జై జగన్ అన్న బీజేపీ?
జగన్ కి ఏపీలో తప్ప బయట అంతా పల్లకీ మోతలాగా ఉంది. ఇపుడు ఆ జబితాలో మరో బీజేపీ సీఎం కూడా చేరిపోయారు. బీజేపీకి ప్రాణం లాంటి [more]
జగన్ కి ఏపీలో తప్ప బయట అంతా పల్లకీ మోతలాగా ఉంది. ఇపుడు ఆ జబితాలో మరో బీజేపీ సీఎం కూడా చేరిపోయారు. బీజేపీకి ప్రాణం లాంటి [more]
జగన్ కి ఏపీలో తప్ప బయట అంతా పల్లకీ మోతలాగా ఉంది. ఇపుడు ఆ జబితాలో మరో బీజేపీ సీఎం కూడా చేరిపోయారు. బీజేపీకి ప్రాణం లాంటి ఉత్తరభారతంలోని ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ జగన్ మూడు రాజధానులకు జై అంటున్నారు. తిప్పి తిప్పి కొడితే గట్టిగా డెబ్బై అసెంబ్లీ సీట్లు కూడా లేని అతి చిన్న ఉత్తరాఖండ్ మూడు రాజధానులు అనడం అంటే 175 అసెంబ్లీ సీట్లు కలిగిన ఏపీకి మూడు బాగానే కుదిరినట్లేనని భావించాలి. మూడు రాజధానులు కాన్సెప్ట్ బెస్ట్ అంటున్నారు బీజేపీ సీఎం. ప్రజల ఆకాంక్షలు తీరాలంటే ఇంతకంటే మించిన మార్గం లేదని కూడా గట్టిగానే చెబుతున్నారు.
అచ్చం ఏపీలాగే…
ఏపీలో మాదిరిగానే ఉత్తరాఖండ్ లో కూడా న్యాయ రాజధానిగా నైనిటాల్, పరిపాలనా రాజధానిగా డెహ్రాడూన్, సమ్మర్ క్యాపిటల్ గా గైరెన్స్ ప్రాంతాల్ని ఎంపిక చేశారు. అక్కడ అసెంబ్లీ భవనాలు కూడా పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారట. ప్రస్తుత రాజధాని డెహ్రాడూన్ కి గేర్సెన్ దాదాపుగా మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. దాంతో అక్కడి వారంతా తమకూ ప్రత్యేక రాజధాని కావాలనుకుంటున్నారు. దాంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారుట.
పక్కన అలాగే….
ఇప్పటికే మరో బీజేపీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కర్నాటకలో అధికార వికేంద్రీకరణను చేపట్టారు. దానికి సంబంధించి బిల్లుని కూడా అసెంబ్లీలో ఆమోదించుకున్నారు. ఉత్తర కర్ణాటకలో ప్రభుత్వ ఆఫీసులను పెద్ద ఎత్తున తరలిస్తున్నారు కూడా. ఇంకోవైపు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అయిదు రాజధానులు అంటున్నారు. వీటన్నింటికీ మించి పట్టణ అభివ్రుధ్ధి నిపుణులు కూడా వికేంద్రీకరణ మంత్రమే ఇపుడు ఆచరణ యోగ్యమని చెబుతున్నారు. భిన్నమైన ప్రాంతాలు, ప్రజల అవసరాలు ఉన్న భారత్ లో కేంద్రీకృత పాలనకు కాలం చెల్లిందని కూడా నిపుణులు సూచిస్తున్నారు.
జూన్ నాటికి….
ఇక ఏపీలో కూడా శరవేగంగా వికేంద్రీకరణ సాగుతోంది. ఇప్పటికే విశాఖను పాలనారాజధానిగా గుర్తించి అక్కడ అన్ని ఏర్పాట్లూ చేస్తున్న జగన్ సర్కార్ మెల్లగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తోంది. ఈ నేపధ్యంలో జూన్ నాటికి మొత్తం షిఫ్టింగ్ జరిగిపోవాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే జాతీయ స్థాయిలో బీజేపీ ముఖ్యమంత్రులేమో జగన్ అజెండాను నెత్తికెక్కించుకుంటే ఏపీ బీజేపీ నేతలు మాత్రం అమరావతికి జై అంటూ భారీ స్టేట్ మెంట్లు ఇవ్వడం కామెడీగా ఉందని అంటున్నారు.