ఎవరి సొమ్ము..? ఎవరి ఖాతాల్లో? ఇదెక్కడి చోద్యం?

కరోనా వైరస్ కట్టడికి కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ దెబ్బకు కోట్లాది జీవితాలు రోడ్డున పడి అల్లాడుతున్నాయి. వీరిలో కేవలం పేదలే కాదు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి [more]

Update: 2020-04-05 11:00 GMT

కరోనా వైరస్ కట్టడికి కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ దెబ్బకు కోట్లాది జీవితాలు రోడ్డున పడి అల్లాడుతున్నాయి. వీరిలో కేవలం పేదలే కాదు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలు కూడా అత్యధికమే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక దుస్థితిలో ఉన్నా దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా ఒక అడుగు ముందుకు వేసి వెయ్యిరూపాయలు చొప్పున కుటుంబానికి ఇచ్చేందుకు నిర్ణయించింది. నిత్యావసర వస్తువులతోపాటు ఆంధ్రప్రదేశ్ లో వున్న ఒక కోటి ముప్పైలక్షల మందికి వెయ్యి రూపాయల చొప్పున ఇచ్చేందుకు 13 వందల రూపాయలు విడుదల కూడా చేసేసింది. జగన్ సర్కార్ ముందస్తు చొరవతో తీసుకున్న ఈ నిర్ణయం పలు రాష్ట్రాలు అనుసరించాయి ఆ తరువాత. అయితే ఆయా రాష్ట్రాల ఆర్థికపరిస్థితి ని బట్టి సంక్షేమ నిర్ణయాలు మొదలు అయ్యాయి. దీనితో కేంద్ర ప్రభుత్వం కొన్ని వర్గాలకు నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసే ప్రక్రియ ఆరంభించింది.

సొమ్ము వారిచ్చిందే అంటున్నారు …

కానీ ఇప్పుడు వైసిపి సర్కార్ మొదలు పెట్టిన కుటుంబానికి వెయ్యి రూపాయలు కేంద్రం ఇచ్చినదే అనే ప్రచారం రాజకీయ ప్రకంపనలు మొదలు పెట్టిస్తుంది. కొందరు నేతలు ఇదంతా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిందే అని చేస్తున్న ప్రచారాన్ని వైసిపి నేతలు సైతం నేరుగా ఖండించలేకపోతున్నారు. కొన్ని చోట్ల మాత్రం జగన్ సర్కార్ నే ఈ డబ్బు పంపిణీ చేస్తుందని వైసిపి ప్రచారం చేసుకుంటుంది. నిజానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నగదు వారి ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది. జగన్ సర్కార్ నగదును నేరుగా లబ్దిదారుల చేతికి అందిస్తుంది.

క్రెడిట్ తమదేనంటూ…

ఒక పక్క రాష్ట్రాలకు కరోనా సాయంపై ఇప్పటికి మాటలే తప్ప స్పష్టమైన ప్యాకేజీ కేంద్రం ప్రకటించలేదన్నది విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇచ్చేది ఇవ్వకపోగా ఎపి సర్కార్ లేదా తెలంగాణ సర్కార్ లు ప్రకటించిన నగదు సాయాన్ని తమఖాతాలో వేసుకోవాలనుకోవటం రాజకీయ ఎత్తుగడలు విమర్శలకు తెరతీస్తోంది. ఏపీకి కి కేంద్రం ఈ కష్టకాలం లో ఉదారంగా చేయాలిసిన సాయం చేయాలని మాటలు కాదని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి సమయాల్లోనూ క్రెడిట్ తమదే అంటూ చెప్పుకోవడం వల్ల ఎవరికి ప్రయోజనం లేదంటున్నారు వారు. ఇప్పటికైనా విపక్షాలు తమ రాజకీయాలను కరోనా సమయంలో వాడటం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News