పంతం నెగ్గించుకోవాలనే… కోర్టుకైనా వెళ్లి?

ఆంధ్రప్రదేశ్ లో విద్యా విధానం సమూలంగా మార్చాలన్న లక్ష్యం తో వెళుతున్న జగన్ సర్కార్ కి హై కోర్ట్ బ్రేక్ లు వేసింది. అన్ని పాఠశాలల్లో నిర్బంధంగా [more]

Update: 2020-04-22 08:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో విద్యా విధానం సమూలంగా మార్చాలన్న లక్ష్యం తో వెళుతున్న జగన్ సర్కార్ కి హై కోర్ట్ బ్రేక్ లు వేసింది. అన్ని పాఠశాలల్లో నిర్బంధంగా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని కొందరు సవాల్ చేయడం అలా చేయడం సరి కాదని కోర్టు తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. ఇప్పటికే ఈ అంశం చట్టం కాకుండా శాసన మండలిలో టిడిపి అడ్డుకుంది. అయినా కానీ మరోదారిలో వెళ్దామనుకున్న సర్కార్ కి హై కోర్ట్ రూపంలో అవరోధం ఎదురైంది.

ప్రజాభిప్రాయ సేకరణతో ..

హై కోర్ట్ తీర్పును సుప్రీం కోర్టు లో స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా సవాల్ చేయడానికి జగన్ సర్కార్ డిసైడ్ అయిపొయింది. సుప్రీం లో తమ నిర్ణయానికి తిరుగు లేకుండా చేసుకునేందుకు ప్రజాభిప్రాయ సేకరణ కు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలాఖరులోగా గ్రామ వాలంటీర్ల ద్వారా జనం నుంచే ఏ మీడియం ఉండాలనే దానిపై సర్వే చేసి ఆ నివేదిక సుప్రీం కి సమర్పించాలని భావిస్తుంది . ఎక్కడైనా తెలుగు మీడియం కావాలని అనుకుంటే అక్కడ ఇంగ్లిష్ మీడియం కి బదులు తెలుగు మాధ్యమం స్కూల్స్ కొనసాగుతాయి. దాంతో ఇకపై ఈ వ్యవహారం పై ఆచితూచి అడుగులు వేయనుంది సర్కార్.

ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం …

దేశంలో అనేక రాష్ట్రాల్లో ఆంగ్ల మాధ్యమం స్కూల్స్ గా ఆయా రాష్ట్రప్రభుత్వాలు మార్పు చేశాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది 15 వేల స్కూల్స్ హిందీ మాధ్యమం నుంచి ఇంగ్లిష్ లోకి మారిపోయాయి. యుపి తో బాటు పలు రాష్ట్రాలు ఇంగ్లిష్ మీడియం పై అనుసరిస్తున్న విధానాన్ని అధికారులతో జగన్ సర్కార్ అధ్యయనం చేయించనుంది. కరోనా యుద్ధం లో కూడా ఎపి లో ఇంగ్లిష్ మీడియం పై జగన్ ప్రభుత్వం తన పంతం ఎలాగైనా నెగ్గించుకోవాలనే ముందుకు వెళ్లడంపై రానున్న విమర్శలు వేచి చూడాలి.

Tags:    

Similar News