గ్రౌండ్ లో జగన్ టీం….స్పీడ్ బాగా పెంచారు

సంక్షోభ సమయంలో లీడర్స్ ప్రజలకు ధైర్యం చెప్పాలి. క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేయాలి. అండగా మేము ఉంటాం అంటూ భరోసా కల్పించాలి. వెళ్ళండి మీ నియోజకవర్గాలకు అంటూ [more]

Update: 2020-04-08 11:00 GMT

సంక్షోభ సమయంలో లీడర్స్ ప్రజలకు ధైర్యం చెప్పాలి. క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేయాలి. అండగా మేము ఉంటాం అంటూ భరోసా కల్పించాలి. వెళ్ళండి మీ నియోజకవర్గాలకు అంటూ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించడంతో మంత్రులనుంచి ఎమ్యెల్యేల వరకు నియోజకవర్గాల్లో పనిలోకి దిగడం ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది. ప్రాణాంతకమైన వైరస్ పై ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావడంతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేయాలిసిన బాధ్యత ఉంది. ఇప్పటికే చాలామంది ఎమ్యెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో పర్యవేక్షణ లో వేగం పెంచారు.

మంత్రులు ప్రజల్లోనే ఉంటూ….

జగన్ ఆదేశాలతో ఏపీ లో మంత్రులు స్వయంగా సీన్ లోకి దిగిపోయారు. సామాజిక దూరం పాటిస్తూ ఆదర్శంగా కొందరు నిలుస్తున్నారు. ఇందులో పేర్ని నాని స్పీడ్ గా ఉన్నారు. నేరుగా ఆయన తన ప్రోటోకాల్ ను సైతం పక్కన పెట్టి స్కూటర్ పై తిరుగుతూ పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తూ ఆదేశాలు జారీ చేస్తూ అందరి మన్ననలను అందుకుంటున్నారు. మరికొందరు మంత్రులు తమ తమ జిల్లాల్లో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నారు. కర్నూల్ లో ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, విజయనగరం లో బొత్స సత్యనారాయణ, శ్రీకాకుళం లో ధర్మాన కృష్ణ దాస్, తూర్పు గోదావరి జిల్లాలో కురసాల కన్నబాబు, కాపు కార్పొరేషన్ చైర్మన్ రాజానగరం ఎమ్యెల్యే జక్కంపూడి రాజా ప్రజల్లో ఉంటూ ధైర్యం చెబుతున్నారు.

అవంతిపై కేసు … విముక్తి చెందిన అనిల్ కుమార్ …

ఇదిలా ఉంటే మంత్రి అవంతి శ్రీనివాస్ తన పర్యటనల్లో సామాజిక దూరం పాటించడం లేదంటూ హై కోర్ట్ లో ఒకరు పిల్ దాఖలు చేయడం చర్చనీయం అయ్యింది. ఆ మధ్య మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒక ఆసుపత్రి ని ప్రారంభించారు. ఈ ఆసుపత్రి అధినేత అయిన వైద్యుడు కి ఆ తరువాత కరోనా పాజిటివ్ వచ్చింది. డాక్టర్ విదేశాలనుంచి రావడంతో ఇది సోకినట్లు తేలింది. దాంతో మంత్రి అనిల్ యాదవ్ కి పరీక్షలు నిర్వహించారు. ఆ టెస్ట్ లలో ఆయనకు నెగిటివ్ రావడంతో వైసిపి వర్గాలు ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News