బిగ్ టార్గెట్ కానీ?

ల‌క్ష్యం పెద్దదైన‌ప్పుడు దానిని సాధించేందుకు వేసుకునే మార్గాలు కూడా చాలా విశాలంగానే ఉండాల‌నేది వాస్తవం. చిన్న పామునైనా పెద్దక‌ర్రతో కొట్టాల‌నే సామెత రాజ‌కీయాల్లో బాగా ప‌నిచేస్తుంది. అంటే.. [more]

Update: 2019-10-14 02:00 GMT

ల‌క్ష్యం పెద్దదైన‌ప్పుడు దానిని సాధించేందుకు వేసుకునే మార్గాలు కూడా చాలా విశాలంగానే ఉండాల‌నేది వాస్తవం. చిన్న పామునైనా పెద్దక‌ర్రతో కొట్టాల‌నే సామెత రాజ‌కీయాల్లో బాగా ప‌నిచేస్తుంది. అంటే.. ల‌క్ష్యం చిన్నదైనా దానిని సాధించేందుకు మాత్రం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాల్సిన అవ‌స‌రం, ప్రత్యర్థులు విసిరే ప్రతి వ్యూహాల‌ను త‌ట్టుకుని ముందుకు సాగ‌డం అనేది రాజ‌కీయాల్లో చాలా చాలా ముఖ్యం.

చంద్రబాబు కూడా….

ఇక‌, ప్రస్తుత ప్రభుత్వం విష‌యానికి వ‌స్తే.. చాలా సుధీర్ఘ ల‌క్ష్యాన్నిఏర్పాటు చేసుకుని వైసీపీ అధినేత జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారు. త‌న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న రోజే ఆయ‌న నోటి నుంచి సుదీర్ఘ ల‌క్ష్యానికి సంబంధించిన వ్యాఖ్యలు వినిపించాయి. త‌న ప్రభుత్వం క‌నీసం 30 ఏళ్లపాటు ఉండేలా పాలిస్తాన‌ని, ప్రజ‌ల అభిమానం సాధిస్తాన‌ని ఆయ‌న ఆనాడు చెప్పుకొచ్చారు. వాస్తవానికి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా 1997లోనే విజ‌న్ 2020 అంటూ.. త‌న ప్రభుత్వాన్ని క‌నీసం 20 ఏళ్లపాటు న‌డిపించాల‌ని అనుకున్నారు. కానీ, త‌దుప‌రి ఎన్నిక‌ల్లో అంటే 2004లో వ‌చ్చిన ఎన్నిక‌ల్లో ఘోరాతి ఘోరంగా ఓట‌మిపాల‌య్యారు.

ప్రతికూలంగా మారి….

ప‌దేళ్ల త‌ర్వాత 2014లో ఏపీ సీఎం అయిన ఆయ‌న మ‌ళ్లీ అదే బాట ప‌ట్టారు. ఇక‌, ఇటీవ‌ల ఎన్నిక‌ల‌కు ముందు కూడా వ‌చ్చే 20 ఏళ్లపాటు త‌మ ప్రభుత్వమే ఉంటుంద‌ని, ఉండాల‌ని కూడా బాబు ఆశించారు. ఈ క్రమంలోనే ఆయ‌న విజ‌న్ 2040 అంటూ ప్రక‌ట‌న‌లు గుప్పించారు. అయితే, ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. ఇలా బాబు బోర్లా ప‌డ‌డానికి దీనికి కార‌ణాలు అనేకం ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ప‌రిస్థితిని ప‌రిశీలించ‌క‌పోవ‌డం, నాయ‌కుల మ‌ధ్య కొన‌సాగిన అనైక్యత‌ను స‌రిదిద్దే ప్రయ‌త్నాలు చేయ‌క‌పోవ‌డం, అవినీతికి పాల్పడుతున్నార‌ని తెలిసి కూడా వారిని మౌనంగా ఉపేక్షించ‌డం, క్షేత్రస్థాయిలో కేడ‌ర్‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం వంటివి చంద్రబాబుకు ప్రతికూలంగా మారాయి.

పథకాలనే నమ్ముకుని….

కేవ‌లం ప‌థ‌కాలు, డ‌బ్బుల పంపిణీ వంటివాటికి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజ‌లు ఎలాంటిమార్పులు కోరుకుంటున్నారో చంద్రబాబు ప‌ట్టించుకోలేదు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు జ‌గ‌న్ వ్యూహం 30 ఏళ్లు అధికారం అయిన‌ప్పుడు ఆయ‌న కూడా ప‌థ‌కాల‌నే ప‌ట్టుకుని వేలాడుతున్న ధోర‌ణి క‌నిపిస్తోంది. అధికారం చేతికి వ‌చ్చి నాలుగు మాసాలు గ‌డవ‌క‌ముందుగానే మ‌రో చింత‌మ‌నేని ప్రభాక‌ర్ అనేరేంజ్‌లో నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి వాళ్లు దూకుడుగా ముందుకు వెళుతున్నారు. అదే స‌మ‌యంలో మంత్రులు మౌనంగా ఉంటున్నారు.

క్షేత్రస్థాయిలో పరిస్థితులు….

ప్రజ‌ల్లో ప‌ర్యటిస్తున్న నేతా గ‌ణం ఎక్కడా క‌నిపించ‌డం లేదు. తాము ఎన్నిక‌ల్లో అంత ఖ‌ర్చు చేశాం.. ఇంత ఖ‌ర్చు చేశాం.. అంటూ. ఆ ఖ‌ర్చును రాబ‌ట్టుకునేందుకు వీరంతా ప్రయ‌త్నాలు చేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మ‌రోప‌క్క, ఇసుక వ్యవ‌హారం ప్రభుత్వానికి గుదిబండ‌గా మారిపోయింది. మ‌రి ఇలాంటి ప‌రిస్థితిలో వ్యూహం ఛేదించేందుకు జ‌గ‌న్ మ‌రింత క‌ష్టప‌డ‌డంతోపాటు.. కింది స్థాయిలో ప‌రిస్థితిని చ‌క్కదిద్దాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌నేది మేధావుల మాట‌.

Tags:    

Similar News