నాటి మంత్రులకు మూడినట్లేనా?

అధికారపార్టీ లో ఉండేవారు విపక్షం విఫలం అంటూ విమర్శలు ఆరోపణలు గుప్పిస్తూ వుంటారు. విపక్షం అధికారపక్షంలో అంతా అవినీతి అక్రమాలు యథేచ్ఛగా నడుస్తున్నాయని కోట్లాది రూపాయల ప్రజాధనం [more]

Update: 2020-02-22 03:30 GMT

అధికారపార్టీ లో ఉండేవారు విపక్షం విఫలం అంటూ విమర్శలు ఆరోపణలు గుప్పిస్తూ వుంటారు. విపక్షం అధికారపక్షంలో అంతా అవినీతి అక్రమాలు యథేచ్ఛగా నడుస్తున్నాయని కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అంటూ ప్రచారం నడుస్తుంది. కట్ చేస్తే విపక్షం అధికారం చేపట్టాక తాము గతంలో చేసిన ఆరోపణలను గాలికి వదిలి తమ పని తాము చేసుకుంటూ పోవడం ప్రజాస్వామ్యమం లో రొటీన్ గా కనిపించే చిత్రం.

9 నెలల పాలనలో…

అయితే ఈ పాత ట్రెండ్ కి జగన్ సర్కార్ చరమగీతం పాడేసినట్లే ప్రభుత్వ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. మాజీ మంత్రి టిడిపి సీనియర్ నేత తాజాగా విజిలెన్స్ విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జగన్ సర్కార్ రూట్ పై క్లారిటీ మొదలైంది. గత ప్రభుత్వంలో తప్పుడు పనులు చేస్తే తాము ఎలాంటి పరిస్థితుల్లో వదిలే ప్రశ్నే లేదన్నది గత 9 నెలల జగన్ సర్కార్ పాలనలో అడుగడుగునా వ్యక్తం అవుతుంది. అదే ఇప్పుడు టిడిపి అగ్ర నేతల్లో దడపుట్టిస్తుంది.

అచ్చెన్న తరహాలోనే …

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తరహాలోనే గత టిడిపి సర్కార్ లో పనిచేసిన వారిపై ఇప్పుడు మెడపై కత్తిని వేలాడదీస్తున్నారు జగన్. విజిలెన్స్, సిబిసిఐడి ల అస్త్రాలను బయటకు తీసి పాత సర్కార్ లో జరిగిన అన్ని పనులను తవ్వి కేసులు పెట్టేందుకు ప్రభుత్వం దూకుడుగా ముందుకు నడుస్తుంది. ఇందులో ఎన్ని సమస్యలు ఎదురైనా ఎదుర్కొనేందుకు జగన్ సిద్ధమైనట్లే కనిపిస్తుంది. గతమంతా అవినీతిమయం, మాది నిజాయితీ ప్రభుత్వం అని చాటిచెప్పేందుకు పనికొచ్చే అన్ని ప్రక్రియలను సర్కార్ మొదలు పెట్టేసింది.

కేసులు తప్పవా?

అచ్చెన్న ఈఎస్ఐ స్కామ్ లో ఇరుక్కున్న వైనం పరిశీలిస్తే త్వరలో వివిధ శాఖల్లో మంత్రులుగా ఉన్నవారిపై భవిష్యత్తులో కేసులు తప్పేలా లేవు. టిడిపి సర్కార్ లో ప్రతీ అంశం అవినీతితో నడిచిందని నమ్ముతున్న జగన్ ప్రభుత్వం కీలక కాంట్రాక్టుల అప్పగింతపై కన్నేసి వివిధ శాఖల్లో ఇప్పటికే దర్యాప్తుకి ఉపక్రమించింది. ఇందులో మంత్రులు సిఫార్సులు చేసివున్నా లేక నామినేషన్ పద్ధతి పై నిబంధనలు పక్కన పెట్టి ముందుకు వెళ్లినా ఆయా నేతలకు మూడినట్లే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రతి సంక్షోభాన్ని అవకాశం గా మలుచుకుంటాం అని ధీమాగా చెప్పే టిడిపి అధినేత చంద్రబాబు తాజాగా జగన్ సర్కార్ ఎక్కుపెట్టిన అస్త్రాలను ఎలా తిప్పికొట్టే వ్యూహాలు అనుసరిస్తారో వేచిచూడాలి.

Tags:    

Similar News