ఈ విషయంలో జగన్ సక్సెస్ కాకుంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతుంది. అయితే ఆయన ఎక్కువగా క్యాంప్ కార్యాలయానికే పరిమితమయ్యారు. దాదాపు ఈ రెండేళ్ల నుంచి ఆయన బయటకు వచ్చిన సందర్భాలు [more]

Update: 2021-04-29 09:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతుంది. అయితే ఆయన ఎక్కువగా క్యాంప్ కార్యాలయానికే పరిమితమయ్యారు. దాదాపు ఈ రెండేళ్ల నుంచి ఆయన బయటకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. విశాఖలో ఎల్జీ పరిశ్రమలో జరిగిన దుర్ఘటన సమయంలో, శారదా పీఠం దర్శనం, ఇంకా కొన్ని జిల్లాల్లో ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకు మాత్రమే జగన్ హాజరయ్యారు.

సంక్షేమ పథకాలను…..

కానీ జగన్ ముఖ్యమంత్రిగా ప్రజలకు సంక్షేమ పథకాలను పంపిణీ చేయడంలో సఫలమవుతున్నప్పటికీ, సౌకర్యాల కల్పనలో ఆయన వెనుకబడి ఉన్నారని చెప్పక తప్పదు. క్షేత్రస్థాయిలో జగన్ పర్యటనలు చేయకపోవడం వల్లనే కొన్ని సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. ఇందులో ప్రధానంగా ఆసుపత్రుల్లో సౌకర్యాలు ఒకటి. కరోనా సమయంలో ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. బెడ్స్ ఖాళీలు లేక అంబులెన్స్ లోనే చికిత్స చేస్తున్నారు.

కరోనా సమయంలో….

కానీ జగన్ మాత్రం కరోనా సమయంలో ఏ ఒక్క ఆసుపత్రిని సందర్శించలేదు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీలు చేస్తే కొంత పరిస్థితి మెరుగపడే అవకాశముందంటున్నారు. వైద్య సిబ్బందిలోకూడా జవాబుదారీతనం కల్పించడానికి జగన్ పర్యటనలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. కానీ కరోనా విజృంభిస్తున్న సమయంలో జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికే పరిమితం కావడం విమర్శలకు తావిస్తుంది.

ప్రజలకు భరోసా ఏదీ?

సంక్షేమ పథకాల వల్లనే ప్రజామోదం పొందలేరు. తమకు కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వం అండగా ఉందని భరోసా కల్గినప్పుడే ప్రజలు కూడా ప్రభుత్వానికి వెన్నంటి ఉంటారు. కానీ ఈ విషయంలో జగన్ సక్సెస్ కాలేకపోయారంటున్నారు. కోవిడ్ కేసులు పెరగడానికి ముందస్తు చర్యలు తీసుకోకపోవడమేనన్న ఆరోపణలున్నాయి. క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేయాలంటే జగన్ క్షేత్రస్థాయి పర్యటలను చేయాల్సిందేనన్న వ్యాఖ్యలు పార్టీ నుంచే విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News