2024 ఎలక్షన్స్ ….జగన్ సంధించేవి ఆ రెండే అస్త్రాలేనా ?
వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ ఏ నినాదంతో ముందుకు వెళ్తుంది ? గత ఎన్నికల మాదిరిగా చెప్పుకొనేందుకు చంద్రబాబు అధికారంలో లేరు. సో.. ఐదేళ్లు తామే అధికారంలో [more]
వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ ఏ నినాదంతో ముందుకు వెళ్తుంది ? గత ఎన్నికల మాదిరిగా చెప్పుకొనేందుకు చంద్రబాబు అధికారంలో లేరు. సో.. ఐదేళ్లు తామే అధికారంలో [more]
వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ ఏ నినాదంతో ముందుకు వెళ్తుంది ? గత ఎన్నికల మాదిరిగా చెప్పుకొనేందుకు చంద్రబాబు అధికారంలో లేరు. సో.. ఐదేళ్లు తామే అధికారంలో ఉన్నారు. అదీకాక.. గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టు..ప్రత్యేక హోదా.. పోలవరం.. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వంటివి చెప్పే అవకాశం కూడా లేదు. అంతేకాదు.. కేంద్రం మెడలు వంచుతాం.. అనే మాట కూడా వినిపించదు. ఇక, చంద్రబాబుకు ఓటేయొద్దు అని నొక్కి వక్కాణించడానికి ఆయన ఎలాగూ ప్రతిపక్షంలోనే ఉన్నారు. ఇక తాము అధికారంలో ఉన్నాం… సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.. కదా.. ఓటేయ్యండి.. అంటే.. మీ సొమ్ము ఇచ్చారా? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. గత ఎన్నికల్లో జగన్ క్యాస్ట్ ఈక్వేషన్ల నుంచి అనేకానేక కారణాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి ఘనవిజయం సాధించారు.
కొత్త వ్యూహాలు….
ఇక ఇప్పుడు పైన చెప్పుకున్న కారణాలను పరిగణనలోకి తీసుకుంటే.. వచ్చే ఎన్నికల నాటికి కొత్త వ్యూహాలు వైసీపీకి అత్యంత అవసరం. ఈ క్రమంలో ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించిన వైసీపీ అధినేత, సీఎం జగన్.. రెండు ప్రధాన అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు అస్త్రాలను వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసుకుని ఆయన ఎన్నికల సమరంలోకి దిగుతారని అంటున్నారు. అవే.. ఒకటి మహిళలు, రెండు యువత. ప్రస్తుతం ఏ పథకం ప్రారంభించినా.. ఎక్కడ ఏపదవులు ఇవ్వాల్సి వచ్చినా.. తన చేతిలో ఉన్నంత వరకు మహిళలకు ఇచ్చేస్తున్నారు.
యువత, మహిళలకు….
అదే సమయంలో డ్వాక్రా, స్వయంసహాయక బృందాల్లోని మహిళలకు కూడా ఇబ్బడి ముబ్బడిగా జగన్ రుణాలు ఇస్తున్నారు. ఇక, ఇతర పథకాలు… కార్పొరేషన్లలోనూ మహిళలకు 50 శాతం పదవులు ఇస్తున్నారు. ఇది తనకు ఎన్నికల్లో ప్రయోజనం చేకూర్చుతుందని.. ఇతర వాదనలు పక్కకు పోతాయని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో.. యువతకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చి.. ఉద్యోగాలు పక్కన పెట్టి వారికి రాజకీయంగా అవకాశం కల్పించేందుకు మరో వ్యూహం వేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం యువతలో జగన్‌కు తిరుగులేని క్రేజ్ ఉంది. సచివాలయ ఉద్యోగాలు, వలంటీర్లతో ఎక్కువ మంది యువత తమకు ఏదో ఒక ఉపాధి దొరికిందన్న సంతోషంలో ఉన్నారు.
భర్తీ చేసి….
ఇక ఈ మూడేళ్లలో మరిన్ని వలంటీర్ పోస్టులు, సచివాలయ ఉద్యోగాలు ఖాళీ అవ్వడం.. వాటిని భర్తీ చేయడం జరగడం కామన్. ఇక ఇప్పటికే వైసీపీలో యువతకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. అన్ని పదవుల్లోనూ కొత్త వారే ఉన్నారు. వచ్చే ఎన్నికలలోపే.. పార్టీలోకి ఎక్కువగా యువతను తీసుకుని.. వారికి కార్యదర్శులుగా పదవులు ఇచ్చి.. రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా.. గెలుపును సొంతం చేసుకునేలా ముందుకు సాగాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే.. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు అలానే ఉన్నప్పటికీ.. వ్యక్తిగత లబ్ధి, గుర్తింపు కనుక లభిస్తే.. తిరిగి ఓటు బ్యాంకు తనకే సొంతం అవుతుందని జగన్ భావిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఇది ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.