జగన్ ను ఇలా కాటేస్తుందేమిటో?

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి కాలం కలసి రావడం లేదు. సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి బలంగా వెళ్లానుకున్న జగన్ కు అడుగడుగునా అడ్డంకులు [more]

Update: 2021-05-01 02:00 GMT

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి కాలం కలసి రావడం లేదు. సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి బలంగా వెళ్లానుకున్న జగన్ కు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయని ఆర్థిక శాఖ నిపుణులు చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం కూడా ఆదాయం బాగా తగ్గిపోవడం, ఇప్పుడు అదే పరిస్థితులు నెలకొనడం ఆందోళన కల్గిస్తున్నాయి.

ఆరు నెలలు మాత్రమే….?

జగన్ అధికారాన్ని చేపట్టిన తర్వాత గట్టిగా ఆరు నెలలు మాత్రమే సజావుగా పాలన చేయగలిగారు. ఆ తర్వాత కరోనా వైరస్ రావడంతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థం అయింది. దాదాపు మూడు నెలల పాటు కరోనా తీవ్ర స్థాయిలో ఉండటంతో రాష్ట్ర ఖజానా భారీగా నష్టపోయింది. కరోనా సమయంలోనూ జగన్ సంక్షేమ పథకాలను నిలిపివేయలేదు. దీనికి తోడు కరోనా బాధితుల కోసం ఆసుపత్రుల్లో సౌకర్యాలు, మందులు, వైద్యానికి ఖర్చు చేయాల్సి వచ్చింది. కరోనాను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చడంతో మరింత ఆర్థిక భారం పడిందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.

మరోసారి తీవ్రత…..

ఇప్పుడు మరోసారి కరోనా రాష్ట్రంలో విజృంభిస్తుంది. అయితే ఈసారి లాక్ డౌన్ లేకపోయినా ఇప్పటికే వ్యాపారాలు బోసిపోయి కన్పిస్తున్నాయి. ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతింటున్నాయి. దీంతో జగన్ మరోసారి రాయితీలను ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో కరోనా వచ్చినప్పుడు ప్రకటించిన రాయితీలను తిరిగి ప్రకటించాలా? వద్దా? అన్న దానిపై అధికారులు కసరత్తులు ప్రారంభించారు.

ఆర్థిక పరిస్థితి….

ఇలా జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి కరోనా రూపంలో ఆయన పాలనకు ఆటంకం ఏర్పడుతుంది. అన్ని ఎన్నికల్లో విజయం సాధించినా, ప్రజలు తనవైపే ఉండటంతో జగన్ కు ఈ పరిస్థితుల్లో మరింత బాధ్యత పెరిగిందటున్నారు. గత ఏడాది మార్చి, ఏప్రిల్ నాటి పరిస్థితుల కంటే ఈసారి దారుణంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో జగన్ కు పాలన కత్తిమీద సామే అయింది.

Tags:    

Similar News