మారిన జగన్ …? ఆయన దెబ్బకేనా?

వైసిపి లో సంభవిస్తున్న పరిణామాల నేపథ్యంలో ఎపి సిఎం వైఎస్ జగన్ తన పంథా మార్చుకున్నట్లే కనిపిస్తుంది. గత ఏడాదిగా ముఖ్యమంత్రితో భేటీ అయ్యేందుకు ఎమ్యెల్యేలకు, ఎంపిలకు [more]

Update: 2020-06-27 06:30 GMT

వైసిపి లో సంభవిస్తున్న పరిణామాల నేపథ్యంలో ఎపి సిఎం వైఎస్ జగన్ తన పంథా మార్చుకున్నట్లే కనిపిస్తుంది. గత ఏడాదిగా ముఖ్యమంత్రితో భేటీ అయ్యేందుకు ఎమ్యెల్యేలకు, ఎంపిలకు ఇతర నేతలకు ఛాన్స్ ఏ మాత్రం ఉండేది కాదు. సిఎం బిజీ షెడ్యూల్ కారణంగానో ఆయన కోటరీ చూసేవారు దూరం పెట్టడంతోనో జగన్ కి నేతలకు మధ్య తెలియని దూరం పెరుగుతూ వచ్చేది. దీనిపై మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ వంటివారు సైతం ఈ వైఖరి సరిదిద్దుకోవాలని గతంలోనే సూచించారు కూడా. అయితే ఆయన తీరు ఏ మాత్రం మారలేదు.

పర్యటనలు, అసెంబ్లీ సమావేశాల్లోనే …

ముఖ్యమంత్రిని నేతలు కలుసుకోవాలంటే జిల్లాల పర్యటనల్లోనూ, లేదా అసెంబ్లీ సమావేశాల్లో కొద్దిమందికే అవకాశం దొరుకుతుంది. అప్పుడు కూడా పూర్తిస్థాయిలో నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవడానికి ఛాన్స్ ఉండటం లేదు. ఇది చాలా గ్యాప్ ను పార్టీ అధినేతకు నాయకులకు పెంచుతుంది. నేతలతో భేటీ కావడం వల్ల అనేక సమస్యలు వస్తాయని నియోజకవర్గాల్లో గ్రూప్ ల గొడవలు, నామినేటెడ్ పదవులకోసం, అభివృద్ధి నిధుల కోసం లేని పోని వత్తిడులు మొదలౌతాయని ఆయన సలహాదారులు క్షేత్ర స్థాయిలో ఉన్న పార్టీ వర్గాలను దూరం పెట్టాలనే కోరినట్లు దాన్ని జగన్ ఆచరణలో పెట్టారన్న ప్రచారం సాగింది. జగన్ ను కలిసిన వారు సిఎం ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తో భేటీ అవుతున్నారు.

రఘురామకృష్ణం రాజు ఎపిసోడ్ తో …

నర్సాపురం ఎంపి రఘురామకృష్ణం రాజు ఎపిసోడ్ లో ముఖ్యమంత్రి జగన్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని మీడియా ముందుకు వచ్చి బాహాటంగానే చెప్పారు. దాంతో ఇదే అభిప్రాయం చాలా మంది లో ఉందని పార్టీ అధినేత గుర్తించారు. ఈ నేపథ్యంలో ఎమ్యెల్యేలు, ఎంపీ లు ఇతర ముఖ్య నేతలతో రోజు కొంత సమయాన్ని గడిపేలా జగన్ తన షెడ్యూల్ మార్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రతిరోజూ సాయంత్రం…..

రోజు సాయంత్రం సమయంలో ఐదు నుంచి పదిమందివరకు నేరుగా వన్ టూ వన్ జగన్ అపాయింట్మెంట్ కోరిన నేతలను కలుస్తున్నారు. ఈ సందర్భంగా తమ నియోజకవర్గంలో సమస్యలు ప్రస్తావిస్తున్నారు ఎమ్యెల్యేలు. సంక్షేమ పథకాలు బాగున్నాయని చెబుతూనే అందులో లోటుపాట్లు ప్రస్తావిస్తూ అభివృద్ధి కి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలుస్తుంది. వారి విజ్ఞాపనలు ఆయా శాఖలకు ముఖ్యమంత్రి వెంటనే పంపి చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నారు. తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఇప్పటికైనా గేట్లు తీయడంతో వైసిపి లో మాత్రం ఆనందం వ్యక్తం అవుతుంది.

Tags:    

Similar News