ఒకే దెబ్బకు నలుగురా?
ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానుల అంశం వెనుక ఒకే దెబ్బకు నాలుగు పార్టీలకు జగన్ చెక్ పెట్టే సుదీర్ఘ రాజకీయ వ్యూహమే దాగివుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. [more]
ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానుల అంశం వెనుక ఒకే దెబ్బకు నాలుగు పార్టీలకు జగన్ చెక్ పెట్టే సుదీర్ఘ రాజకీయ వ్యూహమే దాగివుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. [more]
ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానుల అంశం వెనుక ఒకే దెబ్బకు నాలుగు పార్టీలకు జగన్ చెక్ పెట్టే సుదీర్ఘ రాజకీయ వ్యూహమే దాగివుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏపీ విభజన సమయంలో కాంగ్రెస్, బిజెపి లు ఒకే మాట ఒకే బాట గా సాగాయి. ఇక టిడిపి రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చి ముద్దాయిగానే ఈరోజుకు నిలిచింది. అయితే అప్పటికింకా పవన్ జనసేన సీన్ లోకి రానప్పటికీ విభజనపై స్పష్టమైన అంశాన్ని పవన్ ప్రకటించలేదు. ఒక్క వైసిపి మాత్రమే సమైక్య ఆంధ్రప్రదేశ్ కి నిలిచి తమకున్న తక్కువ బలంతోనే ఒకే వైఖరి తీసుకుని చివరివరకు నిలిచింది. కట్ చేస్తే ఏపీ పునర్విభజన జరిగిపోయింది ప్రత్యేక హోదా,పోలవరం అంశాలే ప్రధాన ఎజండాగా 2014 నుంచి 2019 వరకు రాజకీయాలు సాగాయి.
ఆ పార్టీలకు అందుకే …
ఇక్కడ కూడా కాంగ్రెస్, బిజెపి లను దోషులుగా పరిగణించారు ప్రజలు. టిడిపి ప్రత్యేక ప్యాకేజ్ నినాదం ఎత్తుకుని ఎన్నికల ముందు యు టర్న్ కొట్టి హోదా అనడం, వైసిపి మాత్రం హోదా కోసమే సింగిల్ ఎజెండాగా ఉద్యమించి ఎన్నికల్లో జనం మద్దతు సాధించింది. అయితే నాలుగేళ్ళు పవన్ టిడిపి తోనే వున్న కారణంగా ఆ పార్టీని సైతం జనం పక్కన పెట్టేశారు. ఈ నేపథ్యంలో విభజన రేపిన గాయాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన రాజధాని అనే అంశం అత్యంత కీలకం.
దీర్ఘకాల వ్యూహంతో…..
ఏపీ రాజధాని నిర్మాణం పూర్తి కానంతకాలం విభజన సమస్యలు చుట్టుముట్టినంతకాలం కాంగ్రెస్, బిజెపి, టిడిపి, జనసేన దోషులుగా నిలిచే ఉంటారన్నది వైసిపి దీర్ఘకాలిక వ్యూహం రచించిందని అందుకే త్రి క్యాపిటల్ తో ఈ నాలుగు పార్టీలను కార్నర్ చేసే ఛాన్స్ దక్కుతుందని విశ్లేషకుల అంచనా. దీనితో పాటు ఏపీ లోని అనేక కీలక అంశాలపై సమస్యలపై విపక్షాలు గళమెత్తే అవకాశం లేకుండా రాజధాని అంశం తోనే సరిపెట్టుకోవాలిసి వస్తుందన్న లెక్క అధికారపార్టీ తెలివిగా వేసిన ఎత్తుగడ అంటున్నారు. మరి ఈ లెక్కలు వైసిపి కి ఏ మేరకు ఫలితం ఇస్తాయో వేచి చూడాలి.