జగన్ బలహీన ముఖ్యమంత్రా….? అదే సరికొత్త చర్చ
రాజకీయాల్లో.. ఎలాంటి వ్యూహాలు ఎప్పుడు తెరమీదికి వస్తాయో చెప్పడం కష్టం. తమకు ఇబ్బంది కలుగుతోందని భావిస్తే.. ప్రత్యర్థి పక్షాలపై బెడ్డలు విసరడం ఇప్పుడు రాజకీయాల్లో కామన్‌గా జరుగుతున్న [more]
రాజకీయాల్లో.. ఎలాంటి వ్యూహాలు ఎప్పుడు తెరమీదికి వస్తాయో చెప్పడం కష్టం. తమకు ఇబ్బంది కలుగుతోందని భావిస్తే.. ప్రత్యర్థి పక్షాలపై బెడ్డలు విసరడం ఇప్పుడు రాజకీయాల్లో కామన్‌గా జరుగుతున్న [more]
రాజకీయాల్లో.. ఎలాంటి వ్యూహాలు ఎప్పుడు తెరమీదికి వస్తాయో చెప్పడం కష్టం. తమకు ఇబ్బంది కలుగుతోందని భావిస్తే.. ప్రత్యర్థి పక్షాలపై బెడ్డలు విసరడం ఇప్పుడు రాజకీయాల్లో కామన్‌గా జరుగుతున్న ప్రక్రియే. ఇలాంటి పనే .. ఏపీ సీఎం.. వైసీపీ అధినేత జగన్‌పైనా జరుగుతోందని అంటున్నారు పరిశీలకులు. గడిచిన రెండు వారాలుగా.. ఓ వర్గం సోషల్ మీడియాలో జగన్‌పై చిత్రమైన చర్చ సాగుతోంది. ఇప్పుడు అది పుంజుకుందని కూడా తెలుస్తోంది. జగన్‌ను బలహీనమైన ముఖ్యమంత్రిగా చిత్రీకరించే ప్రయత్నం సాగుతుండడమే ఈ మొత్తం చర్చలోని అంతరార్థం కావడం గమనార్హం. వాస్తవానికి ఇప్పటి వరకు జగన్‌పై జరిగిన ప్రచారం ఏంటంటే.. బీజేపీతొ అవినాభావ సంబంధాలు నెరుపుతున్నారనే. అయితే అది అంతగా వర్కవుట్ కాలేదు. పైగా ఎవరూ కూడా విశ్వసించలేదు. రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా దీనిని ఖండించడంతో సదరు ఈ వాదన లేవనెత్తిన వర్గాలకు మింగుడు పడలేదు. అయినప్పటికీ బీజేపీతో జగన్ అంటకాగుతున్నారనే వాదన వినిపించారు.
జాతీయ మీడియా సయితం…..
సరే ఈ ప్రచారాన్ని కాసేపు పక్కన పెడితే గత రెండేళ్లకు ముందు జగన్ ఏకంగా 151 ఓట్ల భారీ మెజార్టీతో ఏపీ సీఎం అయినప్పుడు జగన్‌ను జాతీయ మీడియా సైతం దేశంలోనే బలమైన ముఖ్యమంత్రి అంటూ అభివర్ణించింది. చాలా చిన్న వయస్సులోనే పోరాటం చేసి… కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీనే ఎదురించి బయటకు వచ్చి అదే కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బకొట్టడం జాతీయ రాజకీయ వర్గాలు సైతం జగన్‌ను ఆకర్షించేలా చేసింది. ఇదే ఒక ఎత్తు అయితే 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును 23 సీట్లకు పరిమితం చేసి… ఆయనకు చరిత్రలోనే ఎప్పుడూ లేనంత ఘోర పరాజయం మిగిల్చారు.
రివెంజ్ పాలిటిక్స్ కే…..
ఆ తర్వాత జగన్ ప్రజల వద్దకే పాలన అంటూ తీసుకువచ్చిన వలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయాలు జగన్ సరికొత్త పాలన ఆవిష్కరించబోతున్నాడంటూ దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు ఏపీ వైపు చూసేలా చేశాయి. కట్ చేస్తే ఆ తర్వాత ఏపీలో సరికొత్త పాలన ఏమోగాని రివేంజ్ పాలిటిక్స్ జోరందుకున్నాయన్న టాక్ నేషనల్ వైడ్‌గా స్ప్రెడ్ అయిపోయింది. గత యేడాది కాలంగా ఏపీలో ప్రతి రోజూ ఎప్పుడూ చూసినా సీఎంకు, ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేయడం… ఇటు అమరావతి అభివృద్ధి ఆగిపోవడం, మూడు రాజధానుల రచ్చ, పార్టీ ఫిరాయింపులు వీటి చుట్టూనే కథ నడుస్తుందే తప్ప అభివృద్ధి అనే మాట ఎక్కడా వినపడడం లేదు సరికదా కనపడడం లేదు కూడా ? ఇక ఏపీకి రావాల్సిన పలు కీలక ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు తరలి పోవడం ఒక ఎదురు దెబ్బ అయితే.. విదేశీ పెట్టుబడుల గురించి మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు.
అదే మీడియా ఇప్పడు….
జగన్ సీఎం అయిన తొలినాళ్లలో ఏ జాతీయ మీడియా అయితే జగన్‌ను అత్యంత బలవంతుడు అయిన సీఎం అంటూ కీర్తించిన జాతీయ మీడియా ఇప్పుడు అదే జగన్‌ను అత్యంత బలహీనమైన ముఖ్యమంత్రా అంటూ సందేహం వ్యక్తం చేస్తోన్న పరిస్థితి. ఈ పరిణామాలే ఇప్పుడు సీఎం జగన్‌ను బలహీనమైన ముఖ్యమంత్రిగా ప్రొజెక్టు చేసేందుకు ఇప్పుడు కారణమవుతున్నాయి. ఏపీ లోకల్ మీడియాలో 80 శాతం జగన్‌కు ఎప్పుడూ వ్యతిరేకమే. అందుకే ఇప్పుడు జాతీయ మీడియా చర్చలనే ఇక్కడ ప్రస్తావించాల్సి వస్తోంది. ఇక కేంద్రం నుంచి ఏమీ తీసుకురాలేకపోతున్నారన్న టాక్ ప్రతి ఒక్కరిలోనూ స్ప్రెడ్ అయిపోతోంది. 22 ఎంపీలను గెలిపించినా ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా కేంద్రం అంటే జగన్ భయపడుతోన్న పరిస్థితి ఉండడంతో మడీకి జీ హుజూర్ అన్న సీఎంల లిస్టులో జగన్ కూడా ఉన్నాడంటున్నారు.
జీ హుజూర్ అంటూ….
ఇక, విశాఖ ఉక్కు విషయం తెరమీదికి వచ్చాక.. దీనిని మరింతగా హైలెట్ చేస్తున్నారు. విశాఖ ఉక్కును కూడా నిలుపుకోలేక పోతున్న ముఖ్యమంత్రిగా జగన్‌ను టార్గెట్‌గా చేసుకుని కొందరు తీవ్ర వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఇక, దీనికి ఎన్నారైలు కూడా కొందరు చేతులు కలపడం.. వివిధ ఆన్‌లైన్ మాధ్యమాల్లోనూ జగన్‌కు వ్యతిరేకంగా కథనాలు, విశ్లేషణలు రావడం గమనార్హం. ఓవరాల్‌గా ఇటు ప్రతిపక్షాలు, లోకల్ మీడియాలో జగన్‌పై సహజంగా వచ్చే విమర్శలు కాకుండా జాతీయ మీడియాలో సైతం జగన్ బలహీనమైన ముఖ్యమంత్రి అనే ముద్ర బలంగా ప్రచారం లోకి వస్తోంది. మరి దీనిని వైసీపీ ఎలా ఎదుర్కొంటుందో ? చూడాలి.