జగన్ మమ్మల్ని వాడుకుని వదిలేస్తున్నారు.. ఇదో పెద్ద కల్లోలం
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది. అయితే.. ఎవరూ కూడా బయటకు నేరుగా చెప్పడం లేదు. వారిలో వారే గుసగుసలాడుతున్నారు. కొందరు ఇది.. రగులుతున్న అగ్నిపర్వతం [more]
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది. అయితే.. ఎవరూ కూడా బయటకు నేరుగా చెప్పడం లేదు. వారిలో వారే గుసగుసలాడుతున్నారు. కొందరు ఇది.. రగులుతున్న అగ్నిపర్వతం [more]
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది. అయితే.. ఎవరూ కూడా బయటకు నేరుగా చెప్పడం లేదు. వారిలో వారే గుసగుసలాడుతున్నారు. కొందరు ఇది.. రగులుతున్న అగ్నిపర్వతం అని.. ఎప్పటికైనా.. పేలిపోవడం ఖాయమని అంటున్నారు. అంతేకాదు.. జగన్ ఇలా చేస్తారని అనుకోలేదని కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంతకీ ఏం జరిగింది? ఎవరు ఇలా అనుకుంటున్నారు? దీని వల్ల జగన్‌కు వచ్చే నష్టం ఏంటి? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రంగా ఉన్నాయి.
ఇప్పటికే ఇరవై మంది వరకూ…?
ఎక్కడికి వెళ్తే.. ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో తెలియక.. ప్రజలు, సెలబ్రిటీలు ప్రాణాలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని గడుపుతున్నారు. ఇలానే.. ఇప్పుడు ఈ కోవలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సైతం .. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ముందుకు నడవాలంటే.. ఉద్యోగులే కీలకం.. ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా.. అమలు చేసేది అధికారులు, ఉద్యోగులే. అయితే.. కరోనా రెండో దశ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఉద్యోగులు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది వరకు చనిపోయారు. వీరిలో అన్ని స్థాయిల వారు ఉన్నారు.
వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని….
దీంతో ఉద్యోగులు.. తమకు ఇంటి నుంచి పని చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అదే సమయంలో కరోనా భీమా వర్తింపచేయాలని, కరోనా కిట్లు అందించాలని.. మాస్కులు ఇవ్వాలని.. కోరుతున్నారు. కానీ, ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. ముఖ్యంగా ఉద్యోగ సంఘాల నాయకులకు సీఎం జగన్ అసలు అప్పాయింట్ మెంటు కూడా ఇవ్వడం లేదని నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని విమర్శలు చేస్తున్నారు.
తాము దన్నుగా నిలిచినా…?
స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఇచ్చినప్పుడు తాము ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశామని.. ఈ క్రమంలో అప్పటి కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను సైతం ఎదిరించినంత పనిచేశామని.. ఈ నేపథ్యంలో తాము.. కోర్టుల నుంచి తిట్లు కూడా తిన్నామని.. ఇంత చేసిన తమను ఆనాడు పొగిడి.. ఇప్పుడు అవసరం వచ్చే సరికి జగన్ ముఖం చాటేస్తున్నారు! అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ విషయం లో ఎవరూ ముందుకు వచ్చి వ్యాఖ్యలు చేయడం లేదు. మొత్తంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడం గమనార్హం.