ఆ పని చేయలేరు.. ఈ పని చేయలేరు.. సందిగ్దంలో?

ఆంధ్రప్రదేేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఇప్పుడు పరిస్థితులన్నీ అనుకూలంగానే ఉన్నాయి. అన్ని ఎన్నికల్లో ఆ పార్టీదే విజయం. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి తిరుపతి పార్లమెంటు ఉప [more]

Update: 2021-04-29 02:00 GMT

ఆంధ్రప్రదేేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఇప్పుడు పరిస్థితులన్నీ అనుకూలంగానే ఉన్నాయి. అన్ని ఎన్నికల్లో ఆ పార్టీదే విజయం. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక వరకూ వైసీపీకి ఢోకా లేకుండా ఉంది. అయితే దీనికి ప్రధాన కారణం సంక్షేమ పథకాలే. అయితే సంక్షేమ పథకాలను జగన్ ఎంతకాలం కొనసాగిస్తారన్న అనుమానం పార్టీ నేతల్లో కూడా లేకపోలేదు. ప్రధానంగా ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

ఆర్థిక పరిస్థితి…..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. అందిన కాడికి అప్పులు తెస్తున్నారు. ప్రతి ఏడాది సంక్షేమ పథకాలకే దాదాపు 70 వేల కోట్లను జగన్ ప్రభుత్వం కేటాయించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఇది సాధ్యపడదు. అప్పులు ఇచ్చేందుకు కూడా ఆర్థిక సంస్థలు సుముఖత వ్యక్తం చేయవు. ఈ నేపథ్యంలో జగన్ ఎంతకాలం సంక్షేమ పథకాలను కొనసాగిస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

కోత విధించాలన్నా…

అయితే సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే లబ్దిదారుల్లో కోత విధించాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలిసింది. అన్ని కుటుంబాలకు వివిధ పథకాల కింద దాదాపు ఏడాది అరవై వేల వరకూ లభిస్తున్నాయన్న అంచనా ఉంది. అయితే ఒకసారి అమలు చేసిన పథకం మరోసారి అందకపోతే లబ్దిదారుల్లో అసంతృప్తి తలెత్తుతుందన్న అనుమానం కూడా లేకపోలేదు. అందుకే దీనిపై తీవ్ర స్థాయిలో అధికారుల బృందం కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది.

కొత్త పథకాలకు బ్రేక్?

ఇప్పుడున్న పథకాలతో పాటు కొత్త పథకాలను ఇక ప్రవేశ పెట్టకూడదన్న నిర్ణయం కూడా జగన్ తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొత్త పథకాలేవీ 2022 వరకూ ప్రకటించకూడదని జగన్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. 2023లో కొత్త పథకాలను ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. కొత్త పథకాల ప్రకటన వాయిదా వేయడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణం. దీని నుంచి జగన్ ఎలా అధిగమిస్తారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News