తొలిసారి గెలిచినా ఆయనకే మంత్రి పదవి అట
తన కేబినెట్‌లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఉండేలా చూసుకుంటున్న సీఎం జగన్.. ఇప్పటికే అందరికీ.. అవకాశం కల్పించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఐదుగురు [more]
తన కేబినెట్‌లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఉండేలా చూసుకుంటున్న సీఎం జగన్.. ఇప్పటికే అందరికీ.. అవకాశం కల్పించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఐదుగురు [more]
తన కేబినెట్‌లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఉండేలా చూసుకుంటున్న సీఎం జగన్.. ఇప్పటికే అందరికీ.. అవకాశం కల్పించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలకు అవకాశం కల్పించారు. వీరిలోనూ అన్ని సామాజిక వర్గాలకు స్థానం కల్పించారు. అదేసమయంలో మహిళలకు కూడా అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన ఒకే ఒక్క సామాజిక వర్గానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేక పోయారు. దీంతో ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి కూడా ప్రాధాన్యం ఇచ్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.
త్వరలో జరగనున్న …..
త్వరలోనే సీఎం జగన్ తన మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చేయనున్న విషయం తెలిసిందే. ఈ నెలలో తిరుపతి ఉప ఎన్నిక, మరో మూడు మాసాల్లో బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ రెండూ అయ్యే లోపు.. తానే నిర్ణయించుకున్న రెండున్నరేళ్లు ప్రభుత్వానికి నిండుతాయి. దీంతో 90 శాతం మంది మంత్రులను పక్కన పెట్టి.. కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారు. అయితే.. నిజానికి గత ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో 90 శాతం మంది మంత్రులను మారుస్తానని చెప్పినా.. ఇప్పుడు అంత మార్చాల్సిన అవసరం లేదని.. 50 శాతం వరకు మాత్రమే మారుస్తారని తెలుస్తోంది.
అన్ని వర్గాలకూ….
సరే! ఎలా మార్చినప్పటికీ.. గౌడ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, క్షత్రియ, కమ్మ, కాపు, వైశ్య, ముస్లిం ఇలా దాదాపు అన్ని సామాజిక వర్గాలకు జగన్ ప్రాధాన్యం ఇచ్చారు కానీ, కీలకమైన గౌడ సామాజిక వర్గం నుంచి ఎవరూ మంత్రులుగా లేరు. ఈ క్రమంలో.. గత ఎన్నికల్లో అనూహ్యంగా తెరమీదికి తెచ్చి.. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్న చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే ఎన్. వెంకటే గౌడను మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు జగన్ ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
తాపీ మేస్త్రీగా…..
దీనికి మంత్రి పెద్ది రెడ్డి సిఫారసుతో పాటు.. స్వయంగా జగన్ కూడా వెంకటే గౌడ వంటి చురుకైన నాయకుడిని యువ నాయకుడిని తన మంత్రి వర్గంలో పెట్టుకుంటే.. ప్రజల్లోకి మంచి సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం 5వ తరగతి వరకు చదవిన వెంకటేగౌడ.. తొలుత తాపీ మేస్త్రిగా పనిచేశారు. ఆ తర్వాత.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చిన్న చిన్న పెట్టుబడులు పెట్టి.. తర్వాత అందులోనే ఎదిగారు. ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా.. వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీలోని పెద్దిరెడ్డితో ఏర్పడిన పరిచయం.. గత ఎన్నికల్లో జగన్ టికెట్ ఇచ్చే వరకు సాగింది. ఇక, ఇప్పుడు అన్నీ అనుకూలిస్తే.. మంత్రి కూడా అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక కొద్ది నెలలు క్రితం మంత్రులు అయిన సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణు కూడా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారే. మరి వెంకటేగౌడకు లక్ చిక్కుతుందా ? లేదా ? అన్నది చూడాలి.