సౌండ్ లేకుండా తాళం వేసిన జగన్

దేశ చరిత్రలో ఎన్నడు లేని విధంగా జగన్ తీసుకున్న నిర్ణయం సంచలనమే అయ్యింది. విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతి చెందిన వారికి కోటి రూపాయలు ప్రకటించడం [more]

Update: 2020-05-08 03:30 GMT

దేశ చరిత్రలో ఎన్నడు లేని విధంగా జగన్ తీసుకున్న నిర్ణయం సంచలనమే అయ్యింది. విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతి చెందిన వారికి కోటి రూపాయలు ప్రకటించడం అంటే చిన్న విషయం కాదు. కానీ జరిగిన సంఘటన హృదయ విదారకంగా ఉండటంతో ముఖ్యమంత్రి జగన్ చలించిపోయారు. భావోద్వేగంతో మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ప్రకటించేశారు. ఇక చికిత్స పొందుతున్న బాధితుల విషయంలో కూడా మానవత్వంతోనే స్పందించారు. జగన్ ఇలా చేస్తారని విపక్షం కూడా అంచనా వేయలేకపోయింది. దాంతో అందరి నోళ్ళు మూత పడ్డాయి.

పరిహారంపై పరిహాసం లేదు …

అసాధారణ సంఘటనల్లో నష్టపరిహారం అంశం ఎప్పుడు రాజకీయ దుమారమే రేపుతూ రావడం దేశంలోనే రివాజు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా విపక్షం నానా రచ్చా చేసేస్తాయి. అధికారంలో ఉన్నవారు చెప్పే పరిహారం కి నాలుగు ఐదు రెట్లు ప్రకటించాలన్న డిమాండ్ రొటీన్ గా వినిపించేది. దాని కోసం అవసరమైతే ఆందోళనలు కూడా మొదలు అయిపోయేవి. అయితే ఇలాంటి వాటి అన్నిటికి తొలిసారి చెక్ పెట్టిన ముఖ్యమంత్రి జగన్ అయ్యారు.

పరిహారంతో కొలవలేం…..

వాస్తవానికి ఒక వ్యక్తి మరణాన్ని ఎంతటి పరిహారం ఇచ్చినా కొలవలేం. కానీ ఇలాంటి సంఘటనల్లో అధికారంలో ఉన్న వారు కంటితుడుపు చర్యలే ప్రకటిస్తాయి. నిబంధనల మేరకు ఇంతే వస్తుందంటాయి. వీలైతే సంబంధిత పరిశ్రమ నుంచి ముక్కు పిండి వసూలు చేయడానికి చూస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ భిన్నంగా స్పందించారు. దేశంలోనే ఒక కొత్త పంథాను సృష్ట్టించారు. అది ఏ స్థాయిలో అంటే విమర్శించే వారి నోటికి పూర్తిగా తాళం పడేలా.

Tags:    

Similar News