జగన్ మాటలను వక్రీకరించారా ?

అమరావతిని రాజధానిగా చేసేందుకు అభ్యంతరం లేదని అసెంబ్లీలో చేసిన ప్రకటన వైసిపి పై విమర్శలు గుప్పిస్తుంది. అయితే కట్ అండ్ పేస్ట్ గా జగన్ మాటలను వక్రీకరించి [more]

Update: 2019-12-30 13:30 GMT

అమరావతిని రాజధానిగా చేసేందుకు అభ్యంతరం లేదని అసెంబ్లీలో చేసిన ప్రకటన వైసిపి పై విమర్శలు గుప్పిస్తుంది. అయితే కట్ అండ్ పేస్ట్ గా జగన్ మాటలను వక్రీకరించి టిడిపి ఇతర విపక్షాలు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నా దాన్ని పూర్తి స్థాయిలో ఖండించుకోలేని పరిస్థితిలో వైసిపి శ్రేణులు డిఫెన్స్ లో పడుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై దిశా నిర్దేశం చేయడంలో వైసిపి అధిష్టానం సైతం వెనకబడిందనే అంతా అంటున్నారు. ఇప్పటికైనా మేలుకొని నాడు అసెంబ్లీలో అమరావతి కి మద్దతు ఇస్తూ విపక్ష నేత చెప్పిన మాటలను ప్రజల్లోకి తెచ్చే ప్రయత్నం చేయాలని వైసిపి సోషల్ మీడియా అభిమాన గణం సూచిస్తుంది. అసలు జగన్ ఏమన్నారు ? జరుగుతున్న ప్రచారం ఏమిటి ? అన్నది చర్చ పెట్టాలని టిడిపి మీడియా ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరుతున్నారు.

జగన్ అన్నది ఇది …

అమరావతి నో మరొకటో ఏదో ఒకటి రాజధాని గా ప్రకటించండి. ఇప్పటికే రాష్ట్రం విభజన తో తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో ప్రాంతాల నడుమ విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని అధికారపార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అయితే రాజధాని కనీసం 30 వేలఎకరాలు ఉండేలా చుడండి. అది ప్రయివేట్ భూముల జోలికి పోకండి. ల్యాండ్ పూలింగ్ వద్దే వద్దు. ప్రభుత్వ భూమినే గుర్తించండి. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో సామాన్యుడు నివాసం వుండి ప్లాట్ కానీ స్థలం కొనాలంటే ప్రభుత్వమే తక్కువ ధరకు కొనుగోలు చేసుకునే వీలుంటుంది.

ల్యాండ్ పూలింగ్ వద్దని…..

అలా కాకుండా ల్యాండ్ పూలింగ్ విధానంలో భూమి సేకరిస్తే రియల్ వ్యాపారం జరుగుతుంది తప్ప ఈ రాజధాని మాది అనే భావన సామాన్యుల్లో దూరం అవుతుంది జాగ్రత్త అంటూ నాడు జగన్ అసెంబ్లీ సాక్షిగా ముందే చెప్పారు. కానీ ఆయన చెప్పిన దానికి భిన్నంగానే నాటి అధికార టిడిపి వ్యవహరించింది. ఈ విషయం ప్రభుత్వం, పార్టీ ప్రచారం చేసుకోలేక పోతుందని నాడు రాజధాని కి జగన్ అంగీకరించారనే వాదనే జనంలోకి పోతున్నా పెద్దగా ఖండించడం లేదని గుర్తు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా వైసిపి మేలుకుంటుందో లేదో చూడాలి.

Tags:    

Similar News