ముఖ్యమంత్రి కాగానే సరిపోదు… మనసుండాలి

వైఎస్ జగన్ అచ్చమైన రాజకీయ నాయకుడిగా మారిపోయారు. ప్రజలను తన దరిచేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కన్పిస్తుంది. కష్ట సమయల్లోనూ జగన్ ప్రజలకు అండగా ఉండటం అందరి చేత [more]

Update: 2021-04-24 06:30 GMT

వైఎస్ జగన్ అచ్చమైన రాజకీయ నాయకుడిగా మారిపోయారు. ప్రజలను తన దరిచేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కన్పిస్తుంది. కష్ట సమయల్లోనూ జగన్ ప్రజలకు అండగా ఉండటం అందరి చేత శభాష్ అనిపించుకునేలా చేస్తుంది. జగన్ ఆర్థిక వ్యవస్థను పట్టించుకోరు. అప్పు చేసి పప్పు కూడు తింటున్నారు. రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారన్న విపక్షాల విమర్శలకు తన చేతల ద్వారానే జగన్ సమాధానం చెబుతున్నారు.

ప్రతి నిర్ణయమూ….

జగన్ తీసుకునే ప్రతి నిర్ణయమూ ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఉంటుంది. సరే జగన్ మొండోడని, మద్యం బ్రాండ్లద్వారా కోట్లు సంపాదిస్తున్నారని, ఇసుక తవ్వకాల ద్వారా వైసీపీ నేతలు కాసులు దండుకుంటున్నారన్న విమర్శలు ఉండవచ్చు. అందులో నిజానిజాలను పక్కన పెడితే ప్రజలను కష్టసమయంలో ఆదుకున్న వాడే నిజమైన నాయకుడవుతారు. అందులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ తొలిస్థానంలో నిలుస్తారు.

సంక్షేమ పథకాలను ఆపకుండా….

సంక్షేమ పథకాలకు నిధులు ఆపడంలేదు. అనేక పథకాల ద్వారా ఏడాదికి 70 వేల కోట్ల రూపాయాలను వచ్చిస్తున్నారు. దీనిపై కూడా జగన్ ను విమర్శించేవారు లేకపోలేదు. ప్రజల సొమ్మును పప్పు బెల్లాలుగా పంచిపెడుతున్నారన్న కామెంట్సూ వినిపించాయి. కానీ ఆ సొమ్ము ఆకుటుంబానికి ఎంత అవసరమో గుర్తిస్తే అటువంటి వ్యాఖ్యలు మనకు కనపడవు. ఇక తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయం అందరి ప్రశంసలను అందుకుంటుంది.

ఉచిత టీకా…..

కోవిడ్ టీకాను 18 ఏళ్ల పైబడిన వారిందరీకి ఉచితంగా ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఇందుకోసం 1600 కోట్లను జగన్ ప్రభుత్వం ఖర్చు చేయనుంది. అయినా వెనకాడకుండా ఆర్థిక ఇబ్బందులను పట్టించుకోకుండా జగన్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్హం వ్యక్తమవుతుంది. ముఖ్యమంత్రి అవ్వగానే సరిపోదు అందుకు తగిన మనసుండాలి అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో విన్పిస్తున్నాయి. శభాష్ జగన్ అని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Tags:    

Similar News