త్వరలోనే కీలక మార్పు.. జగన్ నిర్ణయం
ఏపీలో త్వరలోనే కీలక మార్పు జరగనుందా ? ఆ దిశగా సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారా ? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ నేతలు. వారి మధ్య [more]
ఏపీలో త్వరలోనే కీలక మార్పు జరగనుందా ? ఆ దిశగా సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారా ? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ నేతలు. వారి మధ్య [more]
ఏపీలో త్వరలోనే కీలక మార్పు జరగనుందా ? ఆ దిశగా సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారా ? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ నేతలు. వారి మధ్య జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఈ విషయం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి విపక్షాలకు, అదే సమయంలో ఎన్నికల సంఘానికి మధ్య తీవ్ర వివాదాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం వారితో .. న్యాయ పరంగా పోరాటం చేస్తోంది. ఒకవైపు విమర్శలకు ప్రతి విమర్శలకు చేస్తూనే..కౌంటర్లు ఇస్తూనే.. మరోవైపు.. న్యాయ పోరాటం చేస్తోంది.
న్యాయపోరాటంలో…..
అయితే, ఈ న్యాయ పోరాటంలో జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా కన్నా.. వ్యతిరేకంగానే తీర్పులు వస్తున్నాయి. కీలకమైన ఎస్ఈసీ విషయం నుంచి రాజధాని భూముల నిర్ణయం వరకు అన్నింటిలోనూ జగన్‌కు వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే హైకోర్టు న్యాయమూర్తులు కొందరు తమపై పగబట్టారనే వ్యాఖ్యలను పరోక్షంగా చేయడంతోపాటు.. న్యాయమూర్తులకు వ్యతిరేకంగా.. పెట్టిన పోస్టుల విషయంలోనూ దూకుడుగా వ్యవహరించారు. ఇవన్నీ ఒక వైపు సాగుతుండగానే న్యాయమూర్తిని మార్చేలా చక్రం తిప్పారనే వ్యాఖ్యలు వినిపించాయి.
సరైన వాదనను….
ఈ క్రమంలోనే హైకోర్టు న్యాయమూర్తులు ఒకరిద్దరు మారారు. అయితే.. అప్పటికీ.. జగన్ ఆశించిన విధంగా న్యాయం లభించడం లేదనే వ్యాఖ్యలు వైసీపీలో వినిపిస్తున్నాయి. దీనిపై కొన్నాళ్లుగా వైసీపీలో అంతర్మథనం సాగుతోంది. సరైన వాదనలు వినిపించడం లేదనే అసంతృప్తి.. జగన్‌లోను కేబినెట్‌లోని కీలక మంత్రుల వద్ద చర్చ సాగుతోంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున దాదాపు 15 మంది వరకు సీనియర్ అడ్వొకేట్లు ఉన్నారు.
ఒకరిద్దరు తప్ప….
అయితే.. వీరిలో ఒకరిద్దరు తప్ప.. మిగిలిన వారు సరైన వాదన వినిపించడం లేదనే వైసీపీ సీనియర్లు అంటున్నారు. ఈ క్రమంలో అడ్వొకేట్ జనరల్.. శ్రీరాం సహా.. అందరినీ మార్చడం ఖాయమని జగన్ యోచిస్తున్నట్టు సమాచారం. జగన్ తీసుకుంటోన్న వరుస సంచలన నిర్ణయాల పరంపరలో ఇది మరోసారి రాజకీయాల్లో ప్రకంపనలు రేపడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే విషయంపై వైసీపీలో నేతల మధ్య గుసగుస వినిపిస్తుండడం గమనార్హం.