మనసెరిగి పాలన చేస్తున్నారా… ?

జగన్ యువ ముఖ్యమంత్రిగా రెండేళ్ల పాలన పూర్తి చేశారు. ఆయనకు ఏమి అనుభవం ఉందని ముఖ్యమంత్రిగా జనాలు చాన్స్ ఇస్తారని ఎకసెక్కం ఆడిన వారంతా ముక్కున వేలేసుకునేలా [more]

Update: 2021-06-04 13:30 GMT

జగన్ యువ ముఖ్యమంత్రిగా రెండేళ్ల పాలన పూర్తి చేశారు. ఆయనకు ఏమి అనుభవం ఉందని ముఖ్యమంత్రిగా జనాలు చాన్స్ ఇస్తారని ఎకసెక్కం ఆడిన వారంతా ముక్కున వేలేసుకునేలా జగన్ ప్రజల మనసెరిగి పాలన చేస్తున్నారు. ఒక ప్రభుత్వంలో ఫలనా డిమాండ్ పెడితే అది అమలు కావడానికి ఎన్ని తరాలు పడుతుందో అన్నదే ఇప్పటి దాకా అంతా అనుకునే విషయం. కానీ జగన్ తలచుకుంటే అది వెంటనే అమలు లోకి వస్తోంది. అలా చాలా నిర్ణయాలను ఆయన తీసుకుని సంచలనం సృష్టించారు.

అంతకు మించి …?

జగన్ అప్పులు లక్షల కోట్ల దాకా తెచ్చారు. జనాలకు చిల్లరగా చేసి పంచుతున్నారు. ఇదే విమర్శను తెలుగుదేశం పార్టీ నుంచి అన్ని విపక్షాలూ చేస్తూ వస్తున్నాయి. అంతకు మించి వారు ఒక్క మాట కూడా అనలేకపోతున్నాయి. దానికి కారణం జగన్ తెచ్చిన డబ్బుని అంతా పారదర్శకంగా ఉపయోగించడమే. నూటికి తొంబై శాతం ఆదాయాన్ని ఆయన నగదు బదిలీ పధకం కింద జనాలకు నేరుగా అందించడం వల్ల ఎక్కడా అవినీతి అన్న మాట లేకుండా పోతోంది. దాంతో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇంత డబ్బు అప్పులుగా తెచ్చి మింగేశారు అనే సాహసం చేయలేకపోతోంది.

వేస్ట్ అయిందా …?

ఇక 2020-21 ఆర్ధిక సంవత్సరం చూసుకుంటే కరోనా మొదటి దశ వల్ల ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా తగ్గింది. మొత్తంగా ఒక లక్షా 17 వేల కోట్ల రూపాయలు మాత్రమే కేంద్ర నిధులతో కలుపుకుని ఏపీకి వచ్చాయి. దాంతో మరో 57 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం అప్పుగా చేసిందని కాగ్ రిపోర్ట్ బయటపెట్టింది. సరే ఇంత పెద్ద మొత్తంలో అప్పులు తెచ్చారు కదా మరి ఏం చేశారు అంటే అదంతా కళ్ల ముందు కనిపిస్తోంది. ఇందులో జగన్ సర్కార్ ప్రాధాన్యతా క్రమంలో 90 శాతం సంక్షేమ కార్యక్రమాలకే వెచ్చింది. మౌలిక కల్పనకు కేవలం 11 శాతం మాత్రమే కేటాయించింది. నిజమే ఆర్ధిక నిపుణులు దీన్ని తప్పు పట్టవచ్చు. వేస్ట్ అని కూడా అనవచ్చు. కానీ నిజంగా అది వృధా ఎలా అవుతుంది. మానవ వనరుల అభివృద్ధికే ప్రభుత్వం ఖర్చు చేసిందని మేధావులు అంటున్నారు.

బతికిపోయినట్లే…?

జగన్ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన లక్ష కోట్ల రూపాయల దాకా తన తండ్రిని అడ్డంపెట్టుకుని అవినీతి చేశారని ఈ రోజుకీ విపక్షాలు చేస్తున్న విమర్శలు. అయితే అవన్నీ పక్కన పెడితే ఆయన రెండేళ్ళుగా సీఎం గా పాలిస్తున్న రాష్ట్రంలో అవినీతి మచ్చ లేకపోవడం కంటే గొప్ప రికార్డు వేరేది లేదని అంటున్నారు. నిజానికి జగన్ ని ఎన్ని రకాలుగా విమర్శిస్తూ వస్తున్న తెలుగుదేశం సైతం నిధులను అభివృద్ధికి ఖర్చు చేయడంలేదు అంటోంది తప్ప అవినీతి చేశారు. జేబులో వేసుకున్నారు అని మాత్రం అనలేకపోతోంది. ఇక బీజేపీ కి చెందిన ఏపీ ఇంచార్జి సునీల్ డియోధర్ లాంటి వారు అయితే తెచ్చిన అప్పులన్నీ జగన్ సర్కార్ పంచుడు కార్యక్రమనికే వాడుతోంది అని మాత్రమే విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఒక్క విషయంలో జగన్ విపక్షాలకు థాంక్స్ చెప్పుకోవాలేమో.

Tags:    

Similar News