30-35 మంది ఎమ్మెల్యేలకు జగన్ చెక్.. రీజనేంటి ?
వైసీపీ అధినేత, సీఎం జగన్ వ్యూహం.. చాలా లోతుగా, స్ట్రాంగ్‌గా ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. వచ్చే ఎన్నికలు.. అంత సజావుగా ఉండవని.. పోరు చాలా తీవ్రంగా [more]
వైసీపీ అధినేత, సీఎం జగన్ వ్యూహం.. చాలా లోతుగా, స్ట్రాంగ్‌గా ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. వచ్చే ఎన్నికలు.. అంత సజావుగా ఉండవని.. పోరు చాలా తీవ్రంగా [more]
వైసీపీ అధినేత, సీఎం జగన్ వ్యూహం.. చాలా లోతుగా, స్ట్రాంగ్‌గా ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. వచ్చే ఎన్నికలు.. అంత సజావుగా ఉండవని.. పోరు చాలా తీవ్రంగా ఉంటుందని ముందుగానే రాజకీయ నేతలు అంచనా వేసుకుంటున్నారు. ఇప్పటికే ఓ సారి ఓడి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మరోసారి ఓడేందుకు సిద్ధంగా ఉండదు. ఏపీలో ప్రస్తుత రాజకీయ సంక్షోభాన్ని క్యాష్ చేసుకునేందుకు బీజేపీ కూడా కాచుకునే ఉంది. ఈక్రమంలో ఎవరికి వారు.. వ్యూహాత్మకంగా ముందుకు సాగేందుకు రెడీ అవుతున్నా రు. ముఖ్యమంత్రి జగన్‌ను కట్టడి చేసేందుకు లేదా.. జగన్ సర్కారును కూల్చేసేందుకు.. మహాకూటమి ఏర్పడినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారా?
ఈ నేపథ్యంలో అప్పటికి ఆయా పరిస్థితులను ఎదిరించి నిలబడేందుకు జగన్ ఇప్పటినుంచే సన్నద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో తన ఇమేజ్‌ను మరింత బిల్డప్ చేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేలు అవినీతి, అక్రమాలకు పాల్పడకుండా.. చూడడంతోపాటు ప్రజలకు వారు మరింత చేరువ అయ్యేలా కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈక్రమంలో ఆయన ఎవరికీ ఎలాంటి టార్గెట్లు పెట్టడం లేదు. రేపు ఈ కార్యక్రమం ఉంది.. ఎల్లుండి ఆ కార్యక్రమం ఉంది.. కాబట్టి.. దీనికి ఇంత ఇవ్వాలి అనే సంస్కృతి వైసీపీలో కనిపించడం లేదు.
ఉమ్మడి వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు….
అంటే.. దీనిని బట్టి.. ఎమ్మెల్యేలను నీతివంతులుగా ప్రొజెక్టు చేయాలని జగన్ తాపత్రయ పడుతున్నాడనేది స్పష్టమవుతోంది. దీనికి ప్రధాన కారణం.. వచ్చే ఎన్నికల్లో ఎంతటి బలమైన శక్తులనైనా.. ఎదిరించి నిలబడాలనేది జగన్ వ్యూహం. అయితే.. క్షేత్రస్థాయిలో మాత్రం… నాయకులు మారడం లేదు. ఇప్పటికీ.. జగన్ నుంచి ఎన్నిహెచ్చరికలు వచ్చినా.. పోలీసులు ఎంతగా అప్రమత్తం అయినా.. కూడా ఇసుక, మట్టి వంటి వ్యాపారాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల హస్తం ఉందని వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇలాంటి వారిపై నిఘా పెట్టారు.. జగన్.
నివేదికలు తెప్పించుకుంటూ….
ప్రతి ఆరు మాసాలకు ఒకసారి.. జగన్ నివేదికలు తెప్పించుకుని.. ఆయా నివేదికల ఆధారంగా.. ఎమ్మెల్యే లపై ఒక అంచనాకు వస్తున్నారని అంటున్నారు. ఇలాంటి వారిలో 30-35 మంది తమ పద్ధతి మార్చుకో లేదని.. జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. కొందరు ఎమ్మెల్యేలకు జిల్లా పార్టీ ఇన్‌చార్జ్‌లతో వార్నింగ్‌లు ఇప్పించినా వారి తీరు మారలేదు. మరి కొందరు ఎమ్మెల్యేలు ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవులు అన్నీ తమ అనుచరులకే కట్టబెట్టుకునే ప్రయత్నం చేసినా కూడా అధిష్టానం నేరుగా వాళ్లకు చెక్ పెట్టి స్థానిక, సామాజిక , ప్రాంతీయ ఈక్వేషన్లతో పదవులు ఇచ్చింది. ఏదేమైనా నియోజకవర్గంలో సామంత రాజులుగా వ్యవహరిస్తోన్న వారికి మరోసారి ఛాన్స్ ఇచ్చి.. హెచ్చరించి.. అప్పటికీ మారకపోతే.. పూర్తిగా పక్కన పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్టు వైసీపీలో చర్చ జరుగుతుండడం గమనార్హం. మరి వారెవరు..? ఇప్పటికైనా మారతారా లేదా ? అనే విషయాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది.