ఆ ఐదుగురు ఇక అంతేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి అనేక కారణాలున్నాయి. ఆయన పట్టుదలతో శ్రమించి ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీలాగా జగన్ కు పెద్దల అండదండలు లేవు. [more]

Update: 2021-08-07 06:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి అనేక కారణాలున్నాయి. ఆయన పట్టుదలతో శ్రమించి ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీలాగా జగన్ కు పెద్దల అండదండలు లేవు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి జగన్ కు మద్దతు గత ఎన్నికల్లో లభించలేదు. రాష్ట్రం విడిపోవడం, తెలుగు సినీ పరిశ్రమ మొత్తం తెలంగాణలో ఉండటంతో ఏపీని సినీ పెద్దలు లైట్ తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మాత్రం చంద్రబాబుతో సానుకూల వైఖరిని అవలంబించేవారు.

ఐదుగురు మాత్రం….

కానీ టాలీవుడ్ లో 90 శాత మంది జగన్ కు మద్దతు తెలపకపోయినా చంద్రబాబును వ్యతిరేకిస్తూ జగన్ కు అండగా నిలబడిన ఐదుగురు మాత్రం ఉన్నారు. వారిలో థర్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ పృథ్వీ, ఆలీ, పోసాని కృష్ణమురళి, సినీనటుడు కృష్ణ సోదరుడు శేషగిరిరావు, మోహన్ బాబు లు జగన్ కు అండగా నిలబడ్డారు. ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా టాలీవుడ్ పెద్దలు ఏపీ వైపు చూడటం లేదు.

పృథ్వీకి ఇచ్చినా…

జగన్ కూడా వారిని పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే అధికారంలోకి రాగానే పృథ్వీకి ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. వివిధ ఆరోపణల కారణంగా ఆయనను పదవి నుంచి తొలగించాల్సి వచ్చింది. ఆయన ఆ పదవిని నిలబెట్టుకోలేక పోయారు. ఇక జగన్ కూడా తనకు మద్దతిచ్చిన సినిమా వాళ్లను పక్కన పెట్టేసినట్లే కనపడుతుంది. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు ఇప్పటికే అసంతృప్తితో పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక ఆలీకి పదవి ఇస్తామని ఊరిస్తున్నారు.

వాయిస్ విన్పించే…..

పోసాని కృష్ణమురళి వైసీపీ వాయిస్ ను గట్టిగానే వినిపించారు. కానీ ఆయనకు కూడా రెండేళ్లవుతున్నా ఎలాటి పదవి ఇవ్వలేదు. ఇక మోహన్ బాబు చంద్రబాబును వ్యతిరేకిస్తూ వైసీపీ కండువా కప్పుకుని ప్రచారం చేసినా ఆయనకు ఎలాంటి గౌరవం దక్కలేదు. మోహన్ బాబుకు ఏదో ఒక పదవి వస్తుందని భావించారు. కానీ జగన్ మాత్రం సినీ పెద్దలను మాత్రం పూర్తిగా విస్మరించినట్లే కనపడుతుంది. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ వారికి ఎలాంటి పదవులు ఇవ్వకపోవడంతో ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో ఆ కొద్దిమంది మద్దతు జగన్ కు లభించే అవకాశం లేదు.

Tags:    

Similar News