మరీ ఎందుకలా తీసిపారేస్తున్నారో ?
ఏ ముఖ్యమంత్రికి ఇంతటి అవమానాలు జరగలేదు. ముఖ్యమంత్రి సీట్లో ఎవరు కూర్చున్న కనీస గౌరవం ఇవ్వడం బాద్యతగా, మర్యాదగా అప్పట్లో భావించేవారు. ఒక్క జగన్ విషయంలో మాత్రం [more]
ఏ ముఖ్యమంత్రికి ఇంతటి అవమానాలు జరగలేదు. ముఖ్యమంత్రి సీట్లో ఎవరు కూర్చున్న కనీస గౌరవం ఇవ్వడం బాద్యతగా, మర్యాదగా అప్పట్లో భావించేవారు. ఒక్క జగన్ విషయంలో మాత్రం [more]
ఏ ముఖ్యమంత్రికి ఇంతటి అవమానాలు జరగలేదు. ముఖ్యమంత్రి సీట్లో ఎవరు కూర్చున్న కనీస గౌరవం ఇవ్వడం బాద్యతగా, మర్యాదగా అప్పట్లో భావించేవారు. ఒక్క జగన్ విషయంలో మాత్రం కచ్చితంగా తేడా కనిపిస్తోంది. జగన్ ని ముఖ్యమంత్రిగా కనీసంగా కూడా ఆలోచించలేని సహించలేని గ్యాంగ్ ఏపీ రాజకీయాల్లో ఉంది. సరే ప్రజాస్వామ్యంలో ఎపుడూ విజయాలే దక్కవు, ఓటమి కూడా ఉంటుంది. మరి దాన్ని హుందాగా రిసీవ్ చేసుకుంటేనే గెలుపు పిలుపు వినిపిస్తుంది. కానీ ఏపీ రాజకీయాల్లో ఆ ధోరణి అసలులేదు. రాజకీయాలు వేరు. ముఖ్యమంత్రిగా జగన్ రెస్పెక్ట్ చేయాలన్నది కూడా లేకపోయింది. ఎంతవరకూ వచ్చిందంటే సీఎం వ్యక్తిగత విషయాలు కూడా నిర్భయంగా విమర్శలు చేస్తున్నారు. దాంతో అసలు జగన్ సీఎంగా ఉన్నారా లేక విపక్షంలోనే ఉన్నారా అన్న డౌట్లు వస్తున్నాయిట క్యాడర్ కి.
కామ్ గానే ఉంటూ….
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డనే రమేష్ కుమార్ నే తీసుకుంటే కామ్ గా ఉంటూనే ఒక్కసారి రివర్స్ అయ్యారు. జగన్ ని సీఎంగా గుర్తించను అన్నట్లుగా ఆయన స్థానిక ఎన్నికలను హఠాత్తుగా వాయిదా వేశారు. ఆ తరువాత తనకు భద్రత లేదంటూ ఏకంగా ఏపీ సర్కార్ మీద బురద జల్లేస్తూ లేఖ రాశారు. జగన్ కుర్చీ కిందకే నీళ్ళు తెచ్చేలా సాగుతున్న కుట్రలో నిమ్మగడ్డ భాగం అయ్యారా. అయితే అధికారిగా ఉండాల్సిన ఆయనకు ఇంత ధైర్యం ఎక్కడిది అన్న డౌట్లు రాక తప్పదు.
నేతల ఘాటు విమర్శలు…..
ఇక జగన్ సీబీఐ కోర్టు వ్యవహారాలు పదేళ్ళుగా అందరికీ తెలిసినదే. కానీ ప్రతీ శుక్రవారం క్రమం తప్పకుండా ఎల్లో మీడియా దానినే రాయడం ఓ శాడిజంగానే చూడాలి. తెల్లారిలేస్తే ఎన్నో కేసులు కోర్టుల్లో జరుగుతాయి. కానీ జగన్ కేసునే కోరి మరీ రాసి ఎల్లో మీడియా ఆత్మానందం పొందుతుంది. ఇక శుక్రవారం రాగానే లోకేష్ నుంచి బుద్దా వెంకన్న వరకూ అందరూ జగన్ కోర్టు ఎగ్గొట్టాడంటూ సెటైర్లు వేస్తారు. మరి ఈ వికృత ఆనందం ఎందుకో అర్ధం కాదు. జగన్ కోర్టుకు వెళ్తే మహదానందం, వెళ్ళకపోతే బ్రహ్మానందం, పైగా జగన్ కూతుళ్ళ మీద ఆయన కుటుంబం మీద కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తూంటే జగన్ సీఎం గా ఉన్నారా అన్న డౌట్లు కార్యకర్తల్లో వస్తున్నాయిట.
వండి వార్చుతూ……
ఇక అయిన దానికి కానిదానికీ ముడి వేస్తూ వండి వారుస్తున్న కధనాలతో ఎల్లో మీడియా విర్రవీగి రాతలు రాస్తూంటే, డిబేట్లు పెడుతూ ఉంటే కరడు కట్టిన జగన్ ఫ్యాన్స్ అసలు తట్టుకోలేకపోతున్నారుట. ఈ ఎల్లో మీడియా ఆఫీసుల ప్రధాన కేంద్రాలు హైదరాబాద్ లో ఉన్నాయి. అక్కడ కేసీయార్ మీద ఒక్క రాత కూడా రాయవు, రాయలేవు. మరి కేసీయార్ వారిని ఎంతలా కంట్రోల్ చేశారో, జగన్ ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారు అంటూ అభిమానులు అడుగుతున్న ప్రశ్నలకు వైసీపీ పెద్దలు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఏది ఏమైనా జగన్ ని ఏమైనా అనేయవచ్చు, ఏ బురద అయినా జల్లేయవచ్చు ఇలా తయారైంది ఏపీలో పొలిటికల్ సీన్. టీడీపీ సరే సరి, కానీ ఏ ఒక్క పార్టీ కూడా జగన్ మీద సానుకూలంగా మాట్లాడదు, అంత తప్పు జగన్ ఏం చేశారో. ఆయన అంటే అక్కసు. అసూయ కాకాపోతే ఏంటిది అని అభిమానులు బాధపడుతున్నారుట. మరి తనను ఏమన్నా సహించే గుణం జగన్ లో ఉందేమో, కానీ ప్రాణమిచ్చే ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారుట. ఇకనైనా జగన్ ఏం చేస్తారో, ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.