అదే తారకమంత్రం … జగన్ దూకుడు అందుకేనా …?

టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్ మెంట్ ఈ మూడు మాత్రమే కరోనాపై విజయం సాధించేందుకు ఏకైక ఫార్ములాగా ప్రపంచం గుర్తించింది. అయితే ఈ మూడు త్రికరణ శుద్ధిగా అనుసరించే [more]

Update: 2020-08-04 05:00 GMT

టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్ మెంట్ ఈ మూడు మాత్రమే కరోనాపై విజయం సాధించేందుకు ఏకైక ఫార్ములాగా ప్రపంచం గుర్తించింది. అయితే ఈ మూడు త్రికరణ శుద్ధిగా అనుసరించే రాష్ట్ర ప్రభుత్వాలే దేశంలో అరకొరగా కనిపిస్తున్నాయి. ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు సరికదా మరింతగా టెస్ట్ ల సంఖ్య పెంచుతూ దూసుకుపోతుంది. టెస్ట్ ల సంఖ్య పెరిగితే పాజిటివ్ ల లెక్క పెరుగుతుందని అందరికి తెలిసిందే. అయినా ధైర్యంగా జగన్ సర్కార్ అత్యధిక పరీక్షలు చేయడానికే చూడటం విశేషం.

రోజుకు ఐదు కోట్లరూపాయలు …

కరోనా పరీక్షల కోసం ఎపి ప్రభుత్వం రోజుకు ఐదు కోట్ల రూపాయలు, నెలకు 350 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తుంది. ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న ఖర్చు పెడుతూండటం వల్లే ఇప్పుడు 70 వేలమందికి ఒకే రోజు పరీక్షించే స్థాయికి చేరుకుంది. ఇదో రికార్డ్ అనే చెప్పాలి. ఈనెల 20 వ తేదికి 33 వేలమంది కి పరీక్షలు చేయగలిగిన స్థాయి నుంచి కరోనా పీక్ కి చేరుతున్న నేపథ్యంలో 9 రోజుల్లో టెస్ట్ లను 70 వేలస్థాయికి తీసుకువెళ్లగలిగింది. కేవలం పదిరోజుల్లో ఎపి సర్కార్ సుమారు ఐదు లక్షల పరీక్షలు చేయగలగడం దేశంలోనే ఒక రికార్డ్.

తీవ్ర వత్తిడిలో వైద్య విభాగం …

పెద్ద స్థాయిలో టెస్ట్ ల సంఖ్య పెరిగింది. అదే రీతిలో పాజిటివ్ కేసులు వేలసంఖ్యలో జిల్లాల్లో వస్తున్నాయి. దాంతో ప్రభుత్వ, ప్రయివేట్ ఆసుపత్రుల పై తీవ్ర వత్తిడి పెరిగిపోతుంది. చాలా చోట్ల బెడ్ లు లభించని పరిస్థితి రోగుల్లో ఆందోళన పెంచుతుంది. ప్రభుత్వం చెప్పిన దానికి కింది స్థాయిలో జరిగేదానికి పొంతనే లేకుండా పోతుంది. దీనికి ప్రధాన కారణం పాజిటివ్ ల సంఖ్య అంచనాలకు మించి రావడమే అంటున్నారు. అయితే ఇప్పటికే హోమ్ క్వారంటైన్ కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నా భయంతో చాలామంది వ్యాధి తీవ్రత పెద్దగా లేకపోయినా ఆసుపత్రులకు పరుగులు పెట్టడమే బెడ్స్ దొరక్క పోవడానికి ప్రధాన కారణం గా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వీలైనన్ని క్వారంటైన్ సెంటర్స్ సౌకర్యాల పెంపుకు జగన్ సర్కార్ అడుగులు వేస్తుంది. అవన్నీ అందుబాటులోకి వస్తే పరిస్థితి కొంత మెరుగు పడొచ్చు

Tags:    

Similar News