అక్కడ ముగ్గురు కొత్త మంత్రులు వీళ్లే అంటూ ప్రచారం ?
ఏపీలో వరుస ఎన్నికలతో రాజకీయం హీటెక్కింది. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు.. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక తర్వాత మరో నాలుగైదు నెలల్లో మంత్రివర్గ ప్రక్షాళన [more]
ఏపీలో వరుస ఎన్నికలతో రాజకీయం హీటెక్కింది. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు.. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక తర్వాత మరో నాలుగైదు నెలల్లో మంత్రివర్గ ప్రక్షాళన [more]
ఏపీలో వరుస ఎన్నికలతో రాజకీయం హీటెక్కింది. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు.. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక తర్వాత మరో నాలుగైదు నెలల్లో మంత్రివర్గ ప్రక్షాళన జరగనుంది. సీఎం జగన్ ముందే చెప్పినట్టు ప్రస్తుతం ఉన్న కేబినెట్ లో 90 శాతం మందిని తప్పించి వారి స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే చాలా మంది ఆశావాహులు తమకు తప్పకుండా మంత్రి పదవులు వస్తాయన్న ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. కీలకమైన పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం ముగ్గురు మంత్రులు ఉండగా మార్పులు, చేర్పుల్లో మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు తప్పకుండా మంత్రి పదవులు వస్తాయన్న ఆశలతో ఉన్నారు.
ప్రసాదరాజుకు గ్యారంటీ….
గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు ఈ ముగ్గురూ తమకు తప్పకుండా మంత్రి పదవులు వస్తాయన్న ధీమాతో ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ప్రసాదరాజుకు కేబినెట్ ఏర్పడిన వెంటనే మంత్రి పదవి రావాల్సి ఉన్నా చెరుకువాడ జాతీయ స్థాయిలో క్షత్రియ సంఘం నేతలతో లాబీయింగ్ చేసుకోవడంతో ఆయనకు జగన్ పదవి ఇచ్చారు. ఇప్పుడు రంగనాథ రాజు అవుట్ ప్రసాదరాజు ఇన్ అయ్యే విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. మరి మిగిలిన ఇద్దరి విషయంలో మాత్రం సామాజిక సమీకరణలు ఎలా ? మారతాయో చెప్పలేని పరిస్థితి.
నానిని తప్పిస్తారా?
డిప్యూటీ సీఎం, వైద్య శాఖా మంత్రి ఆళ్ల నాని జగన్‌కు అత్యంత సన్నిహితుడు. ఆయన్ను తప్పిస్తారా ? లేదా ? అన్నదే పెద్ద సస్పెన్స్. శాఖా పరంగా ఆయన పనితీరు మరీ ఆహా ఓహో అనేలా అయితే లేదు. కాపు ఈక్వేషన్‌తో పాటు జిల్లాలో ఈ వర్గానికి తప్పకుండా ఓ పదవి ఉంచాలనుకుంటే జగన్ నానిని కేబినెట్లో ఉంచొచ్చు… లేదా ఆయన్ను తప్పించినా ఆశ్చర్య పడాల్సిన పని కూడా లేదు. ఇదే వర్గం నుంచి పవన్ కళ్యాణ్‌ను ఓడించిన భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పదవి రాకపోదా ? అన్న ఆశతో ఉన్నా నాని కంటే ఆయన జూనియర్ కావడం మైనస్.
తానేట వనితను మాత్రం….
ఇక మంత్రి తానేటి వనిత పూర్ పెర్పామెన్స్ ఇస్తున్నారని పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. ఆమె ఖచ్చితంగా అవుట్ లిస్టులోనే ఉన్నారంటున్నారు. ఎస్సీ కోటాలో స్టేట్ వైడ్ ఈక్వేషన్లు కలిసొస్తే తనకు మంత్రి పదవి వస్తుందని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ప్రచారం చేసుకుంటున్నారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయనకు లక్ కలిసొస్తుందా ? లేదా ? అన్నది చెప్పలేం. ఇక పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. గతంలో ఆయన ఉప ఎన్నికల్లోనూ గెలిచారు.. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఎస్టీ కోటాలో నాలుగు సార్లు గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో పీడికల రాజన్నదొరతో పాటు బాలరాజు కూడా ముందు వరుసలో ఉన్నారు.
ఎస్టీ కోటాలో….
ఎస్టీ కోటాలో తన సేవలకు గుర్తింపుగా ఈ సారి మంత్రి పదవి ఖాయమే అంటున్నారు. బాలరాజుకు మంత్రి పదవి విషయంలో వేరే అడ్డేమి లేకపోయినా రాజన్నదొర ఒక్కరి నుంచి మాత్రమే పోటీ ఉంది. జిల్లాలో వనిత, రంగరాజు అవుట్ అవ్వడం దాదాపు ఖాయమే అయితే ఆ ఇద్దరిలో ప్రసాదరాజు, బాలరాజుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆళ్ల నాని విషయంలో జగన్ నిర్ణయాన్ని బట్టి గ్రంథి లేదా మరో ఎమ్మెల్యేకు అవకాశం కనిపిస్తోంది.