అధికారులు హ‌డ‌లి ‌పోతున్నారట నిజమేనా?

ఏపీలోని జ‌గ‌న్ ప్రభుత్వంలో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాల‌న్నా.. హ‌డ‌లి పోతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ప్రభుత్వం చెప్పింది చేసేందుకు అధికారులు ఉన్నప్పటికీ.. ఐఏఎస్‌లుగా, ఐపీఎస్‌లుగా వారి సీనియార్టీని [more]

Update: 2021-04-22 02:00 GMT

ఏపీలోని జ‌గ‌న్ ప్రభుత్వంలో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాల‌న్నా.. హ‌డ‌లి పోతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ప్రభుత్వం చెప్పింది చేసేందుకు అధికారులు ఉన్నప్పటికీ.. ఐఏఎస్‌లుగా, ఐపీఎస్‌లుగా వారి సీనియార్టీని సైతం వినియోగించి.. ప్రభుత్వానికి స‌ల‌హాలు , సూచ‌న‌లు ఇవ్వాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంటుంది. అయితే.. ఇప్పుడు ఏ ఒక్క అధికారి కూడా సూచ‌న‌లు స‌ల‌హాలు ఇచ్చేందుకు సిద్ధంగా లేకపోవ‌డం గ‌మ‌నార్హం. తాజా ప‌రిణామాల‌పై ఉన్నతాధికారుల్లో జ‌రుగుతోన్న చ‌ర్చలు విశ్వస‌నీయ వ‌ర్గాల ద్వారా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

చెప్పిందే చేస్తాం…

ప్రస్తుతం క‌రోనా రెండో ద‌శ వ్యాప్తి ఎక్కువ‌గా ఉంది. దీంతో లాక్‌డౌన్ పెడ‌దామా? లేక క‌ర్ఫ్యూ పెడ‌దామా? అనే చ‌ర్చ ఉన్నతాధికారుల మ‌ధ్య చ‌ర్చకు వ‌చ్చింది.దీనిపై స్పందించేందుకు మిగిలిన అధికారులు ఎవ‌రూ కూడా ఆస‌క్తి చూప‌లేదు. పైగా మాకెందుకు సార్‌.. మీరు చెప్పింది చేస్తాం.. అని తేల్చి చెప్పారు. ఇది విన్న సీఎం సెక్రట‌రీలు, ఆయ‌న స‌ల‌హాదారులు అవాక్కయ్యార‌ట‌. అత్యంత కీల‌క‌మైన స‌మ‌యంలో ఉన్నతాధికారుల స‌ల‌హాలు ప్రభుత్వానికి కీల‌క‌మ‌ని.. ఇలాంటి స‌మ‌యంలో చేతులు ఎత్తేయ‌డం ఏమేర‌కు స‌మంజ‌స‌మ‌ని వారు త‌ర్జనభ‌ర్జన ప‌డ్డారు. అయితే.. గ‌తంలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్న అధికారుల‌పై సీఎం జ‌గ‌న్ ప్రభుత్వం ఎలాంటి చ‌ర్యలు తీసుకుందో.. త‌మ‌కు కూడా అదే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని వారు భావిస్తున్నట్టు స‌మాచారం.

గతంలో అధికారులు…..

గ‌తంలో ప్రభుత్వ స‌ల‌హాదారుగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మగ‌డ్డ ర‌మేష్ ‌కుమార్‌, అప్పటి నిఘా విభాగం డీజీ ఏబీ వెంక‌టేశ్వర‌రావు వంటివారి విష‌యంలో సీఎం జగన్ వ్యవ‌హ‌రించిన తీరు.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వంటివి ప్రస్తుతం అధికారులు ఇంకా మ‌రిచిపోలేక పోతున్నారు. అధికారుల పెత్తనానికి అడ్డుక‌ట్టవేసే ఉద్దేశంతోనే జ‌గ‌న్ ఇలా చేశార‌ని.. త‌మ‌కు స్వతంత్రం లేద‌ని.. భావించే వారు కూడా క‌నిపిస్తున్నారు. ఈ క్రమంలో ఏ విష‌యంలో అయినా.. వారు నిమిత్తమాత్రులు గానే ఉంటున్నారు. ఇక ఇటీవ‌ల ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల ప‌నితీరుపై సీఎం స్వయంగా స‌మీక్షిస్తార‌ని తీసుకున్న నిర్ణయంతో వీరు మ‌రింత ర‌గులుతున్నారు.

మౌనంగా ఉండటమే…?

వీరు పైకి మాత్రమే ప్రభుత్వంపై ప్రేమ‌తో ఉన్నారే త‌ప్ప లోప‌ల వీరి కోపం చ‌ల్లార‌డం లేద‌ని టాక్ ? స‌ల‌హాల విష‌యంలో వీరు మౌనంగా ఉండ‌డ‌మే కాదు.. మాక‌న్నా మీకే ఎక్కువ‌గా తెలుసు! అంటూ.. కీల‌క స‌ల‌హాదారు ముందు విన‌యం న‌టించి బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. దీంతో ఏ నిర్ణయం తీసుకోవాల‌న్నా.. మొత్తం భారం స‌ల‌హాదారుల‌పైనే ప‌డుతోంద‌ని.. దీంతో నిర్ణయాలు ఆల‌స్యమై.. ప్రజ‌ల‌కు ఇబ్బందులు త‌ప్పడం లేద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇదీ.. ఇప్పుడు ఉన్నతాధికారుల‌కు, ప్రభుత్వానికి మ‌ద్య ఉన్న రిలేష‌న్ అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News