ఎవరి మార్గం వారిదే…డీల్ చేయడంలోనే?

కరోనా వైరస్ తో దీర్ఘ కాలం కాపురం చేయక తప్పదా అంటే నిపుణులు అదే నిజం అని చెబుతున్నారు. ఇప్పుడు ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా [more]

Update: 2020-04-28 06:30 GMT

కరోనా వైరస్ తో దీర్ఘ కాలం కాపురం చేయక తప్పదా అంటే నిపుణులు అదే నిజం అని చెబుతున్నారు. ఇప్పుడు ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా అదే విషయాన్నీ కుండబద్ధలు కొట్టేశారు. వైరస్ పై ప్రజల్లో భయాందోళనలు తొలగించేందుకు సిఎం జగన్ మొదటి నుంచి దీన్ని తేలిగ్గా తీసిపారేస్తూ వస్తున్నారు. మందులేని వైరస్ కి పారాసిటమాల్ తప్ప మరేమి లేదని చేసిన వ్యాఖ్యలు గతంలో పెద్ద దుమారమే రేపింది. తాజాగా జగన్ మరోసారి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమే కానున్నాయి. కోవిడ్ జ్వరం లాంటిదే నని వస్తుంది పోతుంది. దీనికోసం ఆందోళన అనవసరం అని చెప్పి మహమ్మారిని తేలిక చేసి పారేశారు.

టి సిఎం అలా … ఎపి సిఎం ఇలా…

కరోనాపై పోరాటం మొదలు పెట్టిన నాటినుంచి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భిన్నమైన వ్యూహాలు అనుసరిస్తున్నారు. తెలంగాణ సిఎం ప్రజలను ఇళ్లనుంచి రావడానికే భయపడేలా తన మాటల మాయాజాలంతో కట్టిపడేశారు. అదే జగన్ క్షేత్ర స్థాయిలో గట్టిగానే చర్యలు చేపడుతున్నా ఈ వ్యవహారాన్ని తేలిగ్గానే డీల్ చేస్తూ రావడం చర్చనీయాంశం అయ్యింది. ఇది ఇలా ఉంటే పాజిటివ్ కేసుల నమోదు తెలంగాణ లో బాగా తగ్గుముఖం పట్టడంతో కేసీఆర్ తీరే సరైంది కదా అనే వారు ఎక్కువ అయ్యారు. కానీ ఎపి లో పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరుగుతున్నాయి. దీనితో జగన్ సర్కార్ పై విపక్షాలు గట్టిగా విమర్శలు చేసే వీలు చిక్కింది.

రీజన్ అదేనా …?

కరోనా కట్టడిలో ఏపీ విఫలం అయ్యిందా అంటే కాదనే అంటున్నారు నిపుణులు. దేశంలోనే ఎపి టెస్టింగ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉందని గుర్తు చేస్తున్నారు. టెస్ట్ లు ఎక్కువైతే కేసుల సంఖ్య సహజంగానే పెరుగుతాయని ఇవి ముందే బయట పడటం సమాజానికి మంచే జరుగుతుందని అంటున్నారు. టెస్టింగ్ లలో ప్రతి పదిలక్షల మందికి దేశంలో నాలుగు వందల పైబడి యావరేజ్ ఉంటే ఏపీ లో ఈ సంఖ్య మూడు రేట్లు అధికం గా ఉంది. సుమారుగా 13 వందలమందికి పైగా టెస్ట్ లను సర్కార్ చేయిస్తుంది. ఈ అంశంలో తెలంగాణ కూడా వెనుకబడే వుంది. తాజాగా తెలంగాణ లో 139 మందికి టెస్ట్ చేస్తే ఇద్దరికే పాజిటివ్ గా తేల్చింది. అమెరికా ఇతర యూరప్ దేశాల్లో గమనిస్తే ఆ దేశాల్లో లక్షల్లో పరీక్షలు జరపడం వల్లే కేసుల సంఖ్య అధికమైంది. పరీక్షలు పెద్ద సంఖ్యలో చేయకుండా కేసులు తక్కువ చేసి చూపితే ఎదో రోజు బ్లాస్ట్ జరిగే ప్రమాదమే ఉంది. ఒక్కో రాష్ట్రం ఒక్కో విధానం వైరస్ కట్టడికి తీసుకోవడం కాకుండా కేంద్రం ఒకే విధానం అనుసరిస్తే సమస్యలు చాలా వరకు తీరే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News