జగన్ కూడా బాబుకు తగిలిన సెగేనా..?
ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఇదే మాట అంటున్నారు. గతంలో చంద్రబాబుకు తగిలిన సెగే .. ఇప్పుడు.. జగన్ కు కూడా తగులుతుందని అంటున్నారు. అంతేకాదు [more]
;
ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఇదే మాట అంటున్నారు. గతంలో చంద్రబాబుకు తగిలిన సెగే .. ఇప్పుడు.. జగన్ కు కూడా తగులుతుందని అంటున్నారు. అంతేకాదు [more]
ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఇదే మాట అంటున్నారు. గతంలో చంద్రబాబుకు తగిలిన సెగే .. ఇప్పుడు.. జగన్ కు కూడా తగులుతుందని అంటున్నారు. అంతేకాదు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు కూడా మారుతున్నాయని.. వ్యూహాత్మకంగా వ్యూహాలు ముందుకు వస్తున్నాయని అంటున్నారు. నిన్న మొన్నటి వరకు జగన్ తమకు దేవుడని.. రాముడని.. చెప్పుకొన్న ఉద్యోగ సంఘాలు.. త్వరలోనే ఉద్యమించేందుకు రెడీ అయ్యాయి. తమకు జగన్ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదనేది వారి ఆరోపణ. అంతేకాదు.. తమపై పనిభారం పెంచేశారని వారు అంటున్నారు.
వివాదంతో…?
ఈ పరిణామాలతో.. రాష్ట్రంలో ఒక్కసారిగా.. ప్రభుత్వానికి – ఉద్యోగులకు మధ్య వివాదం రాజుకుంది. నిజానికి ఈ ఏడాది మార్చిలో స్థానిక ఎన్నికల నిర్వహణ తెరమీదికి వచ్చినప్పుడు ఉద్యోగులు అందరూ కూడా.. జగన్‌కు బాసటగా నిలిచారు. ఎన్నికలు ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు అదే జగన్‌పై తిరుగుబాటు పంథా ఎంచుకున్నారు. ఇది ఒక్క జిల్లాకే పరిమితం కాలేదు. దీంతో అసలు క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోంది ? అనే విషయం చర్చకు వస్తోంది. గతంలో కూడా చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగుల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆకస్మిక తనిఖీలతో….
ఆయన చేసిన హెచ్చరికలు కావొచ్చు. ఆకస్మిక తనిఖీలు కావొచ్చు.. ఏవైనా కూడా.. ఉద్యోగులకు.. చంద్ర బాబుకు మధ్య గ్యాప్ పెంచాయి. ఇది అప్పటి ఎన్నికల్లో చంద్రబాబును అధికారానికి దూరం పెట్టింది. అయితే.. దీనివెనుక.. అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారని.. ఉద్యోగులను రెచ్చగొట్టి.. చంద్రబాబుపై కి ఉసి గొల్పారని.. పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఇక ఇప్పుడు కూడా ఇలాంటి వ్యూహం తెరచాటున జరుగుతోందా ? అనేది మేధావి వర్గం వేస్తున్న సంశయాత్మక ప్రశ్న.
రెచ్చగొట్టడం ద్వారా….
అంటే.. ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టడం ద్వారా.. ప్రతిపక్ష పార్టీలు.. తమ కసిని తీర్చుకుంటున్నాయా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా.. గతంలో చంద్రబాబు ఎలాంటి సమస్య ఎదుర్కొన్నారో.. ఇప్పుడు కూడా అదే సమస్యను వేరే రూట్‌లో ఎదుర్కొనాల్సిన పరిస్థితి జగన్ కు వచ్చిందని అంటున్నారు పరిశీలకులు. మరి దీనిని ఎలా పరిష్కరిస్తారో చూడాలి.