ర‌ఘురామ ఎఫెక్ట్‌.. ఆ సంప్రదాయానికి జ‌గ‌న్ చెక్ ?

ఏపీలో వైసీపీ రెబ‌ల్ ఎంపీ క‌నుమూరు ర‌ఘురామ కృష్ణంరాజు వ్యవ‌హారం ఇప్పుడు రాజకీయంగా కాక రేపుతోంది. గ‌తంలో ఓ సారి వైసీపీని వీడి తిరిగి గ‌త ఎన్నిక‌ల‌కు [more]

Update: 2021-05-31 12:30 GMT

ఏపీలో వైసీపీ రెబ‌ల్ ఎంపీ క‌నుమూరు ర‌ఘురామ కృష్ణంరాజు వ్యవ‌హారం ఇప్పుడు రాజకీయంగా కాక రేపుతోంది. గ‌తంలో ఓ సారి వైసీపీని వీడి తిరిగి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలోకి వ‌చ్చిన ఆయ‌న ఎంపీ అయిన కొద్ది నెల‌ల నుంచే జ‌గ‌న్‌ను, పార్టీ అధిష్టానాన్ని, వైసీపీ కీల‌క నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు. ర‌చ్చబండ పేరుతో ఆయ‌న ప్రతి రోజు ప్రభుత్వాన్ని, అధికార పార్టీని ఏకి ప‌డేస్తున్నారు. అంతేకాకుండా ప‌రోక్షంగా బీజేపీ, టీడీపీకి మేలు చూకూర్చేలా వ్యవ‌హ‌రిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు కూడా వైసీపీ నుంచి ఆయ‌న‌పై ఉన్నాయి. ఇక ర‌ఘురామ కృష్ణంరాజు రెడ్డి వ‌ర్గాన్ని ప‌దే ప‌దే టార్గెట్‌గా చేసుకుని కూడా విమ‌ర్శలు చేస్తూ వ‌స్తున్నారు. తాజాగా ఆయ‌న్ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయ‌డంతో ఈ వివాదం మ‌రింత ముద‌ర‌డంతో పాటు జాతీయ స్థాయిలో దీనిపై పెద్ద ఎత్తున చ‌ర్చలు న‌డుస్తున్నాయి.

క్షత్రియులకు ప్రయారిటీ…

ర‌ఘురామ కృష్ణంరాజు వ‌ర్సెస్ ప్రభుత్వం మ‌ధ్య జ‌రిగిన వార్‌లో రెడ్డి వ‌ర్గంపై ర‌ఘురామ తీవ్ర విమ‌ర్శలు చేయ‌డం.. ఇటు వైసీపీ అధిష్టానం కూడా అదే క్షత్రియ వ‌ర్గం మంత్రి రంగ‌రాజుతో పాటు ఇత‌ర నేత‌ల‌తో ర‌ఘురామ కృష్ణంరాజును టార్గెట్ చేయించ‌డంతో ఈ వ‌ర్గంలో సామాన్య ప్రజ‌ల‌కు వైసీపీపై కాస్త అస‌హ‌నం, ఆగ్రహావేశాలు పెరిగిన వాతావ‌ర‌ణ‌మే క‌నిపిస్తోంది. వాస్తవానికి గ‌త ఎన్నిక‌ల‌కు ముందే ఇదే క్షత్రియ వ‌ర్గం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై గుస్సాతో ఉంది. కేబినెట్లో త‌మ‌కు మంత్రి ప‌ద‌వి లేకుండా చేశార‌ని వారు బాబుపై అస‌హ‌నంతో ఉన్నారు. అయితే జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో క్షత్రియుల‌కు ఎంతో ప్రయార్టీ ఇచ్చారు. ప‌శ్చిమ గోదావ‌రిలోనే న‌ర‌సాపురం, ఉండి, ఆచంట అసెంబ్లీ సీట్లతో పాటు న‌ర‌సాపురం పార్లమెంటు సీటును కూడా ఈ వ‌ర్గానికే కేటాయించారు. ఉండిలో త‌ప్ప అన్ని చోట్లా వైసీపీ నుంచి క్షత్రియ నేత‌లు గెలిచారు.

గ్యాప్ పెరగడంతో….

అనంత‌రం కొద్ది రోజుల‌కే ర‌ఘురామ కృష్ణంరాజుకు వైసీపీ అధిష్టానం, జ‌గ‌న్‌కు బాగా గ్యాప్ పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ప్రతిప‌క్షాలు కూడా దీనిని క్యాష్ చేసుకునే క్రమంలో క్షత్రియ వ‌ర్గంలో చీలిక తెచ్చేందుకు గ‌ట్టి ప్రయ‌త్నాలు చేస్తున్నాయి. ఈ విష‌యంలో టీడీపీతో పాటు బీజేపీ కూడా త‌న వంతు ప్రయ‌త్నాలు చేస్తోంది. గ‌త ఎన్నికల‌కు ముందు క్షత్రియులు జ‌గ‌న్‌కు ఎంత‌లా వ‌న్‌సైడ్‌గా సపోర్ట్ చేసినా ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. ప‌శ్చిమ డెల్టాలో క్షత్రియుల‌ది సామాజిక‌, రాజ‌కీయ ఆధిప‌త్యం.

న‌రసాపురం సంప్రదాయానికి జ‌గ‌న్ చెక్ ?

ఇదిలా ఉంటే గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచే జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా ఎన్నో సామాజిక స‌మీక‌ర‌ణ‌ల‌ను మార్చేసిన జ‌గ‌న్ ఈసారి న‌ర‌సాపురం ఎంపీ సీటు విష‌యంలో సంప్రదాయానికి చెక్ పెట్టేసే ప్రయ‌త్నాల్లో ఉన్నార‌ని తెలుస్తోంది. ఈ సీటును గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా పార్టీల‌తో సంబంధం లేకుండా అన్ని పార్టీలు క్షత్రియుల‌కే ఎక్కువుగా ప్రాధాన్యం ఇస్తూ వ‌స్తున్నాయి. గ‌తంలో దివంగ‌త వైఎస్సార్ డేర్ చేసి మాజీ మంత్రి చేగొండి హ‌రిరామ జోగ‌య్యను పోటీ పెట్టి అప్పటి కేంద్ర మంత్రి కృష్ణంరాజును ఓడించేలా వ్యూహం ప‌న్ని స‌క్సెస్ అయ్యారు. ఇక జ‌గ‌న్ కూడా 2014లో కాపు వ‌ర్గానికే చెందిన పారిశ్రామిక వేత్త వంకా ర‌వీంద్రనాథ్‌కు ఇక్కడ సీటు ఇవ్వగా ఆయ‌న ఓడిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న పేరే చివ‌రి వ‌ర‌కు ప‌రిశీల‌న‌లో ఉన్నా ఎన్నిక‌ల‌కు ముందు ర‌ఘురామ కృష్ణంరాజు తిరిగి పార్టీలోకి రావ‌డంతో పాటు… క్షత్రియ వ‌ర్గం ఒత్తిళ్లతో ఆయ‌న‌కే సీటు ఇచ్చారు.

జగన్ ఆలోచన మారింది…..

అయితే ఇప్పుడు ర‌ఘురామ కృష్ణంరాజు వ్యవ‌హారంతో పార్టీకి క్షత్రియ వ‌ర్గంలో డ్యామేజ్ జ‌ర‌గ‌డం… ఆ వ‌ర్గం నుంచి పార్టీపై ఒత్తిళ్లు రావ‌డం కూడా జ‌గ‌న్‌కు చికాకుగా మారింది. ఈ క్రమంలోనే న‌ర‌సాపురం ఎంపీ సీటు విష‌యంలో క్షత్రియ వ‌ర్గం సంప్రదాయానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ చెక్ పెట్టేయాల‌ని దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం న‌ర‌సాపురం పార్లమెంట‌రీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న గోక‌రాజు గంగ‌రాజు త‌న‌యుడు రంగ‌రాజుకు ఈ సీటు ఇవ్వాల‌ని ముందుగా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సీటును కాపు వ‌ర్గం లేదా బీసీల్లో బ‌ల‌మైన శెట్టి బ‌లిజ వ‌ర్గానికి కేటాయించాల‌ని ఆలోచ‌న చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నిక‌ల ముందు స‌మీక‌ర‌ణ‌ల‌ను బ‌ట్టి ప్రస్తుతం టీడీపీలో ఉన్న మాజీ మంత్రి పితాని స‌త్యనారాయ‌ణ‌కు ఈ సీటు ఆఫ‌ర్ చేసే ఆలోచ‌న‌లో కూడా వైసీపీ చేస్తోంద‌ని టాక్ ? అదే జ‌రిగితే వైసీపీ నుంచి క్షత్రియ వ‌ర్గానికి లోక్‌స‌భలో ఛాన్సులు ఇక ఉండ‌న‌ట్టే భావించాలి.

Tags:    

Similar News