మంత్రుల వ‌ర్కవుట్ బాగుంది.. మ‌రి చెక్‌ ఎవ‌రికి ?

స్థానిక ఎన్నిక‌లే కొల‌మానంగా త్వర‌లోనే జ‌ర‌గ‌బోయే మంత్రి వ‌ర్గ ప్రక్షాళ‌న‌లో మంత్రుల‌ను తొల‌గించడం.. కొత్తవారికి అవ‌కాశం ఇవ్వడం అనే విష‌యాల‌పై జ‌గ‌న్ దృష్టి పెడతార‌నే ప్రచారం ఉంది. [more]

Update: 2021-03-29 02:00 GMT

స్థానిక ఎన్నిక‌లే కొల‌మానంగా త్వర‌లోనే జ‌ర‌గ‌బోయే మంత్రి వ‌ర్గ ప్రక్షాళ‌న‌లో మంత్రుల‌ను తొల‌గించడం.. కొత్తవారికి అవ‌కాశం ఇవ్వడం అనే విష‌యాల‌పై జ‌గ‌న్ దృష్టి పెడతార‌నే ప్రచారం ఉంది. ఆయన 2019లో కేబినెట్ ఏర్పాటు చేసే స‌మ‌యంలో కూడా ఇదే విష‌యాన్ని చెబుతూ వ‌చ్చారు. రెండున్నరేళ్ల త‌ర్వాత 90 శాతం మంది మంత్రుల‌ను మారుస్తాన‌ని ప్రక‌టించారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ ఏడాది డిసెంబ‌రు నాటికి రెండున్నరేళ్ల గ‌డువు పూర్తవుతోంది. అయితే.. మంత్రివ‌ర్గాన్ని ప్రక్షాళ‌న చేసే ముందు.. ఇటీవ‌ల జ‌గ‌న్ స్థానిక సంస్థల్లో స‌త్తా చూపించేవారికి మాత్రం రెన్యువ‌ల్ ఉంటుంద‌ని అన్నారు.

కొత్తవారి ఎంపికలోనూ….

అదే స‌మ‌యంలో కొత్తవారికి అవ‌కాశం ఇవ్వాల‌న్నా.. కూడా ఇదే ప్రాతిప‌దిక‌గా తాను ముందుకు సాగుతాన ని చెప్పారు. ఈ క్రమంలో ఆచివ‌రి నుంచి ఈ చివ‌రి వ‌ర‌కు కూడా ప్రతి ఒక్కరు అన్ని విధాలా క‌ష్టప‌డ్డారు. ఈ క్రమంలోనే ఆది నుంచి చెబుతూ వ‌చ్చిన స్థానిక ఫ‌లితాల్లో 90 శాతాన్ని మించి దాదాపు రెండు త‌ప్ప.. అన్నింటిలోనూ వైసీపీ విజ‌యం సాధించింది. దీనికి మంత్రులు, నేత‌లు.. బాగానే క‌ష్టప‌డ్డారు. అవంతి శ్రీను లాంటి ఒక‌రిద్దరు మంత్రులు మిన‌హా దాదాపు అంద‌రూ మంత్రులు స‌క్సెస్ అయ్యారు. మ‌రో ఒక‌రిద్దరు మంత్రులు మాత్రం అనుకున్న స్థాయిలో కాక‌పోయినా చ‌చ్చీచెడి ప‌ట్టు నిలుపుకున్నారు.

వీరంతా విజయాన్ని….

ఈ క్రమంలో రేపు మంత్రి వ‌ర్గ ప్రక్షాళ‌న జ‌రిగితే.. ఎవ‌రిని త‌ప్పించాలి ? అనేది కీల‌కంగా మారింది. గ్యారెంటీగా త‌ప్పించేస్తార‌న‌ని ప్రచారంలో ఉన్న కొంద‌రు మంత్రులు ఇప్పుడు తిరుగులేని ఫ‌లితాలు తీసుకువ‌చ్చారు. తొలుత విజ‌య‌వాడ‌కు చెందిన మంత్రి వెలంప‌ల్లిని తొల‌గిస్తార‌నే ప్రచారం జ‌రిగింది. కానీ, టీడీపీకి కంచుకోట వంటి విజ‌య‌వాడ కార్పొరేష‌న్‌లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. సో.. వెలంప‌ల్లికి ఇది ప్లస్సే. ఇక‌, చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామిని త‌ప్పిస్తార‌ని ప్రచారం జ‌రిగింది. అయితే.. ఇక్కడ కూడా ఆయ‌న అనూహ్యంగా పార్టీని గెలుపుగుర్రం ఎక్కించారు. దీంతో ఆయ‌న‌కు కూడా ఎలాంటి ఇబ్బందిలేద‌ని అంటున్నారు. క‌డ‌ప‌లో అంజాద్ బాషా తిరుగులేని ఘ‌నవిజ‌యం సాధించి పెట్టారు.

90 శాతం మంది మంత్రుల్లో….

ఈ ఫ‌లితాల‌ను బేరీజు వేస్తే 90 శాతం మంతి మంత్రుల్లో ఎవ‌రిని ఉంచాలి ? ఎవ‌రిని తీసేయాల‌న్నది జ‌గ‌న్‌కు పెద్ద స‌వాలే. ఇప్పటికిప్పుడు ఉన్న ట్రెండ్‌ను బ‌ట్టి.. అమ‌లాపురం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పినిపే విశ్వరూప్‌, విశాఖ జిల్లా భీమిలి నుంచి గెలిచి.. మంత్రి అయిన‌.. అవంతి శ్రీనివాస్‌, అనంత‌పురం జిల్లా పెనుకొండ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న శంక‌ర‌నారాయ‌ణ పేర్లు అవుట్ లిస్టులో ప్రముఖంగా వినిపి‌స్తున్నాయి. మ‌రి వీరితోపాటు ఇంకెవ‌రు ఉంటారో ? చూడాలి.

Tags:    

Similar News