ఇది అభివృద్ధి కాదంటారా… ?

అభివృద్ధి అంటే ఏంటి. దానికి నిర్వచనం ఏంటి ఇదిపుడు ఏపీలో జరుగుతున్న చర్చ. మేము అభివృద్ధి చేశాం, వైసీపీ హయాంలో తట్టెడు సిమెంట్ కూడా ఎక్కడా వేయలేదు [more]

Update: 2021-06-06 02:00 GMT

అభివృద్ధి అంటే ఏంటి. దానికి నిర్వచనం ఏంటి ఇదిపుడు ఏపీలో జరుగుతున్న చర్చ. మేము అభివృద్ధి చేశాం, వైసీపీ హయాంలో తట్టెడు సిమెంట్ కూడా ఎక్కడా వేయలేదు అంటూ తరచూ తమ్ముళ్ళు అడిపోసుకుంటారు. నిజానికి అభివృద్ధి అన్నది నిరంతర ప్రక్రియ. అది ఏ రూపంలో సాగినా కూడా అంతిమంగా మాన‌వ జీవన వికాసం జరగాలి. అంటే ప్రగతి వల్ల మనిషి మరో మెట్టు పైకి ఎక్కాలి. ఆ విధంగా చూసుకున్నపుడు జగన్ సర్కార్ గత ప్రభుత్వాల కంటే కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తుందనే అంటున్నారు సామాజిక విశ్లేషకులు.

లక్షల ఆస్తిగా….?

జగనన్న గృహ నిర్మాణం పేరిట ఏపీలో మొత్తం 30 లక్షల ఇళ్ల నిర్మాణానికి జగన్ నిర్ణయం తీసుకున్నారు. మొదటి దశలో 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి తాజాగా శంకుస్థాపన చేశారు. అది 2022 జూన్ నాటికి పూర్తి కావాలని గడువు విధించారు. ఆ మీదట రెండవ దశ 2023 నాటికి పూర్తి చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఇక జగనన్న కాలనీలలో సమస్త సదుపాయాలు ఉండబోతున్నాయి. అంతే కాదు, ఇంటెర్నెట్ సౌకర్యం కూడా ఉంటుంది. ఇండిపెండెంట్ హౌసెస్ గా ఇవి ఉంటాయి. వీటి విలువ ఈ రోజుకు 15 లక్షలు అయితే కాలక్రమంలో అది ఒక తరగని ఆస్తిగా లబ్దిదారునికి దక్కనుంది.

యాక్టివిటీ పెరిగితే…?

ఇక జగన్ సంక్షేమ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఏపీలో అమలు చేస్తున్నారు. అదే విధంగా ఏపీలో పేదలు అన్న ప్రసక్తి లేకుండా అందరినీ పైకి తీసుకురావాలన్నది కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజల చేతిలో డబ్బులు కళకళలాడితే మారెట్లు కూడా కిటకిటలాడతాయి. ఆ విధంగా వినియోగం పెరిగితే తిరిగి పన్నుల ద్వారా ఖజానాకు ఆదాయం రూపంలో వచ్చి చేరుతుంది. ఇది తలపండిన ఆర్ధిక వేత్తలు చెప్పిన సత్యం. ఇపుడు దాన్ని జగన్ పాటిస్తున్నారు. కరెన్సీ కదలిక ఎక్కడైతే గట్టిగా ఉంటుందో ఎక్కడతై ఫైనాన్షియల్ యాక్టివిటీ బాగా ఉంటుందో అక్కడ ఖజానాకు కూడా తిరిగి ఆదాయం వస్తుంది. ఈ సూత్రాన్నే ఇపుడు ఏపీ సర్కార్ అమలు చేస్తుంది అనుకోవాలి.

నిజమైన ప్రగతి ….

ప్రజల జీవన ప్రమాణాలు పెరగడమే నిజమైన ప్రగతికి కొలమానంగా అంతా చూస్తారు. ఆ లెక్కన తీసుకుంటే ఈ రోజు పంచుడు పేరు మీద ఏపీ సర్కార్ వెదజల్లుతున్న అనేక కార్యక్రమాల ఫలాలు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తాయని అంటున్నారు. విద్య, వైద్యంతో పాటు సామాన్యుడికి ఆసరాగా నిలవాలని ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మేలు చేసేవే అన్నది ఆర్ధిక విశ్లేషకుల భావనగా ఉంది. ఇక జగనన్న హౌసింగ్ కాలనీల పేరుతో నిర్మించేవి ఇళ్ళు కాదు, ఊళ్ళకు ఊళ్ళే. ముప్పయి లక్షల ఇళ్ళు అంటే కనీసం కోటిన్నర మందికి స్థిరమైన భరోసా కల్పించడమే. మరి ఇది కాదా అసలైన అభువృద్ధి అంటున్నారు వైసీపీ మంత్రులు అవంతి శ్రీనివాసరావు, సీదరి అప్పలరాజు. తాము పేదలే టార్గెట్ గా చేసుకుని అమలు చేస్తున్న కార్యక్రమాలను విమర్శించే వారే అసలైన అభివృద్ధి నిరోధకులు అని కూడా వారు అంటున్నారు. మొత్తానికి ఏపీలో అభివృద్ధి మీద సాగుతున్న చర్చ ఆసక్తికరంగానే ఉంది.

Tags:    

Similar News