60 నిండితే ఇక అంతేనా?.. వైసీపీలో తీవ్ర చర్చ..!
రాజకీయాలకు వయసుకు సంబంధం లేదు. అంతేకాదు.. ఏ ఉద్యోగంలో అయినా.. రిటైర్మెంట్ ఉంటుంది. సైనిక ఉద్యోగం అయితే.. మరింత ముందుగానే ఇంటికి పంపేస్తారు. ఇక, మిగిలిన ఉద్యోగాల్లో [more]
రాజకీయాలకు వయసుకు సంబంధం లేదు. అంతేకాదు.. ఏ ఉద్యోగంలో అయినా.. రిటైర్మెంట్ ఉంటుంది. సైనిక ఉద్యోగం అయితే.. మరింత ముందుగానే ఇంటికి పంపేస్తారు. ఇక, మిగిలిన ఉద్యోగాల్లో [more]
రాజకీయాలకు వయసుకు సంబంధం లేదు. అంతేకాదు.. ఏ ఉద్యోగంలో అయినా.. రిటైర్మెంట్ ఉంటుంది. సైనిక ఉద్యోగం అయితే.. మరింత ముందుగానే ఇంటికి పంపేస్తారు. ఇక, మిగిలిన ఉద్యోగాల్లో అయితే..ఏజ్ లిమిట్ పెట్టి.. అది తీరగానే ఇంటి ముఖం చూపిస్తారు. కానీ, రాజకీయాలలో అయితే.. వయసుతో పనిలేదు. ఎంత వయసు వచ్చినా.. రాజకీయాల్లో ఉండొచ్చు… పదవులు పొందొచ్చు. ఇదీ ఇప్పటి వరకు సాగిన పరిస్థితి. ప్రస్తుతం ఇతర పార్టీల్లో సాగుతున్న పరిస్థితి కూడా. అంతెందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు 70 ప్లస్. అయినా.. ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
60 ఏళ్లు నిండిన….
ఇక, ఇతర ఆ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నా.. కరణం బలరాం(ఇప్పుడు వైసీపీ మద్దతుదారు), గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటివారు కూడా 65 ప్లస్సే.. ఇక, ఇదే తరహాలో వైసీపీలోనూ కొందరు ఉన్నారు. కొందరు మంత్రులుగా కూడా ఉన్నారు. అయితే.. ఇప్పుడు టీడీపీ మాట పక్కన పెడితే.. వైసీపీ అధినేత జగన్ ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదేంటంటే.. 60 ఏళ్లు నిండిన వారికి టికెట్లు ఇవ్వరాదని, ఇది ఒక రకంగా ఆయనకు కూడా ప్రతిబంధకమే. ఎందుకంటే.. ప్రస్తుతం 58 + ఏళ్ల వయసులో ఉన్న ఆయన వచ్చే ఎన్నికల నాటికి 60 ఏళ్లకు వచ్చేస్తారు.
నిర్ణయం తీసుకుంటే….
అయినప్పటికీ.. ఒక వ్యూహం ప్రకారం దీనిని అమలు చేయాలని అనుకుంటున్నారట.. జగన్. 60 ఏళ్లు నిండిన వారికి టికెట్ ఇవ్వరాదని.. ఒకవేళ అంత ప్రజాబలం ఉన్ననేతలైతే.. టికెట్లు ఇచ్చినా.. మంత్రి పదవులను ఎట్టిపరిస్థితిలోనూ ఇవ్వరాదని నిర్నయించుకున్నట్టు వైసీపీలో ఒక అనధికార చర్చ సాగుతుండడం గమనార్హం. ఇది నిజమో కాదో.. తెలియదు కానీ.. నిర్ణయం మాత్రం సంచలనంగా మారిందని అంటున్నారు.
మంచిదే అయినా…?
ప్రస్తుతం .. ఈ విషయంపై వైసీపీలో జోరుగా చర్చ మాత్రం సాగుతోంది. ఈ నిర్ణయం వెనుక.. యువతను ప్రోత్సహించడంతోపాటు.. టీడీపీకి మరింత చెక్ పెట్టేందుకు అవకాశం ఉందని అంటున్నారు వైసీపీ సీనియర్లు. “నిర్ణయం మంచిదే. అయితే.. అమలు మాత్రం కష్టం“ అని ఒక నేత చూచాయగా చెప్పుకొచ్చారు. మరి జగన్ నిజంగానే ఈ ఆలోచనను ఆచరణలో పెడతారా? లేక.. ఎవరికి వారు తప్పుకొంటేనే మంచిదని హింట్ ఇచ్చారా ? తెలియాల్సి ఉంది. ఎందుకంటే టీడీపీలో వృద్ధ నేతలు ఎక్కువయ్యే పార్టీని బ్రష్టు పట్టించారన్న టాక్ వచ్చేసింది. జగన్ ఈ విషయంలో ముందు నుంచే జాగ్రత్తలకు రెడీ అవుతోన్న పరిస్థితి ఉంది.