ఫుల్లు ఫాలోయింగ్ ఉన్నట్లుందే

ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లుంది ఎపి, తెలంగాణాలో ఆర్టీసీపై ప్రభుత్వాల నిర్ణయాలు. ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులు ఏ మేరకు [more]

Update: 2019-10-14 12:30 GMT

ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లుంది ఎపి, తెలంగాణాలో ఆర్టీసీపై ప్రభుత్వాల నిర్ణయాలు. ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులు ఏ మేరకు జై అంటున్నారో లేదో కానీ పక్క రాష్ట్రంలో జైహో జగన్ అంటున్నారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్దికాలంలోనే వైఎస్ జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ముందుగా క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి విలీన ప్రక్రియపై చిక్కులను అధ్యయనం చేయించారు జగన్. ఆ తరువాత దీనిపై ఒక్కోఅడుగు ముందుకు వేస్తున్నారు ఆయన. దీనికి ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశారు జగన్. ఇచ్చిన మాటకు కట్టుబడి తన హామీని అమల్లో పెట్టేందుకు సాహసోపేత ప్రయత్నం సాకారం చేసేందుకు నడుం కట్టారు.

జగన్ పాటీ చేయరా మీరు …?

రెండు తెలుగు రాష్ట్రాలు కావడంతో ఏ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా రెండు చోట్లా చర్చకు దారితీస్తుంది. ఆర్టీసీ విలీన అంశం అంతే. జగన్ సర్కార్ విలీనం చేస్తుంటే మీరెందుకు చేయరు అన్నది కెసిఆర్ సర్కార్ పై తీవ్రంగా వస్తున్న వత్తిడి. ఇదే మాటను ప్రతీ చోటా కార్మికులు నిలదీస్తున్నారు. సంపన్న రాష్ట్రం గా చెప్పుకుంటున్న తెలంగాణ లో ఆర్టీసీ విలీనం ఎవరు అడ్డుకుంటున్నారు అని కార్మిక సంఘాలు ఘోషిస్తున్నాయి.

తెలంగాణాలో ఎక్కువ…….

అటు సోషల్ మీడియా నుంచి ప్రధాన మీడియా వరకు ఎపి లో జగన్ సర్కార్ అమలు చేయగా లేనిది ఇక్కడ ఏమి తక్కువైంది అన్న ప్రశ్న కు టి సర్కార్ దగ్గర జవాబు లేకుండా పోయింది. దీనికి సవాలక్ష కారణాలను గులాబీ బాస్ చెబుతున్నా కార్మికులు పట్టించుకోవడం లేదు. చివరికి మంత్రులు సైతం ఆర్టీసీ విలీనం ఎన్నికల హామీలో లేదంటూ చెప్పుకోవాలిసి వస్తుంది. మొత్తానికి ఎపి లో కన్నా జగన్ కి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడటం విశేషం.

Tags:    

Similar News