ఈ 11 మంది మంత్రులు ఏటికి ఎదురీదుతున్నారా ?
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తవుతోంది. మరో మూడు నెలల తర్వాత అంటే దసరాకు కాస్త అటూ ఇటూగా జగన్ తన కేబినెట్లో భారీ [more]
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తవుతోంది. మరో మూడు నెలల తర్వాత అంటే దసరాకు కాస్త అటూ ఇటూగా జగన్ తన కేబినెట్లో భారీ [more]
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తవుతోంది. మరో మూడు నెలల తర్వాత అంటే దసరాకు కాస్త అటూ ఇటూగా జగన్ తన కేబినెట్లో భారీ ప్రక్షాళనకు రెడీ అవుతున్నారు. జగన్ కేబినెట్ లో మొత్తం 25 మంది మంత్రులు ఉన్నారు. ఈ మంత్రుల పనితీరుపై జగన్ ఇప్పటికే మూడు నాలుగు నివేదికలు కూడా తెప్పించుకున్నట్టు తెలుస్తోంది.
ఎవరికి ఉద్వాసన…?
వీరిలో ఎవరు ఉంటారో ? ఎవరు అవుట్ అవుతారో కాని.. వైసీపీ వర్గాల్లోనూ, మీడియాలోనూ జరుగుతోన్న ప్రచారం ప్రకారం 11 మంది మంత్రులను ఖచ్చితంగా తప్పిస్తారని అంటున్నారు. ఈ లిస్టులో వెల్లంపల్లి శ్రీనివాసరావు, సుచరిత, తానేటి వనిత, పుష్పశ్రీ, రంగనాధరాజు, జయరాం, శంకరనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, నారాయణ స్వామి, విశ్వరూప్, అవంతి శ్రీనివాస్ ఉన్నారు.
సామాజిక సమీకరణాలను కూడా…
ఈ మంత్రులను తప్పించే క్రమంలో కొందరు విషయంలో పనితీరును ప్రాతిపదికగా తీసుకుంటే.. మరి కొందరి విషయంలో సామాజిక సమీకరణలను కూడా బేస్ చేసుకోనున్నారట. పైన చెప్పుకున్న మంత్రుల్లో చాలా మంది మంత్రుల పనితీరు మరీ అధ్వానంగా ఉందని నివేదికలు జగన్ వద్దకు చేరినట్టు తెలుస్తోంది. వెల్లంపల్లి బదులు అన్నా రాంబాబు లేదా కోలగట్లకు ఛాన్స్ ఉండొచ్చు..! జయరామ్, శంకర్ నారాయణ ప్లేసులో బీసీ మంత్రులే వస్తారా ? లేదా ఆ జిల్లాల్లో రెడ్డి మంత్రులు ఉంటారా అన్నది చూడాలి.
వారికి బదులు వీరంటూ….
అనిల్ బదులు పార్థసారథి పేరుతో పాటు కారుమూరి నాగేశ్వరరావు పేరు కూడా లైన్ లో ఉంది. రంగనాథ రాజు బదులు ప్రసాదరాజుకు ఛాన్స్ ఖాయం. ఇక నలుగురు కాపు మంత్రుల్లో ఖచ్చితంగా ఇద్దరు అవుట్ కానున్నారు. మూడో కాపు మంత్రి కూడా బయటకు వెళ్లినా ఆశ్చర్యం లేదంటున్నారు. పుష్ప శ్రీ బదులు రాజన్నదొర లేదా బాలరాజుకు ఛాన్స్ ఖాయం. ఏదేమైనా ఎక్కువ మంది మంత్రుల పనితీరుపై జగన్ సంతృప్తితో లేరు.