కేబినెట్ నుంచి ఫస్ట్ వికెట్ ఆయనేనటగా?
రాష్ట్రంలో జగన్ సర్కారు ఏర్పడి ఏడాది పూర్తయింది. ఈ క్రమంలో ప్రభుత్వం తన రేటింగ్‌ను సరిచూసుకునే పని ప్రారంభించారు సీఎం జగన్. గతంలో చంద్రబాబు మాదిరిగా హడావుడి [more]
రాష్ట్రంలో జగన్ సర్కారు ఏర్పడి ఏడాది పూర్తయింది. ఈ క్రమంలో ప్రభుత్వం తన రేటింగ్‌ను సరిచూసుకునే పని ప్రారంభించారు సీఎం జగన్. గతంలో చంద్రబాబు మాదిరిగా హడావుడి [more]
రాష్ట్రంలో జగన్ సర్కారు ఏర్పడి ఏడాది పూర్తయింది. ఈ క్రమంలో ప్రభుత్వం తన రేటింగ్‌ను సరిచూసుకునే పని ప్రారంభించారు సీఎం జగన్. గతంలో చంద్రబాబు మాదిరిగా హడావుడి చేయకుండా.. అంతర్గతంగానే జగన్ తన పనితీరును, మంత్రుల పనితీరును బేరీజు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన మంత్రివర్గంలోని మంత్రుల్లో టాప్ టెన్ మంత్రుల జాబితాను సిద్ధం చేసుకున్నారు. ఇటు పాలన పరంగా.. అటు వారి వ్యవహార శైలి పరంగా.. అధికారులతో చేస్తున్న సమీక్షలను సైతం పరిగణనలోకి తీసుకున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో పార్టీని, పాలనను ఏవిధంగా ముందుకు తీసుకు వెళ్తున్నారనే కోణంలోనూ జగన్ దృష్టి సారించారు.
వీరిని మాత్రం….
ఈ క్రమంలో టాప్ టెన్ మంత్రుల జాబితాను ఆయన రెడీ చేసుకున్నారు. వచ్చే ఏడాది కూడా వీరు టాప్ టెన్‌లో నిలబడితే.. రెండున్నరేళ్ల తర్వాత జరుగుతుందని చెప్పిన మంత్రి వర్గ విస్తరణలో వీరికి చోటు పదిలం కానుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కేబినెట్ ఏర్పాటు చేసుకున్నప్పుడే రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మంది మంత్రులను తొలగించి వారి స్థానంలో కొత్త వారిని తీసుకుంటానని చెప్పారు. ఇప్పటికే ఏడాది పాలన పూర్తవ్వడం ఒక ఎత్తు అయితే.. మోపిదేవి వెంకట రమణ, పిల్లి బోస్ రాజ్యసభకు వెళుతుండడంతో వారి స్థానాల్లో కొత్త మంత్రులను తీసుకోవాల్సి ఉంది.
అల్లాడిపోతున్న మంత్రి….
దీంతో జగన్ వీరిద్దరితో పాటు మరి కొందరిని తప్పిస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులు అలెర్ట్ అయ్యారు. అయితే, రెండో సారి కూడా అంటే మొత్తంగా ఐదేళ్లపాటు తాను మంత్రి వర్గంలోనే ఉండాలని కోరుకుంటున్న పశ్చిమ గోదావరికి చెందిన మంత్రి ఒకరు ఇప్పుడు అల్లాడిపోతున్నారు. దీనికి కారణం.. జగన్ దగ్గర ఉన్న టాప్ టెన్ మంత్రుల జాబితాలో ఆయన పేరు లేకపోవడమేనని అంటున్నారు పరిశీలకులు. ఆయన చాలా సీనియర్ రాజకీయ నేత అయినప్పటికీ.. పార్టీకి, ప్రభుత్వానికి ఉపయోగపడేలా కార్యక్రమాలు నిర్వహించడం లేదనే విమర్శలు గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి.
సంబంధంలేని శాఖల్లో….
అంతేకాదు, తనకు సంబంధం లేని మంత్రుల శాఖల్లోనూ ఆయన వేలు పెడుతున్నారని, నియోజకవర్గాల్లోనూ ఆయన వ్యవహార శైలిపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారని జగన్ కు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో టాప్ టెన్ జాబితాలో సదరు మంత్రి పేరు లేదు. పార్టీ పరిశీలకుల ద్వారా కూడా ఇప్పటికే ఆయనకు వార్నింగ్‌లు వెళ్లాయట. ఇక జగన్ సదరు మంత్రి సామాజిక వర్గానికే చెందిన మరో ఎమ్మెల్యేకు ఇప్పటికే మంత్రి పదవి హామీ ఇచ్చి ఉండడం కూడా ఈయన మంత్రి పదవికి ఎసరు ఖాయమే అంటున్నారు. దీంతో ఆయన తన అనుచరుల వద్ద ఇదే విషయాన్ని చెప్పుకొని ఉసూరు మంటున్నారు. జగన్ కేబినెట్ నుంచి పడే వికెట్లలో ఫస్ట్ వికెట్ ఆయనదే అని టాక్..?