్మలమ‌డుగు. ఇక్కడ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో సుధీర్‌రెడ్డి దాదాపు 53 వేల ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. అయితే.. ఇదంతా త‌న‌దే క్రెడిట్ అనుకుంటున్న ఆయ‌న‌.. కింది స్థాయి కేడ‌ర్‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దీంతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై స్థానిక వైసీపీ నాయ‌కులు అసంతృప్తితో ఉన్నారు.

పాతసీనే…..

ఇక‌, ఈ గ్యాప్‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నారు ఇటీవ‌లే పార్టీలో చేరిన మాజీ మంత్రి రామ‌సుబ్బారెడ్డి. ఈయ‌న టీడీపీ నుంచి వైసీపీలో కి జంప్ చేసిన సీనియ‌ర్ నాయ‌కుడు. జమ్మలమడుగు ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. అయితే..దివంగ‌త‌ వైఎస్‌ హయాంలో కాంగ్రెస్‌ పాగా వేసింది. తర్వాత కాంగ్రెస్ కేడ‌ర్ అంతా జ‌గ‌న్ వెంట న‌డ‌వ‌డంతో వైసీపీ జెండా ఎగిరింది. అంతకుముందు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి చుట్టూ ఇక్కడి రాజకీయాలు తిరిగేవి. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కేంద్రంగా రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. ఆయ‌న ఎవ‌రో కాదు ధ‌ర్మవ‌రం ఎమ్మెల్యే కేతిరెడ్డికి స్వయానా బావ‌మ‌రిది.

అంతా తనదేనంటూ….

డాక్టర్‌గా ఆయ‌న‌కు మంచి పేరున్నా.. రాజ‌కీయంగా ఎవ‌రిని ఎలా ? డీల్ చేయాలో తెలియ‌డం లేదు. ఎన్నిక‌ల్లో గెలిచాక ఆయ‌న ఎవ‌రినీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, కేవ‌లం తాను ఎంచుకున్న వారికి మాత్రమే కాంట్రాక్టులు.. ప‌నులు అప్పగిస్తున్నార‌ని కేడ‌ర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇంత మెజార్టీ రావ‌డానికి తానే కార‌ణం అనడంతో పాటు జ‌గ‌న్ కుటుంబం పేరు ఎందుకు ఇక్కడ ఎత్తుతారు ? ఇక్కడ తానే ఎమ్మెల్యేను అని వైసీపీ వాళ్లపైనే విరుచుకు ప‌డుతున్నార‌ట‌. మ‌రోవైపు రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వ‌చ్చినా.. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఏమాత్రం ఆయ‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో రామ‌సుబ్బారెడ్డి ఈగో దెబ్బతింద‌నే ప్రచారం జ‌రుగుతోంది.

రెండు వర్గాలుగా విడిపోయి…..

ఈ క్రమంలో ఆయ‌నే సొంత‌గా క్యాడ‌ర్‌ను త‌యారు చేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. దీంతో సుధీర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వారు, అసంతృప్తితో ఉన్నవారంతా.. కూడా రామ‌సుబ్బారెడ్డికి అనుకూలంగా మారిపోతున్నారు. ఇక సుధీర్‌రెడ్డి సీఎం జగన్ పేరెత్తితేనే మండిప‌డుతున్నార‌న్న విష‌యం రామ‌సుబ్బారెడ్డి వ‌ర్గం బాగా ప్రచారం చేస్తూ వాళ్లను త‌మ వైపున‌కు తిప్పుకుంటోంది. దీనిని ఎంత‌గా అరిక‌ట్టాల‌న్నా.. సుధీర్‌రెడ్డికి సాధ్యం కావ‌డం లేద‌ని అంటున్నారు సానుభూతిప‌రులు. మ‌రోవైపు.. ఈ రెండు వ‌ర్గాల‌తోనూ క‌ల‌వ‌ని నాయ‌కులు మ‌రో గ్రూపు ఏర్పాటు చేసుకుని.. మ‌రో వ‌ర్గంగా చ‌లా మ‌ణి అవుతున్నారు. అయితే.. వీరిని వెనుకుండి న‌డిపిస్తున్న‌ది ఎవ‌ర‌నేది తెలియ‌దు. కానీ, ఇప్పుడు జ‌మ్మల‌మ‌డుగు రాజ‌కీయం మాత్రం సంచ‌ల‌నంగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇది ఎటు దారితీస్తుందో చూడాలి.

Tags:    

Similar News