వారి వైపే జగన్ చూపు … ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తిగా యంగ్ టీం తోనే ముందుకు సాగనున్నారా ? అవుననే సంకేతాలే వైసిపి నుంచి అందుతున్నాయి. తాజాగా పిల్లి సుభాష్ చంద్రబోస్, [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తిగా యంగ్ టీం తోనే ముందుకు సాగనున్నారా ? అవుననే సంకేతాలే వైసిపి నుంచి అందుతున్నాయి. తాజాగా పిల్లి సుభాష్ చంద్రబోస్, [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తిగా యంగ్ టీం తోనే ముందుకు సాగనున్నారా ? అవుననే సంకేతాలే వైసిపి నుంచి అందుతున్నాయి. తాజాగా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ లను రాజ్యసభకు పంపిన జగన్ వారి స్థానంలో ఖాళీ అయిన క్యాబినెట్ బెర్త్ లు ఎవరికి కేటాయిస్తారనే చర్చ ఆసక్తి రేకెత్తించింది. ఈ నేపథ్యంలో ఆశావహులంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సైతం సిద్ధం అయ్యారు. ముఖ్యంగా ఖాళీ అయిన సామాజికవర్గాల నుంచే జగన్ ఎంపిక ఉంటుందనే సంకేతాలతో ఆ వర్గాలకు చెందిన ఎమ్యెల్యేలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యువ నాయకత్వం వైపే ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెట్టారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
జనరేషన్ గ్యాప్ లేకుండా …
జనరేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవడం యంగ్ చీఫ్ మినిస్టర్ గా వైఎస్ జగన్ కి ప్రస్తుతం అవసరం. తన తండ్రి టీం తో పయనించిన వారికి గట్టిగా చెప్పేందుకు ఆయన వెనుకంజ వేసే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. మోపిదేవి, పిల్లి బోస్, బొత్స వంటివారి తో అన్న ఇలా చేద్దామా అని అడగాలి అదే యువ నేతలు అయితే ఇలా చేయండి అని ఆదేశించే అవకాశం లభిస్తుంది. దాంతో పూర్తిగా తనదైన మార్క్ ను క్యాబినెట్ టీం తో తన ఆలోచనలు ప్రశ్నించే వారు లేకుండా ఉంటేనే మంచిదన్న ఆలోచనతో జగన్ అడుగులు పడుతున్నాయని అందుకే శ్రీకాకుళం జిల్లా పలాస కు చెందిన సిదిరి అప్పలరాజు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్యెల్యే చెల్లుబోయిన వేణుగోపాల్ లను కొత్త బెర్త్ లకు ఎంపిక చేస్తున్నట్లు వైసిపి లో ప్రచారం సాగుతుంది.
అనుభవజ్ఞులు లేకపోతే …
క్యాబినెట్ లో అనుభజ్ఞులు లేకపోయినా ఇబ్బందే అంటున్నారు మరికొందరు. యువకులతో కూడిన టీం మంచిదే అయినా వారికి దిశా దశా నిర్దేశించే వారు లేకపోతే కీలక అంశాల్లో తప్పటడుగులు పడొచ్చని ఆందోళన వ్యక్తం అవుతుంది. సామాజిక వర్గాల సమతులత అన్నది మంచిదే అయినా అనుభవజ్ఞులు సదా సర్కార్ కి అవసరం అంటున్నా జగన్ మాత్రం తన స్టైల్ లోనే మార్క్ చూపేందుకు సిద్ధం అయిపోయారు. కొత్త మంత్రులు మరి జగన్ ఆశలకు అనుగుణంగా ఎలా పనిచేస్తారో చూడాలి.