జగన్ అటు.. ఇటు.. ఎటు చూసినా?
ఏపీ సీఎం జగన్‌కు నీటి కష్టాలు ఇప్పట్లో తప్పేలా లేవని అంటున్నారు పరిశీలకులు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. పూర్తిగా సహకరిస్తామని.. చెప్పిన పొరుగు రాష్ట్ర సీఎం, [more]
;
ఏపీ సీఎం జగన్‌కు నీటి కష్టాలు ఇప్పట్లో తప్పేలా లేవని అంటున్నారు పరిశీలకులు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. పూర్తిగా సహకరిస్తామని.. చెప్పిన పొరుగు రాష్ట్ర సీఎం, [more]
ఏపీ సీఎం జగన్‌కు నీటి కష్టాలు ఇప్పట్లో తప్పేలా లేవని అంటున్నారు పరిశీలకులు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. పూర్తిగా సహకరిస్తామని.. చెప్పిన పొరుగు రాష్ట్ర సీఎం, జగన్‌కు బ్రదర్ అని రాజకీయ వర్గాల్లో పేరున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇటీవల కాలంలో ఎలాంటి వైఖరి తీసుకున్నారో.. అందరికీ తెలిసిందే. శ్రీశైలం నుంచి భారీ ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేయడం.. హూంకరింపులకు దిగడం.. అధికారులను అక్కడే కూర్చోబెట్టి భద్రతను కట్టుదిట్టడం చేయడం.. వంటివి అందరికీ తెలిసిందే.
తెలంగాతో కయ్యం….
దీంతో జగన్ ప్రభుత్వం దాదాపు రెండు వారాల పాటు ఇరుకున పడింది. కేంద్రానికి, కృష్ణా రివర్ బోర్డు మేనేజ్ మెంటుకు కూడా జగన్ ప్రభుత్వం లేఖలు సమర్పించింది. అయితే.. కేంద్రం కానీ, కృష్ణారివర్ బోర్డు కానీ.. ఈ విషయంలో పట్టించుకోలేదు. ఇంతలో వర్షాలు పడ్డాయి. వరదలు వచ్చాయి. దీంతో కేసీఆరే స్వయంగా విద్యుత్ ఉత్పత్తి ఆపి.. దూకుడు తగ్గించారని అంటున్నారు. కానీ, ఇప్పుడు మళ్లీ ప్రకాశం జిల్లా వెలిగొండ రూపంలో కేసీఆర్ దూకుడు చూపుతున్నారు. ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు.
భవిష్యత్ లో అన్నీ చికాకులే…..
శ్రీశైలం రిజర్వాయర్‌లో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. దీనిపై ఏపీ కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది. కేఆర్ఎంబీ విద్యుత్తు ఉత్పత్తిని నిలిపేయాలని ఆదేశించిదంొి. ఈ పరిణామాలతో ఏపీ ప్రభుత్వానికి కొంత ఊరట లభించినా భవిష్యత్ లో మాత్రం అనేక సమస్యలు ఎదురుకానునన్నాయి.. ఇలా తెలంగాణతోనే సతమతం అవుతున్న సీఎం జగన్‌కు మరో చిక్కు వచ్చి పడింది. మరో పొరుగు రాష్ట్రం.. కర్ణాటక ఇప్పుడు.. మరో బాంబు పేల్చింది. కృష్ణానదిపై ఎగువ రాష్ట్రమైన కర్ణాటకలో నిర్మించిన ఆల్మట్టి.. ప్రాజెక్టు ఎత్తును పెంచితీరుతామని.. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు.
కర్ణాటకతోనూ వైరం…
ఇప్పటికే ఆల్మెట్టి దెబ్బతో దిగువకు నీటి పరిమాణం తగ్గిపోతోంది. ఇక ఇప్పుడు మరింత ఎత్తుకు పెంచితే తెలంగాణకు వచ్చే సరికే నీటి పరిమాణం తగ్గిపోతుంది. ఇక ఏపీకి మరింత దెబ్బ అవుతుంది. కృష్ణా జలాల విషయంలో ఇప్పటికే.. తెలంగాణతో ఇబ్బందులు పడుతున్న జగన్.. కర్ణాటకను ఎలా లైన్‌లోకి తెచ్చుకుంటారో చూడాలి