వచ్చే ఎన్నికలపై జగన్ అప్పుడే ప్లాన్.. ఏం చేస్తున్నారంటే?
వచ్చే ఎన్నికలపై వైసీపీ అధినేత.. సీఎం జగన్.. దృష్టి పెట్టారా ? పక్కా వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారా ? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ నాయకులు, [more]
వచ్చే ఎన్నికలపై వైసీపీ అధినేత.. సీఎం జగన్.. దృష్టి పెట్టారా ? పక్కా వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారా ? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ నాయకులు, [more]
వచ్చే ఎన్నికలపై వైసీపీ అధినేత.. సీఎం జగన్.. దృష్టి పెట్టారా ? పక్కా వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారా ? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ నాయకులు, ఏపీ సీఎంవో కీలక అధికారులు కూడా. నిజానికి రాష్ట్రంలో ఎన్నికలు జరిగి కేవలం 22 నెలలు మాత్రమే గడిచాయి. కాబట్టి వాస్తవానికి ఏ పార్టీ అయినా ఎన్నికలకు ఏడాది ముందు మాత్రమే దృష్టి పెట్టి ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలనే విషయాన్ని అనుసరిస్తుంది. గతంలో చంద్రబాబు కూడా ఎన్నికలకు కేవలం ఏడాది ముందు మాత్రమే ప్రజల నాడిని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే సమయం మించిపోయిందనే ఊహాగానాలు వచ్చాయి. ఇక, ఎన్నికల్లో రిజల్ట్‌ను బట్టి.. దీనిని నిజమని అందరూ అనుకున్నారు.
అంచనాకు భిన్నంగా….
కానీ, దీనికి భిన్నంగా వైసీపీ అదినేత జగన్ వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆయన ప్రభుత్వ విభాగాల కార్యదర్శుల (వీరే క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి కీలకం) తో భేటీ అయ్యారు. ఇది అనూహ్య భేటీ. ఎందుకంటే.. ఒకవైపు పంచాయతీ ఎన్నికలు జరుగుతుండడం, మరోవైపు తొలి దశ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో సీఎం జగన్ ఈ భేటీ నిర్వహించారు. నిజానికి చెప్పాలంటే వైసీపీ తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తుందని జగన్ అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా టీడీపీ పుంజుకుంది. టీడీపీ ఇంత దీనస్థితిలో ఉండి కూడా 600 – 700 వరకు పంచాయతీలు గెలుచుకోవడం టీడీపీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపగా.. వైసీపీ వాళ్లకు మింగుడు పడని విధంగా ఉంది.
ఎన్నికలు పూర్తవ్వగానే….?
రాజకీయ వర్గాల అంచనా ప్రకారం రెండు, మూడు దశల్లో టీడీపీకి మరింత మెరుగైన ఫలితాలు వస్తాయంటున్నారు. ఈ విషయం జగన్ దృష్టికి కూడా వెళ్లింది. దీంతో వెంటనే జగన్ రంగంలోకి దిగిపోయారు. “మనకు ఇప్పటికే 20 నెలల సమయంలో గడిచిపోయింది. ఇక, ఎవరూ విశ్రాంతి తీసుకునేందుకు వీల్లేదు“ అని ఆయన అధికారులను హెచ్చరించాంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం అధికారులకు జగన్.. పాలన విషయంలో కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితిలోనూ ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి వెళ్లేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో పంచాయతీ ఎన్నికలు కాగానే వైసీపీ నేతలతో నియోజకవర్గాల వారీగా భేటీలు నిర్వహించి.. వచ్చే ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది.
విశ్రాంతి తీసుకోవద్దంటూ…..
కీలక నేత చెప్పిన సమాచారం మేరకు.. వచ్చే ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉంటుందని, 2009 నాటి మహాకూటమి పురుడు పోసుకోవడం ఖాయంగా కనిపిస్తోందని.. దీనిని గుర్తించి.. ఇప్పటి నుంచే జగన్ సిద్ధపడుతున్నారని సమాచారం. వచ్చే ఎన్నికల వేళ మళ్లీ టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి ఏర్పాటైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని కూడా జగన్ పార్టీ నేతలతో అన్నట్టు పార్టీ నేతల్లోనే చర్చ నడుస్తోంది. ఇక, దీనికి ముసాయిదాగా.. పంచాయతీ రిజల్ట్‌ను ప్రస్తావిస్తున్నారని కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే.. మరో మూడేళ్లు ఎన్నికలకు సమయం ఉన్నా.. అప్పటి పోటీని ఇప్పుడే గ్రహించి.. విశ్రాంతి తీసుకోవద్దని అధికారులకే జగన్ చెప్పారంటే.. ఇక, వైసీపీ నేతలకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో.. అని అప్పుడే చర్చ ప్రారంభం కావడం గమనార్హం. అదే సమయంలో మోడీ జమిలీ రూట్ గురించి రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు.. ఇటు న్యాయ నిపుణులతో కూడా చర్చిస్తున్నారు. అనుకోని విధంగా పరిస్థితులు తారుమారు అయ్యి మరో రెండేళ్లలో జమిలీ వస్తే.. దానికి కూడా ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసేలా జగన్ వ్యూహాలు ఉండబోతున్నాయట.