స‌గం మంది మంత్రులు ఏం చేస్తున్నారు ? జ‌గ‌న్ ఆరా ?

రాష్ట్ర కేబినెట్లో మొత్తం సీఎం జ‌గ‌న్‌తో క‌లిపి 25 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో స‌గం మంది వ‌ర‌కు ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా ప‌రిష‌త్ ఎన్నిక‌ల [more]

Update: 2021-04-22 09:30 GMT

రాష్ట్ర కేబినెట్లో మొత్తం సీఎం జ‌గ‌న్‌తో క‌లిపి 25 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో స‌గం మంది వ‌ర‌కు ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా ప‌రిష‌త్ ఎన్నిక‌ల హ‌డావుడిలో ఉన్నార‌ని.. అనుకున్నా.. ఎన్నిక‌ల ప్రచారం ముగిసిన త‌ర్వాత‌.. కూడా వారు ఎక్కడా క‌నిపించ‌క‌పోవ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది. దీంతో అస‌లు మంత్రులు ఏం చేస్తున్నార‌నే విష‌యం అధికార పార్టీ వైసీపీలోనే చ‌ర్చకు దారితీసింది. ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను టీడీపీ బ‌హిష్కరించ‌డంతో ఎమ్మెల్యేలు కూడా ఈ ఎన్నిక‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు.. ఇక మంత్రులు మ‌రీ లైట్ తీస్కొన్నారు. కొంద‌రు మంత్రులకు తిరుప‌తి ఉప ఎన్నిక బాధ్యత‌లు అప్పగించినా అక్కడ కూడా వారు ఒక‌టి రెండు రోజులు మాత్రమే ఉండి ఎటో చెక్కేస్తున్నారు.

ఎన్నికలు వన్ సైడ్ అయినా?

ఇదే విష‌యంపై సీఎం జ‌గ‌న్ కూడా ఆరాతీశార‌ని స‌మాచారం. తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన ఒక మంత్రి..మాత్రం పుదుచ్చేరి ఎన్నిక‌ల్లో ప్రచారం చేయ‌డానికి అక్కడికి వెళ్లారు. అక్కడ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత కూడా ఆయ‌న రాలేదు. ఆయ‌న అక్కడ నుంచి గోవా వెళ్లార‌ని.. అక్కడ రెస్ట్ తీసుకుంటున్నార‌ని స‌మాచారం. మ‌రో మంత్రి.. కూడా హైద‌రాబాద్ వెళ్లార‌ని తెలిసింది. ఇక‌, విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన బొత్స స‌త్యనారాయ‌ణ నిత్యం మీడియాలో ఉంటూ.. టీడీపీపై హాట్ కామెంట్లు చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈయ‌న ఇప్పుడు ప‌రిష‌త్ ఎన్నిక‌ల హ‌డావుడిలో జిల్లాలో నే తిష్టవేశారు. ప‌రిష‌త్ ఎన్నిక‌లు వ‌న్‌సైడ్ అయిపోయినా బొత్స మాత్రం జిల్లాలోనే ఉండ‌డం విశేషం.

రెస్ట్ తీసుకుంటూ…

మ‌రికొంద‌రు మంత్రులు మాత్రం బెంగ‌ళూరు వెళ్లార‌ని.. స్థానిక ఎన్నిక‌ల్లో విజ‌యం త‌ర్వాత‌.. ఒకింత రెస్ట్ కోరుకుంటున్నార‌ని ప్రచారం సాగుతోంది. 10 మందికి పైగా మంత్రుల‌కు తిరుప‌తి ఉప ఎన్నిక‌ల ప్రచార బాధ్య‌త‌లు అప్పగిస్తే అక్కడ అందులో సంగం మంది కూడా ప‌ని చేయ‌డం లేదు. కేవ‌లం న‌లుగురు మంత్రులు మాత్రం తిరుప‌తి ఉప ఎన్నిక‌ల ప్రచారంలో ఉన్నారు. అయితే.. వీరిలోనూ ఇద్దరు ముగ్గరు ఎండ వేడికి తాళ‌లేక‌.. ఉద‌యం 11 గంట‌ల నుంచి సాయంత్రం 4 వ‌ర‌కు కూడా రెస్ట్ తీసుకున్నార‌ని తెలుస్తోంది.

మంత్రుల పనితీరుపై?

మొత్తానికి ఈ ప‌రిణామాలు గ‌మ‌నించిన త‌ర్వాత‌.. వైసీపీ మంత్రుల్లో ఒక విధ‌మైన ధైర్యం వ‌చ్చింద‌ని.. పార్టీ ఇప్పటికి చాలానే సాధించింద‌ని.. ఇక‌, చేయాల్సింది ఏమీ లేద‌ని వారు అనుకుంటున్నార‌ని.. కొన్ని వ్యాఖ్యలు సీనియ‌ర్ల నుంచి వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామాలు అటు ఇటు తిరిగి.. సీఎం జ‌గ‌న్ చెవిలో ప‌డ‌డంతో ఆయ‌న ఇప్పుడు ఈ మంత్రులు ఏం చేస్తున్నారో.. చెప్పాలంటూ.. ఓ స‌ల‌హా దారుని కోరిన‌ట్టు వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News