జ‌గ‌న్ ఫార్ములా: కులాలు-వ్యక్తులు కాదట.. ఇప్పుడు వాటిపైనే?

ఏపీ సీఎం జ‌గ‌న్ అనుస‌రిస్తున్న పంథా చూస్తే.. నిన్న మొన్నటి వ‌ర‌కు వ్యక్తులు, కులాల‌ను టార్గెట్ చేసుకుని ముందుకు సాగిన ఆయ‌న‌.. ఇప్పుడు ఏకంగా ప్రాంతాల‌ను కూడా [more]

Update: 2021-04-21 12:30 GMT

ఏపీ సీఎం జ‌గ‌న్ అనుస‌రిస్తున్న పంథా చూస్తే.. నిన్న మొన్నటి వ‌ర‌కు వ్యక్తులు, కులాల‌ను టార్గెట్ చేసుకుని ముందుకు సాగిన ఆయ‌న‌.. ఇప్పుడు ఏకంగా ప్రాంతాల‌ను కూడా త‌న వైపు తిప్పుకొనే ప్రయ‌త్నం చేస్తున్నార‌ని అంటున్నారు పొలిటిక‌ల్ పండితులు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు.. స్తబ్దుగా ఉన్న వైసీపీ నాయ‌కులు.. సీఎం జ‌గ‌న్ కూడా .. ఎన్నిక‌ల్లో రెండేళ్ల పాల‌న ఎఫెక్ట్ ప‌డుతుంద‌ని భావించారు.. ఎంత ధైర్యం ఉన్నప్పటికీ.. లోలోన మాత్రం టీడీపీ ఎఫెక్ట్ క‌నిపించింది. దీంతో వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రించారు.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ స్వీప్ చేసేశారు.

అమరావతి నుంచి…..

ఇక‌, ఇప్పుడు తాము తీసుకుంటున్న నిర్ణయాల‌కు, తాము చేస్తున్న ప‌నుల‌కు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజ‌ల నుంచి ఆమోదం ల‌భించింద‌నే వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు అత్యంత కీల‌క‌మైన మూడు రాజ‌ధానుల దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో అమ‌రావ‌తి నిర్మాణానికి సంబంధించి ‌కీల‌క నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి.. అమ‌రావ‌తిని కాద‌ని.. మూడు రాజ‌ధానులను ఏర్పాటు చేస్తామ‌ని ప్రకటించిన త‌ర్వాత‌.. ఉద్యమాలు చెల‌రేగాయి. అయితే.. ఇప్పుడు అమ‌రావ‌తి ఉద్యమాన్ని నెమ్మదించేలా చేసి.. ప‌ని చ‌క్కబెట్టుకునేందుకు ముందుకు సాగుతున్నారు.

అన్ని ప్రాంతాలపైనా….

మూడు ద‌శ‌ల్లో అమ‌రావ‌తిలో ఆగిపోయిన నిర్మాణాల‌ను పూర్తి చేసేందుకు జ‌గ‌న్ వ్యూహాత్మకంగా అడ‌గులు వేస్తున్నారు.. ఈ క్రమంలోనే తాజాగా 3000 కోట్ల రూపాయ‌ల రుణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక‌, విశాఖ‌లో మే 6న నూత‌న రాజ‌ధానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో రోడ్ల విస్తర‌ణ‌, గాలి పొల్యూష‌న్ త‌గ్గించేందుకు చ‌ర్యలు తీసుకున్నారు. ఇక‌, మ‌రో కీల‌క రాజ‌ధానిగా పేర్కొంటున్నన్యాయ రాజ‌ధాని.. క‌ర్నూలుపైనా జ‌గ‌న్ సెంటిమెంటు రాజ‌కీయం చేశారు. తాజాగా ఇక్కడ న్యాయ‌రాజ‌ధాని వ‌ద్దు అనే వారు పెరుగుతున్నారు.. ఇస్తే.. పూర్తి స్థాయి రాజ‌ధా‌ని కావాల‌ని అంటున్నారు.

కర్నూలు ఎయిర్ పోర్టు…..

ఈ క్రమంలోనే తాజాగా సీఎం జ‌గ‌న్ ఇక్కడ సెంటిమెంటును త‌న‌కు అనుకూలంగా మార్చుకున్నారు. తాజాగా ప్రారంభించిన ఓర్వక‌ల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి పేరును పెడుతున్నట్టు చెప్పారు. దీనికి మెగా స్టార్ చిరంజీవి వంటివారిన‌నుంచి కూడా మ‌ద్దతు ల‌భించింది. దీంతో స్తానికంగా జ‌గ‌న్‌ను విమ‌ర్శించే గొంతులు మూగ‌బోయాయి. మొత్తంగా చూస్తే.. అటు వ్యక్తుల‌ను, సామాజిక వ‌ర్గా‌లను ఇప్పటి వ‌ర‌కు టార్గెట్ చేసిన జ‌గ‌న్‌.. ప్రాంతాల‌పై కూడా ప‌ట్టు సాధిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News