జగన్ బాబు మిగతా వారిపై ఏది ఆ కరుణ …?
ఏపీ సర్కార్ గుజరాత్ లో చిక్కుకున్న ఐదువేలమందికి పైబడిన మత్సకారులకు స్వగ్రామ ప్రాప్తి కల్పించింది. నిరుపేదలు అయిన వీరిని తరలించేందుకు దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చును [more]
ఏపీ సర్కార్ గుజరాత్ లో చిక్కుకున్న ఐదువేలమందికి పైబడిన మత్సకారులకు స్వగ్రామ ప్రాప్తి కల్పించింది. నిరుపేదలు అయిన వీరిని తరలించేందుకు దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చును [more]
ఏపీ సర్కార్ గుజరాత్ లో చిక్కుకున్న ఐదువేలమందికి పైబడిన మత్సకారులకు స్వగ్రామ ప్రాప్తి కల్పించింది. నిరుపేదలు అయిన వీరిని తరలించేందుకు దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చును సైతం పెట్టేందుకు వెనుకాడలేదు. దీనికోసం గుజరాత్ ముఖ్యమంత్రి ని ఒప్పించగలిగారు ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ చర్యలు పట్ల అన్ని వర్గాలనుంచి హర్షం వ్యక్తం అయ్యింది. ఇక్కడివరకు బాగానే ఉంది. ఇప్పుడు సొంత రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న వారు ఇప్పుడు నుంచి ప్రభుత్వంపై వత్తిడి ఒక్కసారిగా పెరిగింది.
జిల్లా ఎస్పీలు, డిజిపి పర్మిషన్ లపై …
లాక్ డౌన్ సమయంలో వివిధ జిల్లాల్లో ఉన్నవారు తమ సొంత ఊర్లకు వెళ్ళాలి అంటే జిల్లా ఎస్పీలకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ విజ్ఞాపనలు పరిశీలించి ఎస్పీలు అత్యవసర కేసుల్లో అనుమతి మంజూరు చేస్తారు. అలాగే వివిధ రాష్ట్రాలకు అత్యవసరంగా వెళ్ళాలి అంటే రాష్ట్ర డిజిపికి ఈ పాస్ కోసం అనుమతి కోరాలి. ఇది కూడా అత్యవసరం అని దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే. ఈ విధానం బాగానే ఉన్నా లాక్ డౌన్ మొదలై నెలరోజులు దాటినందున వివిధ రాష్ట్రాల నుంచి సొంత రాష్ట్రానికి అత్యవసర కేసుల్లో అనుమతులు వేలమంది మత్స్యకారులను తరలించడం, విదేశాల్లో ఉన్న భారతీయులను రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సన్నాహాలు నేపథ్యంలో జిల్లాల నడుమ కొన్ని ఆంక్షలు తొలగించాలని అంతా కోరుతున్నారు.
టెస్ట్ లు చేసి పంపించండి …
పోలీసులు ఈ పాస్ ల విధానం లో అనుమతులు చాలా తక్కువమందికే లభిస్తున్నాయి. దాంతో తమను టెస్ట్ లు చేసి సొంత ఊళ్లకు పంపేలా నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రిని లాక్ డౌన్ బాధితులు కోరుకుంటున్నారు. నెల రోజులకు పైబడి బంధువుల ఇళ్లల్లో, లాడ్జీలలో, స్నేహితుల ఇళ్లల్లో ఇలా అనేక చోట్లా చిక్కుకుపోయారు ప్రజలు. మోడీ ఎలాంటి సమయం ఇవ్వకుండా ఆకస్మిక లాక్ డౌన్ ప్రకటించడంతో అయినవాళ్లకు దూరంగా చేతిలో చిల్లి గవ్వ లేకుండా గడుపుతున్నామని అంతా వాపోతున్నారు. అప్పో సొప్పో చేసి సొంత ఖర్చులతో తమ గ్రామాలకు వెళ్లేందుకు అనుమతులను వీరు అభ్యర్థిస్తున్నారు.
లాభమేగా?
దీనివల్ల క్యాబ్ లు ఇతర వాహనాలు నడిపేవారికి పని లభిస్తుందని, సొంత వాహనాల్లో వెళ్లేవారికి అయితే డీజీల్, పెట్రోల్ ద్వారా వచ్చే ఆదాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ కష్టకాలంలో లభిస్తుందని బాధితులు సూచిస్తున్నారు. అవసరం సొంత ఊళ్లకు వెళ్లేవారు వాహనాల్లో ఎంత మంది ఉండాలి ? ఎలా వెళ్ళాలి అనే అంశంపై నిబంధనలు రూపొందించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నారు లాక్ డౌన్ బాధితులు. మత్సకారులకు ఇచ్చిన అవకాశం సొంత ఖర్చులతో వెళ్లేవారికి ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు వీరు. మరి ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.