అందుకేనటగా హస్తినకు?
అయినను హస్తినకు పోయి వచ్చేద అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ బాట మరోసారి పట్టారు. ప్రధాని నుంచి వచ్చిన పిలుపుతో ఈ యాత్ర ఖరారు [more]
అయినను హస్తినకు పోయి వచ్చేద అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ బాట మరోసారి పట్టారు. ప్రధాని నుంచి వచ్చిన పిలుపుతో ఈ యాత్ర ఖరారు [more]
అయినను హస్తినకు పోయి వచ్చేద అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ బాట మరోసారి పట్టారు. ప్రధాని నుంచి వచ్చిన పిలుపుతో ఈ యాత్ర ఖరారు అయినట్లు ప్రచారం నడుస్తుంది. జగన్ ప్రధానిని కలిసి మూడు నెలలు అవుతుంది. హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కి గతంలో ట్రై చేసి సెట్ కాక వెనక్కి వచ్చిన జగన్ కు ఇప్పుడు వారి నుంచే పిలుపు రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ యాత్రను జగన్ తనకు అందిన ఈ ఆహ్వానం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటారని వైసిపి వర్గాల్లో టాక్.
గందరగోళం లో టిడిపి …
ఇప్పట్లో మండలి రద్దు కాదన్న ధీమాలో టిడిపి వుంది. కనీసం ఏడాదికి పైనే మండలి రద్దు కి సమయం పడుతుందని తెలుగుదేశం నాయకులు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చర్చ జరిపి మండలి రద్దుకు గ్రీన్ సిగ్నల్ తొందరగా ఇస్తే టిడిపి కి జరిగే డ్యామేజ్ అంతా ఇంతా కాదు. చంద్రబాబు తనయుడు లోకేష్ తో సహా యనమల రామకృష్ణుడు వంటివారంతా రాజకీయ నిరుద్యోగులుగా మారిపోనున్నారు. శాసనమండలి ద్వారా వస్తున్న జీతభత్యాలు తో రూపాయి ఖర్చు లేకుండా టిడిపి నేతలు రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. మండలి రద్దు అయితే వీరంతా ఇకపై చేసే రాజకీయాలకు సొంత డబ్బు లేదా పార్టీ డబ్బు వినియోగించక తప్పదు. ఇలా ఆర్ధికంగా కూడా టిడిపి పై మరింత భారం పెరగనుంది.
మీదే ఆలస్యం అంటారా …?
అందుకే ఏపీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో దారితీసిన పరిస్థితులను ప్రధాని ముందు పెట్టి మండలి రద్దు కి సహకరించాలని మోడీ ని అభ్యర్థిస్తారని తెలుస్తుంది. హోమ్ మంత్రి షా ముందు కూడా జగన్ ఈ అభ్యర్ధన పెట్టనున్నట్లు చెబుతున్నారు. అదేవిధంగా మూడు రాజధానులు అంశానికి సంబంధించి జగన్ బిజెపి అగ్రనేతలకు వివరిస్తారని అంటున్నారు. అలాగే ప్రత్యేక హోదా లేదా పరిశ్రమలకు పన్ను మినహాయింపులు కోరామని, పోలవరం ప్రాజెక్ట్ పనుల వేగాన్ని పెంచేందుకు నిధుల విడుదల వంటివి ఎపి సిఎం జగన్ పైకి ప్రకటించే అంశాలు అయినా అంతర్గతంగా మాత్రం మండలి రద్దు, మూడు రాజధానుల అంశాలపై మాత్రం ప్రధానంగా ప్రధాని, హోం మంత్రులతో చర్చ అనే విశ్లేషకులు తేల్చేస్తున్నారు. మరి జగన్ ఏం చేయనున్నారు మోడీ ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరం.