టా..టా…బై….బై

గత నెల రోజులుగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రాజధాని అమరావతి అంశానికి నేడు ముగింపు చెప్పనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు [more]

Update: 2020-01-20 00:30 GMT

గత నెల రోజులుగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రాజధాని అమరావతి అంశానికి నేడు ముగింపు చెప్పనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మొత్తం మూడు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లోనే మూడు రాజధానుల అంశం డిసైడ్ కానుంది. ఇప్పటికే రాజధానిని అమరావతి నుంచి తరలంచవద్దంటూ విపక్షాలు ఆందోళన చేస్తున్న సమయంలో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగనున్నాయి.

ప్రసావించి మరీ….

గత అసెంబ్లీ సమావేశంలోనే ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేచర్ క్యాపిటల్ ఉంటే తప్పేంటని జగన్ ప్రశ్నించారు. ఆ తర్వాత ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ కూడా మూడు రాజధానులనే సిఫార్సు చేేసింది. దాని తర్వాత బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు కూడా సేమ్ టు సేమ్ నివేదిక ఇచ్చింది. అయితే బోస్టన్ రెండు ఆప్షన్లు ఇచ్చింది.

కమిటీలన్నీ…..

ఈ నేపథ్యంలో హైపవర్ కమిటీ జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు నివేదికలపై చర్చించింది. హై పవర్ కమిటీ మూడు దఫాలు భేటీ అయి అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించి ముఖ్యమంత్రి జగన్ కు నివేదిక ఇచ్చింది. ఈ మూడు కమిటీల నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై విపక్షాల అభ్యంతరాలను స్వీకరించనున్నామని జగన్ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. మూడు రోజుల్లో చర్చను ముగించి ఈ అంశానికి తెరదించాలని జగన్ భావిస్తున్నారు.

ఆమోదముద్ర వేసేందుకు….

ఇప్పటికే విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధానిగా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. అధికారులు కిందిస్థాయి సిబ్బందికి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. కేవలం అసెంబ్లీలో ఆమోదముద్ర పడటమే తరువాయి. ఉగాది నాటికి విశాఖకు అధికార యంత్రాంగాన్ని పూర్తిగా తరలించేందుకు జగన్ సిద్ధమయిపోయారు. ఒకవైపు విపక్షాల ఆందోళనలు, మరోవైపు న్యాయస్థానాల్లో ఇబ్బందులు కలగకుండా జగన్ విశాఖకు వెళ్లిపోయేందుకు రెడీ అయిపోయారు. అసెంబ్లీ సమావేశాలు కేవలం నామమాత్రమే.

Tags:    

Similar News