గాడి తప్పిందా? అవి తగ్గించుకోవాలా?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యవహార శైలిపై జాతీయ స్థాయిలో విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రాల పరిస్థితిపై ఇటీవల జరిగిన కేంద్ర ఆర్థిక శాఖ అంచనా సమావేశం జరిగింది. [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యవహార శైలిపై జాతీయ స్థాయిలో విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రాల పరిస్థితిపై ఇటీవల జరిగిన కేంద్ర ఆర్థిక శాఖ అంచనా సమావేశం జరిగింది. [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యవహార శైలిపై జాతీయ స్థాయిలో విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రాల పరిస్థితిపై ఇటీవల జరిగిన కేంద్ర ఆర్థిక శాఖ అంచనా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నీతి ఆయోగ్ సహా.. ఆర్థిక నిపుణులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల పనితీరు… గత ఏడాది చేసిన ఖర్చులు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదిక వంటి కీలక విషయాలపై చర్చించారు. అదేసమయంలో కరోనా నేపథ్యంలో వచ్చే ఏడాది (ఇప్పటికే మొదలైన)కి సంబంధించి ఖర్చులు, రాష్ట్రాలకు చేయాల్సిన సాయం వంటివి ప్రధానంగా ఈ చర్చకు వచ్చాయి.
జాతీయ మీడియాలో….
ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కూడా చర్చకు వచ్చినట్టు.. జాతీయ మీడియా కథనాలు వెలువరించాయి. దీనిలో ప్రధానంగా ఏపీ పరిస్థితి అప్పు చేసి పప్పుకూడు అన్న విధంగా ఉందని తేల్చినట్టు సమాచారం. అంటే.. ఇటీవల కరోనా నేపథ్యంలో జీఎస్టీ వసూళ్లు తగ్గిపోయాయి. ఈ క్రమంలో ఆర్థిక లోటును భర్తీ చేసుకునేందుకు వివిధ రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు తీసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే.. ఇలా ఏపీ తీసుకున్న వేల కోట్ల రుణాల తాలూకు ఖర్చుల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖకు పంపించారు. అయితే.. ఈ ఖర్చుల్లో ఎక్కువగా ప్రజలకు పందేరం చేసిన అమౌంటే ఉందని తేలింది.
వాటిని తగ్గించుకుంటేనే?
వాస్తవానికి అప్పులు చేయడం ద్వారా సముతుల ఆర్థిక వృద్ధికి దోహదపడే నిర్ణయాలు తీసుకోవాలని కేంద్రం పదే పదే చెబుతోంది. పైగా సంక్షేమ కార్యక్రమాలను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలని.. సబ్సిడీలను దాదాపు ఎత్తి వేయాలని కూడా సూచిస్తోంది. ఈ క్రమంలో కేంద్రం ఇప్పటికే ఈ విధానాలను అనుసరించింది. అయితే.. ఇతర రాష్ట్రాలైన యూపీ, రాజస్థాన్, ఒడిశా.. తదితర రాష్ట్రాలు కేంద్రం బాటలో నడుస్తున్నాయి. సంక్షేమ పథకాలు, కార్యక్రమాల బడ్జెట్ ను తగ్గించుకున్నాయి. కానీ, జగన్ ప్రభుత్వం మాత్రం ఈవిషయంలో దూకుడుగాముందుకు సాగుతోందని.. మరింతగా డబ్బులు పందేరం చేస్తోందని.. ఆర్థిక నిపుణులు ఒక అంచనాకు వచ్చినట్టు జాతీయ స్థాయిలో ఓ కథనం వెలువడింది.
భవిష్యత్ లో ఆర్థిక సాయంపై…..
దీనిని బట్టి.. రాబోయే రోజుల్లో ఆర్థిక శాఖ ఏపీకి సహకారం అందించే విషయంలో ఆచి తూచి వ్యవహరించడం ఖాయమని అంటున్నారు. ఏదేమైనా.. కష్ట కాలంలో ఆచితూచి వ్యవహరించాల్సిన సీఎం జగన్.. వచ్చిన ప్రతిరూపాయినీ పందేరం చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణగా ఉండడం గమనార్హం. పైగా జీతాలు బాగా ఆలస్యమవుతున్నాయని.. ఉద్యోగులు కేంద్రానికి సైలెంట్‌గా లేఖ రాసినట్టు కూడా జాతీయ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇలా ఎలా చూసుకున్నా.. ఏపీ ఆర్థిక చక్రం గాడి తప్పుతోందనే వాదన వినిపిస్తోంది.