జ‌నాల సొమ్ము.. జ‌గ‌న్ కంపెనీల‌కేనా ? ఇలాగైతే ఎలా?

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు.. చాలా వివాదాల‌కు కేంద్రంగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం త‌ర‌ఫున జ‌రుగుతున్న కొన్ని కార్యక్రమాలు ముఖ్యమంత్రి సొంత కంపెనీల‌కు భారీ ఎత్తున [more]

Update: 2021-02-20 02:00 GMT

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు.. చాలా వివాదాల‌కు కేంద్రంగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం త‌ర‌ఫున జ‌రుగుతున్న కొన్ని కార్యక్రమాలు ముఖ్యమంత్రి సొంత కంపెనీల‌కు భారీ ఎత్తున ల‌బ్ధి చేకూరుస్తుండ‌డంపై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేప‌ట్టినా.. లేదా కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభిస్తున్నా.. భారీ ఎత్తున మీడియాలో ప్రక‌ట‌న‌లు ఇస్తోంది. దీనికి సంబంధించి తొలి ప్రియార్టీ జ‌గ‌న్ మీడియాకే ఇస్తుండ‌డం గ‌మ‌నార్హం. సాక్షి పేప‌ర్‌లోను.. సాక్షి టీవీకి ప్రభుత్వ ప్రక‌ట‌న‌లు వ‌స్తున్నాయి. జ‌గ‌న్ సీఎం అయిన 20 నెలల్లో ప్రభుత్వం ప్రారంభించిన ప్రతి కార్యక్రమం ప్రక‌ట‌నా సాక్షి మీడియాలో ఫ్రంట్ పేజ్‌లోనే వ‌స్తోంది. ఒక్క సాక్షికి కోట్లాది రూపాయ‌ల ల‌బ్ధి చేకూరుతోంద‌న్నది రోజూ ఆ పేప‌ర్ చూస్తేనే అర్థమ‌వుతోంది.

మెజారిటీ వాటాను….

ఇక సాక్షి టీవీకి కూడా భారీ ఎత్తున ప్రభుత్వ ప్రక‌ట‌న‌లు వ‌స్తున్నాయి. త‌ద్వారా ప్రభుత్వం ప్రజా ధ‌నాన్ని.. ఆయా కంపెనీల‌కు వేల కోట్లలో వెచ్చిస్తోంది. దీనిపై ఇప్పటికే సోష‌ల్ మీడియా స‌హా ప‌లు రాజ‌కీయ ప‌క్షాల నుంచి కూడా విమ‌ర్శలు వ‌చ్చాయి. ఇక‌, ఇప్పుడు తాజాగా ప్రభుత్వం కీల‌కంగా భావిస్తున్న పేద‌ల ఇళ్ల ప‌థ‌కం కింద‌.. ఇప్పటికే 25 ల‌క్షల మంది పేద‌ల‌కు ఇళ్ల స్థలాల‌ను పంపిణీ చేశారు. వీటిలో ఇళ్లను కూడా ప్రభుత్వమే నిర్మించి ఇచ్చేందుకు రెడీ అయింది. అయితే.. ఈ ఇళ్ల నిర్మాణాల‌కు సంబంధించి అయ్యే సిమెంటు వినియోగం మొత్తంలో మెజారిటీ వాటాను జ‌గ‌న్‌కు చెందిన భార‌తీ సిమెంట్స్‌కే అధికారులు క‌ట్టబెట్టారు.

భారతీ సిమెంట్స్ కు…..

భార‌తీ సిమెంట్స్ .. జ‌గ‌న్ కుటుంబానికి చెందిన సంస్థ. దీనిలో 49 శాతం వాటా.. వీరికే ఉంది. గ‌తంలో కొంత మేర‌కు న‌ష్టాల్లో ఉన్న ఈ కంపెనీ.. ఇటీవ‌ల కాలంలో పుంజుకుంది. కొన్నాళ్ల కింద‌ట పోల‌వ‌రం, సీమ ఎత్తిపోతల ప్రాజెక్టు, పుష్కరాల ప‌నుల‌కు సంబంధించిన కాంట్రాక్టులు కూడా ఈ సంస్థకే ద‌క్కాయి. ఇక‌, ఇప్పుడు ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన సిమెంటు వినియోగం కాంట్రాక్టును రాష్ట్రవ్యాప్తంగా భారతీ సిమెంట్స్‌కే ప్రభుత్వం అప్పగించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇది రాష్ట్రంలో చేప‌డుతున్న అతి పెద్ద ప్రాజెక్టు కావ‌డంతో భారీ ఎత్తున ఈ కంపెనీ లాభ‌ప‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. దీనిపై అటు ప్రతిప‌క్షాలు పెద్ద ఎత్తున విమ‌ర్శలు చేస్తుండ‌గా.. సోష‌ల్ మీడియాలోనూ జ‌నాల సొమ్ము జ‌గ‌న్ కంపెనీకేనా ? అన్న విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    

Similar News