జగన్ కాదు కానీ షర్మిల అయితే… ?

ఏపీలో విపక్షాలు ఎవరు అంటే కంటికి కనిపించే పార్టీలే కాదు, టీడీపీకి అనుకూల మీడియా అధినేతలు కూడా. ఇపుడు జగన్ వారితోనూ చాలా గట్టిగానే యుద్ధం చేయాల్సివస్తోంది. [more]

Update: 2021-06-07 02:00 GMT

ఏపీలో విపక్షాలు ఎవరు అంటే కంటికి కనిపించే పార్టీలే కాదు, టీడీపీకి అనుకూల మీడియా అధినేతలు కూడా. ఇపుడు జగన్ వారితోనూ చాలా గట్టిగానే యుద్ధం చేయాల్సివస్తోంది. జగన్ బెయిల్ పిటిషన్ రద్దు సీబీఐ కోర్టులో ఇపుడు విచారణ దశలో ఉంది. అయితే అపుడే దాని మీద అపోజిషన్ తీర్పు చెప్పేస్తోంది. జగన్ బెయిల్ రద్దు అయి తీరుతుందని. దానికి తగిన ఆధారాలు ఉన్నాయని కూడా అంటోంది. అంటే వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు పిటిషన్ వేస్తే మొత్తం విపక్షాలు అన్నీ కూడా దాని మీద అనుకూలంగా స్పందించడమే ఇక్కడ అసలైన రాజకీయం.

నారాయణ జోస్యం …?

జగన్ బెయిల్ పిటిషన్ రద్దు అయి తీరుతుందని సీపీఐ నారాయణ జోస్యం చెప్పేస్తున్నారు. జగన్ ఈ విషయంలో ఏం చేయలేరని కూడా ఆయన అంటున్నారు. అందుకే ఆయన జనంలో సానుభూతి పొందేందుకు విపక్ష సీఎంలకు వ్యాక్సినేషన్ మీద లేఖలు రాశారాని తనదైన లాజిక్ పాయింట్ తీస్తున్నారు. తాను ఒక వేళ జైలుకు వెళ్ళినా కేంద్రం మీద తిరుగుబాటు చేయడం వల్లనే ఇలా జరిగింది అని చెప్పుకోవడానికి జగన్ ఈ విధంగా చేస్తున్నారు అని నారాయణ అంటున్నారు.

సిస్టరేనట …..?

ఇక అధికారం పోయిందని టీడీపీ కంటే ఎక్కువగా బాధపడిపోతున్న ఒక అనుకూల మీడియా అధిపతి అయితే జగన్ బెయిల్ రద్దు అవుతుందని, ఆ తరువాత ఆయన జైలుకు వెళ్లడం గ్యారంటీ అని రాసుకొచ్చేశారు. అంతే కాదు. ఏపీకి తరువాత సీఎం జగన్ సతీమణి భారతి కాదని జగన్ సోదరి షర్మిల అవుతుందని కూడా జాతకం చెప్పేశారు. షర్మిల వెనక ఒక పెద్ద జాతీయ పార్టీ ఉందని, ఆమెను ముందు పెట్టి ఆ పార్టీ మొత్తం చక్రం తిప్పుతుందని ఆ మీడియా చెప్పడం ఆశ్చర్యంగా ఉన్నా ఆసక్తిగా ఉంది మరి.

వెంట్రుకతో అలా …?

వెనకటికి ఒక సామెత ఉంది. నిరాశావాది వెంట్రుకతో అయినా కొండను లాగేందుకు చూస్తాడని. ఇపుడు విపక్షాలు నిరాశలో ఉన్నాయా అన్న డౌట్ అయితే వస్తోంది. జగన్ పాలన అందరికీ నచ్చాలని లేదు. అదే సమయంలో ఆయనను బ్రహ్మాండమైన మెజారిటీతో జనాలు ఎన్నుకున్నాయి. అయిదేళ్ల పాటు పాలించేందుకు అవకాశం ఇచ్చాయి. మరి ఆ గడువు పూర్తి కాకుండానే దొడ్డి తోవన ఆయన్ని దించేయాలన్న ఆలోచన ఎవరికి వచ్చినా అది ప్రజాస్వామ్య స్పూర్తికి ప్రమాదం. మరో విషయం ఏంటి అంటే సిద్ధాంతబద్ధులం అని చెప్పుకునే వామపక్షాలు జగన్ బెయిల్ రద్దు కావాలని, ఆయన ఏదో విధంగా ముఖ్యమంత్రి సీటు నుంచి తప్పుకోవాలని చూస్తూండడమే ఇక్కడ తమాషా. ఏది ఏమైనా ఒక్క జగన్ వెనక చాలానే పెద్ద కుట్ర జరుగుతోంది అనిపించకమానదు.

Tags:    

Similar News