వారి మద్దతు కూడగట్టేందుకు జగన్?

చిత్ర పరిశ్రమ షూటింగ్స్ మొదలు థియేటర్లు తెరిచేవరకు ఉన్న అవరోధాలపై చర్చించిందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అవుతూ వస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి తో చర్చలు పూర్తి [more]

Update: 2020-06-13 08:00 GMT

చిత్ర పరిశ్రమ షూటింగ్స్ మొదలు థియేటర్లు తెరిచేవరకు ఉన్న అవరోధాలపై చర్చించిందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అవుతూ వస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి తో చర్చలు పూర్తి అయ్యాక ఏపీకి తరలివచ్చిన చిరంజీవి నేతృత్వంలోని బృందం సిఎం జగన్ తో మంచి చెడ్డా మాట్లాడేసింది. ఇక్కడ సినిమా కష్టాలను టాలీవుడ్ పెద్దలు వెళ్లబోసుకున్నారు జగన్ ముందు. అంతా బాగానే ఉంది. వారికి అండ దండ ఇస్తామని భోళాశంకరుడిలా అభయం ఇచ్చిన జగన్ విశాఖలో చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని టాలీవుడ్ లెజెండ్స్ ముందు ఆఫర్ పెట్టేశారు. మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చాక చిరంజీవి దానికి గతంలోనే మద్దతు పలకడం తెలిసిందే. తాజాగా నాగార్జున, దిల్ రాజు, దగ్గుబాటి సురేష్, సి కళ్యాణ్, రాజమౌళి వంటివారితో నేరుగా సిఎం ఈ విషయాన్ని ప్రస్తావించి మరోసారి చర్చకు తెరతీశారు.

పరిశ్రమ కు ప్రోత్సహం …

చిత్ర పరిశ్రమ వర్గాలు విశాఖ తరలివస్తాయి అంటే వారి స్టూడియోలకు తక్కువ ధరకే భూమి కేటాయిస్తామని జగన్ సర్కార్ అభయం ఇచ్చేసింది. అలాగే కళాకారులకు చౌకగానే నివాసల కోసం స్థలాలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇప్పటికే జగన్ సర్కార్ ఎపి లో షూటింగ్స్ కి ఉచితంగా జరుపుకునేందుకు అనుమతులు మంజూరు చేసింది. చిత్ర సీమ కు అనేక ప్రోత్సహకాలు ప్రకటిస్తూ జీవో సైతం జారీ చేసేసింది. ఈ నేపథ్యంలోనే వారికి మరిన్ని ఆఫర్ లు ముందు పెట్టింది జగన్ సర్కార్.

మద్దతు ఇవ్వకండి …

చిత్ర సీమ పెద్దలు జగన్ తో భేటీ అంశం ముందే ఫిక్స్ కావడంతో టిడిపి అమరావతి జెఎసిని రంగంలోకి దింపింది. రాజధాని తరలింపు కి సినీ ప్రముఖులు మద్దతు ఇవ్వొద్దంటూ అమరావతి ప్రాంత రైతులు కొందరు మెరుపు నిరసన తెలిపి మీడియా ను ఆకర్షించారు. ముఖ్యమంత్రితో సినీ ప్రముఖుల భేటీకి వెళ్ళే రహదారిలో కొద్ది సంఖ్యలో వీరు తమ ఆందోళన తెలపడం విశేషం. ఏది ఏమైనప్పటికి మూడు రాజధానులపై జగన్ పట్టుదలగా ఉన్న నేపథ్యంలో ఆయన ప్రతీ నిర్ణయం విశాఖ అభివృద్ధి వైపే ఉంటుందని మరోసారి స్పష్టం అయ్యిందన్న టాక్ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా వినిపిస్తుంది. జగన్ ఆలోచనకు సినీ లోకం ఏ మేరకు మద్దతు ఇస్తుందో విశాఖ లో కాలు మోపేందుకు ఈమేరకు ఆసక్తి చూపుతారో రాబోయే రోజుల్లో తేలనుంది.

Tags:    

Similar News