అరవీర భయంకరుడుగా జగన్…?
రాజకీయాల్లో అధికారంలో ఉన్న వారు ఎపుడూ విపక్షాలకు కఠినాత్ములుగానే కనిపిస్తారు. రాజు చేతిలో అధికారం ఉంటుంది కాబట్టి ఆ కలవరం ఉండడం సాధారణమే కానీ మరీ ఏలిన [more]
రాజకీయాల్లో అధికారంలో ఉన్న వారు ఎపుడూ విపక్షాలకు కఠినాత్ములుగానే కనిపిస్తారు. రాజు చేతిలో అధికారం ఉంటుంది కాబట్టి ఆ కలవరం ఉండడం సాధారణమే కానీ మరీ ఏలిన [more]
రాజకీయాల్లో అధికారంలో ఉన్న వారు ఎపుడూ విపక్షాలకు కఠినాత్ములుగానే కనిపిస్తారు. రాజు చేతిలో అధికారం ఉంటుంది కాబట్టి ఆ కలవరం ఉండడం సాధారణమే కానీ మరీ ఏలిన వారిని పట్టుకుని ఏకంగా మమ్మల్ని చంపేస్తాడు బాబోయ్ అని ఏడుపులు లంకించుకోవడం మాత్రం కాస్తా ఓవర్ అనే చెప్పాలి. ఏది ఏమైనా ఏపీ రాజకీయాలే వెరైటీ కాబట్టి ఇవన్నీ కూడా ఆ కోణం నుంచి చూడాలేమో.
జగన్ తోనే ముప్పుట…
ఆయనకు బీఫారం ఇచ్చి పార్టీ తరఫున వచ్చి ప్రచారం చేసి దేశంలోనే అత్యున్నత చట్ట సభలోకి పంపిస్తే తమ అధినేతే తనను చంపాలనుకుంటున్నాడు అని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాగాలి తీయడమే అసలైన రాజకీయం. జగన్ తో తన ప్రాణాలకు ముప్పు ఉందని రఘురామ కృష్ణంరాజు అనడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో కానీ అది పూర్తి కామెడీగా ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. ఏకంగా ప్రధాని ఆఫీస్ కే లేఖ రాసి మరీ జగన్ చంపేస్తాడు బాబోయ్ అంటూ రఘురామ కృష్ణంరాజు మొరపెట్టుకున్నారు. అంతకు ముందు తనకు వైసీపీ నేతల నుంచి ప్రాణ హాని ఉందని ఆయన సెక్యూరిటీని తెచ్చుకున్న సంగతి ఇక్కడ ప్రస్థావించాలి. సరే ఆయన కోరినవి ఒక ఎంపీగా కేంద్రం సమకూర్చినా ఆయన ఒక్కరికే ఎందుకు ఈ ప్రాణభయం అన్నది కూడా ఆరా తీస్తే బాగుంటుందేమో కదా.
వర్లకు రక్షణ కావాలట …
ఇక తెలుగుదేశం కూడా ఏమీ తక్కువ తినలేదు. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ పోలీస్ ఉన్నతాధికారి వర్ల రామయ్యకు ప్రాణ హాని ఉందని నానా యాగీ చేస్తోంది. ఎందుకంటే వర్ల జగన్ ని తీవ్రంగా దూషిస్తున్నారుట. గట్టిగా విమర్శిస్తున్నారుట. అందువల్ల ఆయనకు రక్షణ కల్పించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఎన్నో ఏళ్ళుగా పార్టీలో ఉంటూ జగన్ ని ఎప్పటికపుడు ఘాటు విమర్శలతో రెచ్చగొట్టే వర్లకు ఇపుడు హఠాత్తుగా ప్రాణ భయం ఎందుకు వచ్చిందో అర్ధం కానిదిలానే ఉందని అంటున్నారు.
అదే టార్గెట్….
జగన్ ది ఏకంగా సొంత బాబాయ్ నే కొట్టే క్యాకరెక్టర్ అని టీడీపీ అనుకూల మీడియా వీలు దొరికినపుడల్లా ఒక్కటే ఊదరగొడుతుంది. జగన్ కి అసహనం వస్తే ఇంట్లో ఉన్న టీవీలనే బద్ధలు కొట్టేస్తారు అని మాజీ మంత్రి ఉమా మహేశ్వరరావు లాంటి వారు ప్రతీసారీ మీడియా ముందు చెబుతూంటారు. ఇపుడు వాటికి తోడు జగన్ తనకు గిట్టని వారిని చంపించేస్తాడు అన్నట్లుగా అటు రాజు గారు, ఇటు వర్ల ఆరోపణలు గుప్పిస్తున్నారు. నిజంగా జగన్ కి జరిగిన అన్యాయానికి ప్రతీకారమే తీసుకోవాల్సివస్తే రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మధ్యన ఎందుకు ఉంటాడు అన్నది కొందరి వాదన. అదే సమయంలో జగన్ ని అకారణంగా రెండు పార్టీలు కలసి జైలులో పెట్టించిన నాడే ఆయన వారిని టార్గెట్ చేయలేదు రాజకీయంగానే ఎదుర్కొన్నారని వైసీపీనేతలు గుర్తు చేస్తున్నారు. జగన్ అంటే జనాలకు ఒక మంచి అభిప్రాయం ఉంది. దాన్ని తుడిచిపెట్టేందుకే ఈ రకమైన చవకబారు ఆరోపణలు చేస్తున్నారు అని వారు అంటున్నారు. మొత్తానికి జగన్ విపక్షాలకు అరవీర భయంకరుడుగా కనిపించడం విడ్డూరమేమీ కాదని ఏపీ రాజకీయాలను స్టడీ చేసే వారు చెప్పే మాట.