జగన్ సిగ్నల్స్ ఇచ్చేశారుగా.. వారికే ఛాన్స్ అట

అన్ని వర్గాలకు సమ న్యాయం చేయడం మా ఉద్దేశ్యం. ఇది ప్రజలకు అర్ధం అయ్యేలా పదవుల పందేరం జరగాలి. ఇదే లక్ష్యం గా జగన్ సర్కార్ వచ్చిన [more]

Update: 2020-07-15 06:30 GMT

అన్ని వర్గాలకు సమ న్యాయం చేయడం మా ఉద్దేశ్యం. ఇది ప్రజలకు అర్ధం అయ్యేలా పదవుల పందేరం జరగాలి. ఇదే లక్ష్యం గా జగన్ సర్కార్ వచ్చిన నాటినుంచి తమ అడుగులు వేస్తుంది. రాజ్యసభకు ఇద్దరు బిసి లను పంపడం ఇదే సందేశం అందరికి వెళ్ళేలా చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తెలుగుదేశం పార్టీ లో చంద్రబాబు పగ్గాలు చేపట్టాక రాజ్యసభ కు వెళ్లేవారి విషయంలో బడాబాబులకు మాత్రమే పెద్ద పీట వేసేవారనే విమర్శ బాగా ఉంది.

దూకేస్తారనే వారిని కాకుండా …

దీనికి అప్పటికప్పుడు కాంగ్రెస్ నుంచి ఇన్ స్టెంట్ గా వచ్చిన టిజి వెంకటేష్ ఉదాహరణగా ఆ పార్టీలోనే విమర్శలు ఉన్నాయి. అలాగే పార్టీకి పెట్టుబడి పెట్టే సుజనా చౌదరి, సిఎం రమేష్ లకు బాబు రాజ్యసభకు టిక్ పెట్టిన విషయాన్నీ చెప్పుకుంటారు. అదే విధంగా ఎమ్యెల్సీ లలో కూడా నారాయణ వంటివారికి ఛాన్స్ ఇచ్చి మంత్రులను కూడా చేయడాన్ని గుర్తు చేసుకుంటూ వుంటారు. అయితే చంద్రబాబు ఇంత చేసినా రాజ్యసభ లో టిడిపి సభ్యులుగా ఉన్న వారు బిజెపి లోకి దూకేసి తాము వ్యాపారస్థులమని చెప్పక చెప్పేశారు. ఇలాంటి అనుభవాలనుంచి వైసిపి అధినేత వైఎస్ జగన్ పాఠాలు నేర్చుకున్నారో ఏమో కానీ టిడిపి మార్క్ పాలిటిక్స్ కి దూరంగా తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఎస్సి , మైనారిటీలకు …

గవర్నర్ కోటా ఎమ్యెల్సీ ల భర్తీ లో పార్టీని నమ్ముకున్న మోసేన్ రాజు, అఫ్జల్ ఖాన్ భార్య జకియా ఖాన్ కి అవకాశం ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి. ఎస్సి, మైనారిటీ వర్గాలు జగన్ సర్కార్ అఖండ మెజారిటీ లో కీలకపాత్ర పోషించాయి. ఆ వర్గాల ప్రతినిధులకు ఛాన్స్ ఇవ్వడం ద్వారా గట్టి సందేశం పంపాలన్నదే జగన్ ఉద్దేశ్యం గా కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. ఒక పక్క బిసి లకు మరో పక్క ఎస్సి, ఎస్టీ, మైనారిటీ లను కలుపుకుని వెళుతూ తన స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ చెక్కు చెదరకుండా జగన్ జాగ్రత్త పడుతున్నట్లు పదవుల పంపకం కనిపిస్తుంది. మరో ఎమ్మెల్సీ పదవి మర్రి రాజశేఖర్ కు కన్ఫర్మ్ అయిందని చెబుతున్నారు. అంతే కాదు ఆయారాం గయారాం ల పట్ల జాగ్రత్త పడుతూనే పార్టీని నమ్ముకున్నవారికి అన్యాయం జరగబోదనే సందేశాన్ని బలంగా శ్రేణులకు జగన్ పంపుతున్నారు.

Tags:    

Similar News